Tuesday, July 5, 2016

క్షీరసాగరమథనం – భూతాత్మ

8-222-సీ.
భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! ;
దేవ! మహాదేవ! దేవవంద్య! 
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ
యార్త శరణ్యుండ గు గురుండవు నిన్నుఁ
గోరి భజింతురు కుశలమతులు
కల సృష్టిస్థితిసంహారకర్తవై
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ రఁగు దీవ;
8-222.1-ఆ.
రమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తియుఁడ వీవ
బ్దయోని వీవగదంతరాత్మవు
నీ; ప్రాణ మరయ నిఖిలమునకు.
టీకా:
            భూతాత్మ = పరమశివ {భూతాత్ముడు - పంచభూతములకు ఆత్మయైనవాడు, శివుడు}; భూతేశ = పరమశివ {భూతేశుడు - భూతములకు ఈశుడు (పతి), శివుడు}; భూతభావనరూప = పరమశివ {భూతభావనరూపుడు - జీవులకు కారణరూపమైనవాడు, శివుడు}; దేవ = పరమశివ; మహాదేవ = పరమశివ {మహాదేవుడు - మహా (గొప్ప) దేవుడు, శివుడు}; దేవవంద్య = పరమశివ {దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), శివుడు}; ఈ = ఈ; లోకముల్ = లోకముల; ఎల్లన్ = అన్నిటికి; ఈశ్వరుండవు = భగవంతుడవు; నీవ = నీవే; బంధ = బంధములకు; మోక్షముల్ = ముక్తుల; కున్ = కు; ప్రభుడవు = విభుడవు; నీవ = నీవే; ఆర్త = దుఃఖించెడివారికి; శరణ్యుండవు = శరణము ఇచ్చువాడవు; అగు = అయిన; గురుండవు = గొప్పవాడవు; నిన్నున్ = నిన్ను; కోరి = కోరి; భజింతురు = సేవించెదరు; కుశలమతులు = జ్ఞానులు; సకల = సమస్తమైన; సృష్టి = సృష్టి; స్థితి = స్థితి; సంహార = లయ; కర్తవు = కారణుడవు; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; విష్ణు = విష్ణుమూర్తి; శివ = పరమశివుడు; ఆఖ్యన్ = పేర్లతో; పరగుదు = ప్రకాశించెడివాడవు; ఈవ = నీవే. 
            పరమ = అత్యధికమైన; గుహ్యము = రహస్యము; అయిన = ఐన; బ్రహ్మంబు = బ్రహ్మము; సత్ = సత్తు; అసత్ = అసత్తులతో; తమంబు = కూడినవాడవు; నీవ = నీవే; శక్తిమయుడవు = శక్తియుక్తుడవు {శక్తి - 1సత్త్వ 2రజస్ 3తమస్సులు}; ఈవ = నీవే; శబ్దయోనివి = శబ్దమునకు జన్మస్థానమవు; జగత్ = లోకమంతటికి; ఆత్మవు = అంతరాత్మవు; నీవ = నీవే; ప్రాణము = జీవము; అరయ = తరచిచూసినచో; నిఖిలమున్ = సమస్తమున; కు = కు.
భావము:
            “ఓ పరమేశ్వరా! పంచ భూతాలకూ ఆత్మ అయిన వాడా! సర్వ భూతాలకూ అధినాథా! జీవులకు కారణమైన రూపమైన దేవా! ఓ దైవమా! మహాదేవా! దేవతలకు వందనీయుడా! ఈ లోకాలు అన్నిటికి ప్రభువు నీవే; సంసారబంధాలలో పడుట, మోక్షమూ ఏది అనుగ్రహించాలన్నా నీవల్లనే సాధ్యం అవుతుంది; జ్ఞానులు ఆర్తులకు శరణు ఇచ్చేవాడూ, ఆదిగురువు అయిన నిన్ను కోరి ప్రార్థిస్తారు; సృష్టి, స్థితి, సంహార కార్యాలు సమస్తమునకు కారణ భూతుడవు అయి; బ్రహ్మ విష్ణు శివ పేర్లుతో విరాజిల్లుతుంటావు; భావానికి అందని పరబ్రహ్మవు; సదసద్రూప పరమాత్మవూ నీవే; శక్తి యుక్తుడవు నీవే; శబ్దానికి జన్మస్థానం అయిన శబ్దబ్రహ్మము నీవే; లోకానికి అంతరాత్మవు నీవే; సర్వ చరాచరాలకు ప్రాణము నీవే;
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: