Thursday, July 7, 2016

క్షీరసాగరమథనం – అగ్నిముఖంబు

8-224-సీ.
గ్నిముఖంబు; రాపరాత్మక మాత్మ
కాలంబు గతి; రత్నర్భ పదము
శ్వసనంబు నీ యూర్పుసన జలేశుండు
దిశలుఁ గర్ణంబులుదివము నాభి
సూర్యుండు గన్నులుశుక్లంబు సలిలంబు
ఠరంబు జలధులుదలు శిరము
ర్వౌషధులు రోమయములు; శల్యంబు
ద్రులు; మానస మృతకరుఁడు;
8-224.1-తే.
ఛందములు ధాతువులు; ధర్మమితి హృదయ
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు
యిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.
టీకా:
            అగ్ని = అగ్ని; ముఖంబున్ = ముఖము; పర = పరమాత్మ; అపర = జీవాత్మ; ఆత్మకము = కలయిక; ఆత్మ = ఆత్మ; కాలంబు = కాలము; గతి = నడక; రత్నగర్భ = సముద్రము {రత్నగర్భ - రత్నములు గర్భమునగలది, సముద్రము}; పదము = పాదము; శ్వసనంబు = వాయువు; నీ = నీ యొక్క; ఊర్పు = శ్వాస; రసన = నాలుక; జలేశుండు = వరుణుడు {జలేశుడు - నీటికి ప్రభువు, వరుణుడు}; దిశలున్ = దిక్కులు; కర్ణంబులు = చెవులు; దివము = పగలు; నాభి = బొడ్డు; సూర్యుండు = సూర్యుడు; కన్నులు = నేత్రములు; శుక్రంబు = వీర్యము; సలిలంబు = నీరు; జఠరంబు = గర్భము; జలధులు = సముద్రములు {జలధి - జలమునకు నిధి, సముద్రము}; చదలు = ఆకాశము; శిరము = తల; సర్వ = సమస్తమైన; ఓషధులు = ఓషధులు; రోమ = రోమముల; చయములు = సమూహములు; శల్యంబు = ఎముకలు; అద్రులు = పర్వతములు; మానసము = మనస్సు; అమృతకరుడు = చంద్రుడు {అమృతకరుడు - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు}. 
            ఛందములు = వేదములు; ధాతువులు = సప్తధాతువులు {సప్తధాతువులు - 1వస 2అసృక్కు 3మాంసము 4మేధస్సు 5అస్థి 6మజ్జ 7శుక్లములు పక్షాంతరమున 1రోమ 2త్వక్ 3మాంస 5అస్థి 6స్నాయు 6మజ్జా 7ప్రాణములు}; ధర్మ = శాస్త్రధర్మముల; సమితి = సమూహములు; హృదయము = హృదయము; ఆస్య = ముఖములు; పంచకము = ఐదును; ఉపనిషత్ = ఉపనిషత్తుల; ఆహ్వయంబున్ = పేర్లు; అయిన = ఐన; నీ = నీ యొక్క; రూపు = స్వరూపము; పరతత్త్వము = ఆత్మజ్ఞానరూపము; ఐ = అయ్యి; శివ = శివుడు యనెడి; ఆఖ్యము = పేరుగలది; ఐ = అయ్యి; స్వయంజ్యోతి = స్వయంప్రకాశకుడవు; ఐ = అయ్యి; ఒప్పున్ = తగును; ఆద్యము = సృష్ట్యాదినుండిగలది; అగుచున్ = అగుచు.
భావము:
            అగ్ని నీ ముఖము; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు; కాలం నీ నడక; భూమండలం నీ పాదం; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక; దిక్కులు నీ చెవులు; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ దృష్టి; నీరు నీ వీర్యం; సముద్రాలు నీ గర్భం; ఆకాశం నీ శిరస్సు; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకలగూడు; చంద్రుడు నీ మనస్సు; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం; నీవు స్వయంప్రకాశుడవు; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: