Thursday, July 14, 2016

క్షీరసాగరమథనం – ప్రాణేచ్ఛ వచ్చి

8-234-క.
ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రాణుల కిత్తురు సాధులు 
బ్రాణంబులు నిమిష భంగుము లని మగువా!
8-235-క.
హితము జేయ నెవ్వఁడు
మ హితుం డగును భూత వంచకమునకుం
హితమె పరమ ధర్మము
హితునకు నెదురులేదు ర్వేందుముఖీ!
టీకా:
            ప్రాణేచ్ఛన్ = ప్రాణముకాపాడగోరి; వచ్చి = వచ్చి; చొచ్చిన = ఆశ్రయించిన; ప్రాణులన్ = జీవులను; రక్షింపవలయున్ = కాపాడవలెను; ప్రభుల్ = ప్రభువుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ప్రాణుల్ = జీవులను; కున్ = కు; ఇత్తురు = ఇచ్చెదరు; సాధులు = ఉత్తములు; ప్రాణంబులున్ = ప్రాణములను; నిమిష = నిమిషములో; భంగురములు = నశించునవి; అని = అని; మగువా = ఇంతీ.
            పర = ఇతరులకు; హితమున్ = సహాయమును; చేయన్ = చేయుటకు; ఎవ్వడు = ఎవరైతే; పరమ = అత్యంత; హితుండు = సుముఖుడు; అగును = అగునో; భూత = ప్రాణుల యొక్క; వంచకమున్ = వంచింపబడినవారికి; పరహితమె = పరోపకారముచేయుటే; పరమ = అత్యుత్తమ; ధర్మము = ధర్మము; పరహితున్ = పరోపకారి; కున్ = కి; ఎదురు = తిరుగు; లేదు = లేదు; పర్వేందుముఖీ = సుందరీ {పర్వేందుముఖి - పర్వము}.
భావము:
            ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణుల ప్రాణాలను సైతం లెక్కచేయరు.
            ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకూ పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోకారికి ఎక్కడా తిరుగు లేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: