Tuesday, March 31, 2015

కృష్ణుని అల్లరి

10.1-307-కంద పద్యము
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
         కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ. జ్ఞానముచే కలిగిన దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అజ్ఞానులు. బాలింతలు అంటే వారిని పోషించే జ్ఞానప్రదాతలు. వారు అజ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు వేదాలు అనే ఆవులకి మోక్షాపేక్ష గల వా రందరిని వదిలేస్తున్నా డట.
          బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; = ; బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి; చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి - పద్మాక్షి, స్త్రీ}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Monday, March 30, 2015

ఆదరమొప్ప మ్రొక్కిడుదు

పోతన తెలుగు భాగవత ప్రపంచాన్ని ప్రవేశింపజేస్తు చేసిన విఘ్నేశ్వర ప్రార్థన
http://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1&Padyam=5.0Sunday, March 29, 2015

కృష్ణలీలలు

10.1-304-వచనము
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
10.1-305-సీస పద్యము
గోవల్లభుఁడ నేను; గోవులు మీ రని; డి ఱంకె వైచుచు వంగి యాడు;
రాజు నే; భటులు మీలు రండురం డని; ప్రాభవంబునఁ బెక్కు నులుపనుచు;
నేఁదస్కరుండ; మీరింటివా రని నిద్ర; పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు;
నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు; ని చెలంగుచు నాటలాడఁ బెట్టు;
10.1-305.1-తేటగీతి
మూల లుఱుకును; డాఁగిలిమూఁతలాడు;
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు;
జార చోరుల జాడలఁ జాల నిగుడు;
శౌరి బాలురతో నాడుమయమందు.
         మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు.
         నేను ఆబోతును, మీరందరు ఆవులు అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజను, మీరు అందరు నా భటులుఅంటు, అధికారం చూపుతు వాళ్ళు ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. నేను దొంగను మీరు గృహస్థులు అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వంచేసే సూత్రధారుడను అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. జారునిలా, చోరునిలా రకరకాల పోకళ్ళు పోతాడు.  
10.1-304-vachanamu
maRriyu gOpakumaarulaM gooDikoni kRiShNuMDu.
10.1-305-seesa padyamu
gOvallabhuM~Da nEnu; gOvulu mee rani; vaDi RraMke vaichuchu vaMgi yaaDu;
raaju nE; bhaTulu meeralu raMDuraM Dani; praabhavaMbunaM~ bekku panulupanuchu;
nEM~daskaruMDa; meeriMTivaa rani nidra; puchchi sommulu gonipOyi DaaM~gu;
nE sootradhaari; mee riMdaRru bahuroopu; lani chelaMguchu naaTalaaDaM~ beTTu;
10.1-305.1-tETageeti
moola luRrukunu; DaaM~gilimooM~talaaDu;
nuyyalala nooM~guM~ jEbaMtu lonaravaichu;
jaara chOrula jaaDalaM~ jaala niguDu;
shauri baaluratO naaDusamayamaMdu.
          మఱియున్ = ఇంకను; గోపకుమారులన్ = గొల్లపిల్లలను; కూడికొని = కలుపుకొని; కృష్ణుండు = కృష్ణుడు.
          గోవల్లభుండన్ = ఎద్దును; నేను = నేను; గోవులు = ఆవులు; మీరు = మీరందరు; అని = అని; వడిన్ = వేగముగ; ఱంకె = ఎద్దుఅరుపువలెఱంకె; వైచుచున్ = వేస్తూ; వంగి = ఎద్దువలెవంగి; ఆడున్ = ఆటలాడును; రాజున్ = రాజును; నేన్ = నేను; భటులు = సేవకులు; మీరలు = మీరు; రండురండు = తొందరగారండి; అని = అని; ప్రాభవంబునన్ = అధికారస్వరముతో; పెక్కు = అనేకమైన; పనులున్ = పనులను; పనుచున్ = అప్పజెప్పును; నేన్ = నేను; తస్కరుండన్ = దొంగను; మీరున్ = మీరు; ఇంటివారు = గృహస్తులు; అని = అని; నిద్ర = నిద్ర; పుచ్చి = పోవునట్లుచేసి; సొమ్ములున్ = ఆభరణములు; కొనిపోయి = తీసుకెళ్ళి; డాగున్ = దాగుకొనును; నేన్ = నేను; సూత్రధారి = దారములబట్టితిప్పువాడు; మీరు = మీరు; అందఱున్ = అందరు; బహురూపులు = అనేకరూపములబొమ్మలు; అని = అని; చెలంగుచున్ = చెలరేగుచు; ఆటలాడబెట్టున్ = ఆట్లాడునట్లుచేయును.
            మూలలున్ = సందుగొందులలోకి; ఉఱుకును = పరుగెత్తును; డాగిలిమూతలు = దాగుడుమూత ఆటలు; ఆడును = ఆడును; ఉయ్యలలన్ = ఉయ్యాలలు; ఊగున్ = ఊగును; చే = చేతిలోని; బంతులున్ = బంతులను; ఒనరన్ = చక్కగా; వైచున్ = వేయును; జార = జారుల; చోరుల = దొంగల; జాడలన్ = వలె; చాలన్ = మిక్కలి; నిగుడున్ = వ్యాపించును; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని వంశపు వాడు, కృష్ణుడు}; బాలుర = పిల్లల; తోన్ = తోటి; ఆడు = ఆడెడి; సమయమందు = వేళ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Saturday, March 28, 2015

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

భూతలనాథుఁడు రాముఁడు . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&Padyam=263.0

కృష్ణలీలలు

10.1-303-కంద పద్యము
ల్లవగృహనవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱుఁగని భంగిం
ల్లిఁ గదిసి చిట్టాడుచు
ల్లనఁ జను బువ్వఁ బెట్టువ్వా! యనుచున్.
         గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. అమ్మా బువ్వ పెట్టు అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.
10.1-303-kaMda padyamu
vallavagRihanavaneetamu
lellanu bhakShiMchi vachchi yeRruM~gani bhaMgiM
dalliM~ gadisi chiTTaaDuchu
nallanaM~ janu buvvaM~ beTTumavvaa! yanuchun.
          వల్లవ = గోపికా; గృహంబున్ = ఇండ్లలోని; నవనీతములు = వెన్నలు; ఎల్లను = అన్నిటిని; భక్షించి = తినివేసి; వచ్చి = వచ్చి; ఎఱుగని = ఏమీ తెలియనివాని; భంగిన్ = వలె; తల్లిన్ = తల్లిని; కదిసి = చేరి; చిట్టాడుచున్ = ఇటునిటు తిరుగుచు; అల్లనన్ = మెల్లిగా; చనున్ = వెళ్ళును; బువ్వ = అన్నము; పెట్టుము = పెట్టు; అవ్వా = అమ్మా; అనుచున్ = అంటూ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :