Saturday, July 9, 2016

క్షీరసాగరమథనం – తలఁపఁ

8-226-సీ.
లఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా
వుఁడవు; కాలక్రతువులును నీవ
త్యంబు ధర్మ మక్షరము ఋతంబును
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు
ఛందోమయుండవు త్త్వరజస్తమ
శ్చక్షుండవై యుందుర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ
ద్రోహభయము చోద్యంబు గాదు;
8-226.1-తే.
లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన ట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష! 
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!
టీకా:
            తలపన్ = ఆలోచించిచూసినచో; ప్రాణ = జీవము; ఇంద్రియ = ఇంద్రియములు; ద్రవ్య = పదార్థములు; గుణ = గుణములు; స్వ = నిజ; భావుండవు = భావములే యైనవాడవు; కాల = కాలము; క్రతువులును = యజ్ఞములును; నీవ = నీవే; సత్యంబున్ = విహితమైన అంశము; ధర్మము = ధర్మము; అక్షరమున్ = ఓంకారము; ఋతంబును = అనిషిద్దమైన విషయము; నీవ = నీవే; ముఖ్యుండవు = ఆధారభూతుడవు; నిఖిలమున్ = సమస్తమున; కున్ = కు; ఛందోమయుండవు = వేదరూపుడవు; సత్త్వ = సత్త్వగుణము; రజస్ = గజోగుణము; తమస్ = తమోగుణము; చక్షుండవు = నేత్రములుగాగలవాడవు; ఐ = అయ్యి; ఉందు = ఉంటావు; సర్వ = సమస్తమైన; రూప = రూపములునైనవాడ; కామ = మన్మథుడు; పుర = త్రిపురాసురులు; అధ్వర = దక్ష యజ్ఞము; కాలగర = కాలకూటవిషము; ఆది = మున్నగువాని వలన; భూత = జీవ; ద్రోహ = హాని యనెడి; భయము = సంకోచము; చోద్యంబుగాదు = ఏమాత్రము లేదు. 
            లీలన్ = క్రీడగా; లోచన = కంటి; వహ్ని = మంటల; స్ఫులింగ = అగ్నికణముల; శిఖలన్ = సెగలచే; అంతక = యముడు; ఆదులన్ = మొదలగువారిని; కాల్చిన = కాల్చివేసిన; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; రాజ = చంద్ర; ఖండ = కళ; అవతంస = సిగబంతిగాగలవాడ; పురాణ = సృష్ట్యాదినుండిగల; పురుష = పురుషుడా; దీన = దీనులను; రక్షక = రక్షించువాడా; కరుణ = దయా; ఆత్మ = స్వరూప; దేవదేవ = దేవతలకేదేవుడా.
భావము:
            చంద్ర కళను శిరసున ధరించు వాడా! పురాణ పురుషుడా! దీనులను రక్షించువాడా! దయామయా! దేవ దేవ! తరచి చూస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్యమూ, గుణాలూ సర్వం నీ స్వభావసిద్ధాలు. కాలమూ యజ్ఞమూ నీవే; సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే; అన్నింటికి నీవే ఆధారం; వేదరూపుడవు నీవే; సత్త్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలూ నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు; సమస్తమైన రూపాలు నీవే; లీలగా చూసే నీ మూడోకన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు; మన్మథుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞం, కాలకూటవిషం మున్నగు సర్వ భాతాల వలన నీకు హాని కలుగుతుంది అని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: