Sunday, July 31, 2016

క్షీరసాగరమథనం – కెంపారెడు

8-267-క.
కెంపారెడు నధరంబును
జంపారెడి నడుము సతికి శంపారుచులన్
సొం పారు మోముఁ గన్నులుఁ
బెంపారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్.
8-268-వ.
అని జనులు పొగడుచుండ

టీకా:
            కెంపారెడు = ఎర్రగా మెరిసెడి; అధరంబును = పెదవులు; జంపారెడి = ఊగుతున్న్; నడుము = నడుము; సతి = స్త్రీ; కిన్ = కి; శంపా = మెరుపుల యొక్క; రుచులన్ = కాంతులతో; సొంపారు = చక్కదనాలుపొంగెడి; మోమున్ = ముఖము; కన్నులున్ = కళ్ళు; పెంపారుచును = పెద్ద వగుచు; ఒప్పు = చక్కనగు; కొప్పు = సిగ; పిఱుదునున్ = పిరుదులు; కుచముల్ = స్తనములు.
            అని = అని; జనులు = లోకులు; పొగుడుచుండన్ = కీర్తించుచుండగ.

భావము:
            “ఎర్రని కెంపులలా మెరిసే పెదవులూ; ఊగుతున్న సన్నని నడుమూ; మెరుపు కాంతుల మేలైన మొగమూ; తళుకులొత్తు కన్నులూ; పెంపొందిన కొప్పు; పెద్ద కటిప్రదేశమూ; చిక్కని కుచాలూ ఎంత చక్కగా ఉన్నాయో అంటూ. .
            ప్రజ లందరూ పొగడుతూ ఉండగా. . .
            ఓహో పోతనగారి పద్యామృతం కదా ఆ పాలేటిరాకుమారి ఇంపును వర్ణంచడానికి పూర్ణానుస్వరపూర్వక పకార ప్రాసను, కందంలో పోతపోసి వర్ణించారా!  


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, July 30, 2016

క్షీరసాగరమథనం – పాలమున్నీటి

8-266-సీ.
పాలమున్నీటి లోలి మీఁది మీఁగడ
మిసిమి జిడ్డునఁ జేసి మేను పడసి 
క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల
మేనిచే గలనిగ్గు మెఱుఁగు జేసి
నాఁటి నాఁటికిఁ బ్రోది వకంపుఁదీవల
నునుఁ బోద నెయ్యంబు నూలుకొలిపి 
క్రొవ్వారు కెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ
బొలసిన వలపులఁ బ్రోది పెట్టి
8-266.1-తే.
సిడి చంపక దామంబు బాగుఁగూర్చి
వాలు క్రొన్నెల చెలువున వాడిఁ దీర్చి
జాణతనమునఁ జేతుల డ్డు విడిచి
లువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు.

టీకా:
            పాలమున్నీటి = సముద్రపు; లోపలి = అందలి; మీది = పైన యుండెడి; మీగడ = మీగడ, మస్తువు; మిసిమి = మిసమిసలాడెడి; జిడ్డునన్ = మెరుగు; చేసి = వలన; మేనున్ = దేహమును; పడసి = పొంది; క్రొక్కారు = వర్షాకాలపు; మెఱుగుల = మెరుపులయొక్క; కొనలన్ = కొసలయొక్క; కొత్తళుకుల = సరికొత్తతళుకుల; మేనిచేగల = కాంతులు తేగల; నిగ్గు = అతియించెడి; మెఱుగుచేసి = మెరుగుపెట్టి; నాటినాటికి = అంతకంతకు; ప్రోదిన్ = పోగుపడెడి; నవకంపు = సరికొత్త; తీవల = తీగలయొక్క; నును = లేత; బోదన్ = కాండములచే; నెయ్యంబున్ = స్నేహమును; నూలుకొలిపి = కుదిర్చి; క్రొవ్వారు = అరవిరసిన; కెందమ్మి = ఎర్రతామరల; కొలకునన్ = కొలను యందు; ప్రొద్దున = ఉదయమే; పొలసిన = వ్యాపించిన; వలపులన్ = సువాసనలను; ప్రోదిపెట్టి = పోగుచేసి. 
            పసిడి = బంగారు; చంపక = సంపెంగల; దామంబున్ = దండలను; బాగుగా = చక్కగా; కూర్చి = కట్టి; వాలు = క్రిందికి దిగుచున్న; క్రొన్నెల = వెన్నెల; చెలువనన్ = సొగసుతో; వాడిదీర్చి = పదునుపెట్టి; జాణతనమునన్ = నేర్పుతో; చేతుల = చేతులయొక్క; జడ్డు = జడత్వమును; విడిచి = విడిచిపెట్టి; నలువ = బ్రహ్మదేవుడు; ఈ = ఈ; కొమ్మన్ = అందగత్తెను; ఒగిన్ = చక్కగా; చేసినాడు = చేసెను; నేడు = ఇప్పుడు.

భావము:
            బ్రహ్మదేవుడు పాలసముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చి దిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు; ఆపైన తొలకరి కాలపు మెరుపుల అంచులలోని సరిక్రొత్త కాంతిరేఖలతో మెరుగు పెట్టాడు; ఆపైన కోమలమైన తీగల నున్నని చెలువంతో ప్రతిదినం చెలిమి చేయించాడు; ఎర్రతామరల కొలనులో వేకువజామున వెదజల్లే సువాసనలు ప్రోదిచేసి; బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి; బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు లక్ష్మీదేవి ఒప్పారింది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, July 29, 2016

క్షీరసాగరమథనం – తొలుకారు మెఱుఁగు

అష్టమ స్కంధములక్ష్మీదేవి పుట్టుట

8-265-క.
తొలుకారు మెఱుఁగు కైవడి
తళ మని మేను మెఱవ గధగ మనుచున్
లుముల నీనెడు చూపులఁ
జెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా!

టీకా:
            తొలుకారు = వర్షాకాలపు; మెఱుగు = మెరుపుతీగల; కైవడి = వలె; తళతళ = తళతళ; అని = అని; మేను = దేహము; మెఱవన్ = మెరియుచుండగా; ధగధగ = ధగధగ; అనుచున్ = అనుచు; కలుములన్ = సంపదలను; ఈనెడు = కలిగించెడి; చూపులన్ = చూపుల; చెలువంబులు = సౌందర్యములకు; మొదలిటెంకి = మూలస్థానము; సిరి = లక్ష్మీదేవి; పుట్టెన్ = పుట్టెను; నృపా = రాజా.

భావము:
            రాజా! పరీక్షిత్తూ! పాలకడలిలో ఆ తరువాత, అందచందాలకు ఆది రూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తళతళ మనే శరీరకాంతితో, సంపదలను వెదజల్లే ధగధగ మనే చూపులుతో విరాజిల్లుతున్నది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, July 28, 2016

క్షీరసాగరమథనం – క్రొక్కారు మెఱుఁగు


అష్టమ స్కంధముఅప్సరావిర్భావము

8-262-వ.
మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె నంత.
8-263-క.
క్రొక్కారు మెఱుఁగు మేనులు 
గ్రిక్కిరిసిన చన్నుఁగవలుఁ గ్రిస్సిన నడుముల్
పిక్కటిలి యున్న తుఱుములుఁ
క్కని చూపులును దివిజతులకు నొప్పెన్.
8-264-వ.
వెండియు నా రత్నాకరంబు నందు సుధాకరుం డుద్భవించి; విరించి యనుమతంబునఁ దన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె; నంత.

టీకా:
                        మఱియున్ = ఇంకను; కొండ = పర్వతపు; కవ్వంబునన్ = కవ్వముతో; కడలిన్ = సముద్రమును; మథింపన్ = చిలుకగా; అప్సరస్ = దేవకన్యలు; జనంబున్ = సమూహము; జనించెన్ = పుట్టనివి; అంతన్ = అంతట.
            క్రొక్కారు = వర్షాకాలపు; మెఱుగు = మెరుపుతీగలవంటి; మేనులున్ = తనువులు; క్రిక్కరిసిన = ఎడములేకవ్యాపించిన; చన్ను = స్తనముల; కవలు = జంటలు (2); క్రిస్సిన = కృశించిన; నడుముల్ = నడుములు; పిక్కటిలి = నిండారి; ఉన్న = ఉన్నట్టి; తుఱుములున్ = కొప్పులు; చక్కని = మనోహరమైన; చూపులునున్ = చూపులు; దివిజసుతల్ = అప్సరసల; కున్ = కు; ఒప్పెన్ = అమరెను.
            వెండియున్ = ఇంకను; రత్నాకరంబున్ = సముద్రము; అందున్ = లో; సుధాకరుండు = చంద్రుడు; ఉద్భవించి = పుట్టి; విరించి = బ్రహ్మదేవుడు; అనుమతంబునన్ = అనుజ్ఞ ప్రకారము; తన = తన యొక్క; యథా = స్వ; స్థానంబునన్ = స్థానమునందు; ప్రవర్తించుచుండెన్ = వర్తిల్లుచుండెను; అంతన్ = అంతట.

భావము:
            మందరపర్వతం అనే కవ్వంతో అలా సాగరాన్ని చిలుకుతుంటే, తరువాత అప్సరస స్త్రీలు పుట్టారు. వారు. . .
            వానాకాలంలో మెరిసే మెరుపుతీగలవంటి మేనులతో, చిక్కని చక్కని స్తనాలతో, సన్నని నడుములతో, నిండైన కొప్పులతో, అందమైన చూపులతో సుందరంగా ఉన్నారు.
            ఆపైన, రత్నాలగని అయిన ఆ కడలిని మధిస్తుంటే, వెన్నెల అమృతాన్ని వెదజల్లే చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడి అనుమతితో చంద్రుడు తన యథాస్థానాన్ని అధిష్టించాడు. పిమ్మట . . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, July 27, 2016

క్షీరసాగరమథనం – ఎల్ల ఋతువులందు

అష్టమ స్కంధముకల్పవృక్షావిర్భావము

8-260-వ.
మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ.
8-261-ఆ.
ల్ల ఋతువులందు నెలరారి పరువమై
యింద్రువిరులతోఁట కేపు దెచ్చి
కోరి వచ్చు వారి కోర్కుల నీనెడు
వేల్పు మ్రాను పాలవెల్లిఁ బుట్టె.

టీకా:
            మఱియున్ = ఇంకను; = ; తరంగిణీవల్లభున్ = సాగరుని; మథించు = చిలికెడు; ఎడన్ = సమయమునందు.
            ఎల్ల = అన్ని; ఋతువుల్ = కాలముల; అందున్ = లోను; ఎలరారి = అతిశయించి; పరువము = పంట కొచ్చినది; ఐ = అయ్యి; ఇంద్రున్ = ఇంద్రునియొక్క; విరుల = పూల; తోట = తోట; కిన్ = కి; ఏపు = అధిక్యమును; తెచ్చి = కూర్చి; కోరి = ఆశ్రయించి; వచ్చు = వచ్చెడి; వారి = వారియొక్క; కోర్కులన్ = కోరికలను; ఈనెడు = తీర్చెడిది యగు; వ్రేల్పుమ్రాను = కల్పతరువు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టె = పుట్టెను.

భావము:
            సముద్రాలలో రాజువంటి ఆ పాలసముద్రాన్ని ఇంకా చిలికేటప్పుడు. . .
            అందులోనుండి కల్పవృక్షం పుట్టింది; ఇంద్రుని నందన వనానికి ఇంపు ఇచ్చే ఆ కల్పవృక్షం, అన్నిఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూస్తుంటుంది; ఆశ్రయించిన వారి కోర్కుల నెల్ల తీరుస్తుంది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :