Friday, July 31, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఇట్లు త్రైలోక్య

7-74-వచనము
ఇట్లు త్రైలోక్యసంతాపకరంబైన దైత్యరాజతపోవిజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబునకుం జని లోకేశ్వరుండయిన బ్రహ్మకు వినతులయి యిట్లని విన్నవించిరి.
          రాక్షసరాజు హిరణ్యకశిపుడి తపస్సు తీవ్రత వలన ఇలా ముల్లోకాలలోనూ తాపం చెలరేగుతోంది. ఆ తాపాన్ని తట్టుకోలేక దేవతలు స్వర్గలోకం నుండి బయలుదేరి బ్రహ్మ ఉండే సత్యలోకానికి వెళ్ళారు. లోకాలన్నిటికి ప్రభువైన బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఇలా తమ బాధలు చెప్పుకోసాగారు.
७-७४-वचनमु
इट्लु त्रैलोक्यसंतापकरंबैन दैत्यराजतपोविजृंभणंबु सैरिंपक निलिंपुलु नाकंबु विडिचि ब्रह्मलोकंबुनकुं जनि लोकेश्वरुंडयिन ब्रह्मकु विनतुलयि यिट्लनि विन्नविंचिरि.
          ఇట్లు = ఈ విధముగ; త్రైలోక్య = ముల్లోకములకు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3నరకలోకము}; సంతాప = మిక్కలి తాపము; కరంబు = కలిగించెడిది; ఐన = అయిన; దైత్య = రాక్షసులకు; రాజ = రాజు యొక్క; తపస్ = తపస్సు; విజృంభణంబున్ = పెంపును; సైరింపన్ = ఓర్చుకొన; చాలక = లేక; నిలింపులు = దేవతలు; నాకంబున్ = స్వర్గమును; విడిచి = వదలివేసి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చని = వెళ్ళి; లోక = ఎల్లలోకములకు; ఈశ్వరుండు = ప్రభువు; అయిన = ఐనట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; వినతులు = మ్రొక్కినవారు; అయి = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; విన్నవించిరి = మనవిచేసుకొనిరి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, July 30, 2015

సుయజ్ఞోపాఖ్యానము - అని యిట్లు

7-68-వచనము
అని యిట్లు కపటబాలకుండై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు విని సుయజ్ఞుని బంధువు లెల్ల వెఱఁగుపడి సర్వప్రపంచంబు నిత్యంబుగాదని తలంచి శోకింపక సుయజ్ఞునికి సంపరాయిక కృత్యంబులు జేసి చని;రంత నంతకుం డంతర్హితుం డయ్యె" నని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లిని దమ్ముని భార్యలం జూచి యిట్లనియె.
          అని ఇలా విలాసంగా మాయాబాలకుడి రూపంలో వచ్చి యముడు కుళింగ పక్షి కధ తోపాటు చెప్పిన ఊరడింపు మాటలు విన్న సుయజ్ఞుని బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ విశ్వం శాశ్వతం కాదు అని తెలుసుకున్నారు. విలపించటం మానారు. కర్తవ్యం ఆలోచించి సుయజ్ఞునికి ఉత్తరక్రియలు చేసి వెళ్ళిపోయారు. యముడు అంతర్ధానం అయిపోయాడు అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లికి, తమ్ముడి భార్యలకు ఇలా చెప్పాడు.
७-६८-वचनमु
अनि यिट्लु कपटबालकुंडै क्रीडिंचुचुन्न यमुनि युपलाल नालापंबुलु विनि सुयज्ञुनि बंधुवु लेल्ल वेर्रँगुपडि सर्वप्रपंचंबु नित्यंबुगादनि तलंचि शॉकिंपक सुयज्ञुनिकि संपरायिक कृत्यंबुलु जॅसि चनि;रंत नंतकुं डंतर्हितुं डय्ये" ननि चेप्पि हिरण्यकशिपुंडु दन तल्लिनि दम्मुनि भार्यलं जूचि यिट्लनिये.
        అని = అని; ఇట్లు = ఈ విధముగ; కపట = మాయ; బాలకుండు = పిల్లవాడు; = అయ్యి; క్రీడించుచున్న = విహరించుచున్న; యముని = యముడు యొక్క; ఉపలాలన = ఓదార్పు; ఆలాపంబులు = మాటలను; విని = విని; సుయజ్ఞుని = సుయజ్ఞని యొక్క; బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరును; వెఱగుపడి = తెల్లబోయి; సర్వ = సమస్తమైన; ప్రపంచంబున్ = సృష్టియంతయును; నిత్యంబున్ = శాశ్వతమైనది; కాదు = కాదు; అని = అని; తలంచి = భావించి; శోకింపక = దుఃఖింపక; సుయజ్ఞుని = సుయజ్ఞుని; కిన్ = కి; సంపరాయికకృత్యంబులున్ = అంత్యక్రియలు; చేసి = ఆచరించి; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అంతట; అంతకుడు = యముడు; అంతర్హితుండు = కానరానివాడు; అయ్యెన్ = అయిపోయెను; అని = అని; చెప్పి = చెప్పి; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; తన = తన యొక్క; తల్లిని = అమ్మను; తమ్ముని = సోదరుని యొక్క; భార్యలన్ = భార్యలను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

సుయజ్ఞోపాఖ్యానము - అని తెలియం బలికిన

7-70-వచనము
అని తెలియం బలికిన హిరణ్యకశిపుని వచనంబులు విని దితి గోడండ్రునుం దానును శోకంబు మాని తత్త్వవిలోకనంబు గలిగి లోకాంతరగతుండైన కొడుకునకు వగవక చనియె" నని చెప్పి నారదుండు ధర్మనందనున కిట్లనియె.
          ఇలా హిరణ్యకశిపుడు తెలియ జెప్పగా, దితి, ఆమె కోడళ్ళు దుఃఖం మానేసారు. తత్వం తెలుసుకున్నారు. చనిపోయిన కొడుకు కోసం విలపించటం మాని వెళ్ళిపోయారుఅని నారదమహర్షి యుధిష్టర మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు.
७-७०-वचनमु

अनि तेलियं बलिकिन हिरण्यकशिपुनि वचनंबुलु विनि दिति गॉडंड्रुनुं दानुनु शॉकंबु मानि तत्त्वविलॉकनंबु गलिगि लॉकांतरगतुंडैन कोडुकुनकु वगवक चनिये" ननि चेप्पि नारदुंडु धर्मनंदनुन किट्लनिये.
          అని = అని; తెలియన్ = బోధపడునట్లు; పలికినన్ = చెప్పగా; హిరణ్యకశిపుని = హిరణ్యకశిపుని; వచనంబులు = మాటలు; విని = విని; దితి = దితి; కోడండ్రును = కోడళ్ళు; తానునున్ = తను; శోకంబు = దుఃఖము; మాని = విడిచిపెట్టి; తత్త్వ = తత్త్వము యొక్క; విలోకనంబు = దృష్టి; కలిగి = పొంది; లోక = లోకము; అంతర = ఇతరమైనదానికి; గతుండు = వెళ్ళినవాడు; ఐన = అయిన; కొడుకున్ = పుత్రున; కున్ = కు; వగవక = విచారించక; చనియెన్ = వెళ్ళిపోయిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, July 29, 2015

సుయజ్ఞోపాఖ్యానము - అదిరెం

7-73-మత్తేభ విక్రీడితము
దిరెం గుంభుని, సాద్రియై కలఁగె నే డంభోనిధుల్, తారకల్
చెరెన్ సగ్రహసంఘలై, దిశలు విచ్ఛిన్నాంతలై మండెఁ, బె
ల్లరెన్ గుండెలు జంతుసంహతికి, నుగ్రాచార దైత్యేంద్రమూ
ర్ధదిశోద్ధూతసధూమ హేతిపటలోదంచత్తపోవహ్నిచేన్.
    రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు భీకర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. అతని శిరస్సు పై నుండి పొగలు లేచాయి. అగ్నిజ్వాలలు చెలరేగి మింటనంటసాగాయి. ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా కంపించి పోతోంది. సప్తసముద్రాలూ అల్లకల్లోలం కాసాగాయి. నక్షత్రాలు, గ్రహాలతో పాటు చెదిరిపోతున్నాయి, దిక్కులన్నీ ఛిన్నాభిన్నాలై మండిపోతున్నాయి. జీవజాలం అంతటికి గుండెలు దడదడలాడుతున్నాయి.
७-७३-मत्तॅभ विक्रीडितमु
अदिरें गुंभुनि, साद्रियै कलँगे ने डंभोनिधुल, तारकल
चेदरेन सग्रहसंघलै, दिशलु विच्छिन्नांतलै मंडेँ, बे
ल्लदरेन गुंडेलु जंतुसंहतिकि, नुग्राचार दैत्येंद्रमू
र्धदिशोद्धूतसधूम हेतिपटलोदंचत्तपोवह्निचेन.

          అదిరెన్ = అదిరిపోయినది; కుంభిని = భూమి; సాద్రి = పర్వతములతోకూడినది; = అయ్యి; కలగెన్ = కలతబారెను; ఏడంభోనిధుల్ = సప్తసముద్రములు {సప్తసముద్రములు - 1లవణసముద్రము 2ఇక్షుసముద్రము 3సురాసముద్రము 4ఘృతసముద్రము 5దధిసముద్రము 6క్షీరసముద్రము 7జలసముద్రము}; తారకల్ = చుక్కలు; చెదరన్ = చెల్లాచెదురుయగునట్లు; సగ్రహసంఘలై = గ్రహకూటములతోకూడినవి; = అయ్యి; దిశలు = దిక్కులు; విచ్ఛిన్నాంతలు = చీలిన అంచులుగలవి; = అయ్యి; మండెన్ = మండిపోయినవి; పెల్లు = మిక్కిలి; అదరెనే = అదిరిపోయినవి; గుండెలు = గుండెలు; జంతు = జంతువుల; సంహతి = సమూహముల; కిన్ = కి; ఉగ్ర = దారుణమైన; ఆచార = ప్రవర్తనలుగల; దైత్య = రాక్షసుల; ఇంద్ర = రాజు యొక్క; మూర్ధ = తలలోనుండి; ఉద్ధూత = లేచిన; సద్ధూమహేతి = పగతోకూడిన మంటల; పటల = సమూహములతో; ఉదంచత్ = పొంగుతున్న; తపః = తపస్సు అనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత;
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :