Wednesday, July 27, 2016

క్షీరసాగరమథనం – ఎల్ల ఋతువులందు

అష్టమ స్కంధముకల్పవృక్షావిర్భావము

8-260-వ.
మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ.
8-261-ఆ.
ల్ల ఋతువులందు నెలరారి పరువమై
యింద్రువిరులతోఁట కేపు దెచ్చి
కోరి వచ్చు వారి కోర్కుల నీనెడు
వేల్పు మ్రాను పాలవెల్లిఁ బుట్టె.

టీకా:
            మఱియున్ = ఇంకను; = ; తరంగిణీవల్లభున్ = సాగరుని; మథించు = చిలికెడు; ఎడన్ = సమయమునందు.
            ఎల్ల = అన్ని; ఋతువుల్ = కాలముల; అందున్ = లోను; ఎలరారి = అతిశయించి; పరువము = పంట కొచ్చినది; ఐ = అయ్యి; ఇంద్రున్ = ఇంద్రునియొక్క; విరుల = పూల; తోట = తోట; కిన్ = కి; ఏపు = అధిక్యమును; తెచ్చి = కూర్చి; కోరి = ఆశ్రయించి; వచ్చు = వచ్చెడి; వారి = వారియొక్క; కోర్కులన్ = కోరికలను; ఈనెడు = తీర్చెడిది యగు; వ్రేల్పుమ్రాను = కల్పతరువు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టె = పుట్టెను.

భావము:
            సముద్రాలలో రాజువంటి ఆ పాలసముద్రాన్ని ఇంకా చిలికేటప్పుడు. . .
            అందులోనుండి కల్పవృక్షం పుట్టింది; ఇంద్రుని నందన వనానికి ఇంపు ఇచ్చే ఆ కల్పవృక్షం, అన్నిఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూస్తుంటుంది; ఆశ్రయించిన వారి కోర్కుల నెల్ల తీరుస్తుంది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: