Tuesday, July 19, 2016

క్షీరసాగరమథనం – కదలం బాఱవు

8-243-వ.
అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున.
8-244-మ.
లం బాఱవు పాఁప పేరు; లొడలన్ ర్మాంబుజాలంబు పు
ట్టదునేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్
నాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
దిలుండై కడి జేయుచోఁ దిగుచుచో క్షించుచో మ్రింగుచోన్.
టీకా:
            ఆ = ఆ; అవిరళ = అంతులేని, ప్రచండమైన; మహా = గొప్ప; గరళ = విష; దహన = ని; పాన = తాగెడి; సమయంబునన్ = సమయనునందు.
            కదలన్ = కదలి; పాఱవు = పోవు; పాప = పాముల; పేరుల్ = దండలు; ఒడలన్ = దేహముపైన; ఘర్మ = చెమట; అంబు = నీటిబిందువుల; జాలంబున్ = సమూహముకూడ; పుట్టదు = పుట్టుటలేదు; నేత్రంబులున్ = కన్నులైనను; ఎఱ్రన్ = ఎర్రగా; కావు = కావు; నిజ = తన యొక్క; జూటా = జటముడి యందలి; చంద్రుడున్ = చంద్రుడుకూడ; కందడున్ = ఎర్రబారిపోడు; వదన = మోము యనెడి; అంభోజము = పద్మము; వాడదున్ = వాడిపోదు; ఆ = ఆ; విషమున్ = విషమును; ఆహ్వానించుచోన్ = స్వీకరించేటప్పుడు; డాయుచో = దగ్గరకుచేరేటప్పుడు; పదిలుండు = స్థిరుడు; ఐ = అయ్యి; కడిన్ = ముద్దగా; చేయుచోన్ = చేసేటప్పుడు; తిగుచుచోన్ = తీసుకొనేటప్పుడు; భక్షించుచోన్ = తినేటప్పుడు; మ్రింగుచోన్ = మింగేటప్పుడు.
భావము:
            పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . .
            మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎర్రబార లేదు; సిగలోని చంద్రుడు కందిపో లేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: