Saturday, July 2, 2016

క్షీరసాగరమథనం – ఒడ్డారించి

8-217-క.
డ్డారించి విషంబున
డ్డము చనుదెంచి కావ ధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రా లన
బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
8-218-వ.
అప్పుడు
టీకా:
          ఒడ్డారించి = మారొడ్డి, ఎదుర్కొని; విషంబునన్ = విషమున; కున్ = కు; అడ్డము = ఎదుర; చనుదెంచి = వచ్చి; కావన్ = కాపడుటకు; అధికులు = గొప్పవారు; లేమిని = లేకపోవుటచేత; గొడ్డేఱి = కట్టకట్టి, గుత్తగొని; మ్రందిరి = చచ్చిరి; ఆలన = భార్యలను; బిడ్డన = పిల్లలను; ఎడలేక = విడువలేక; జనులు = ప్రజలు; పృథ్వీనాథ = రాజా.
          అప్పుడు = ఆ సమయునందు.
భావము:
            ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
            అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో. . . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: