అష్టమ
స్కంధము : గరళ భక్షణము
8-232-వ.
అని మఱియు
నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.
కంటే జగముల దుఃఖము;
వింటే జలజనిత విషము వేఁడిమి;
ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!
టీకా:
అని = అని; మఱియున్ = ఇంకను; అభి = మిక్కిలిగ;
నందించుచున్న = స్తోత్రముచేయుచున్న;
ప్రజాపతి =
బ్రహ్మదేవుడు;
ముఖ్యులన్ = మున్నగువారిని;
కని = చూసి;
సకల = సర్వ;
భూత =
ప్రాణులను; సముండు = సమానంగా చూచెడివాడు;
అగు = అయిన;
ఆ = ఆ; దేవుండు = దేవుడు;
తన = తన యొక్క;
ప్రియ = ఇష్టమైన;
సతి = భార్య;
కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ;
అనియె = పలికెను.
కంటే = చూసితివా; జగముల = లోకముల యొక్క; దుఃఖమున్ = దుఃఖమును; వింటే = విన్నావా; జల = నీటిలో; జనిత = పుట్టిన; విషము = విషము యొక్క; వేడిమిన్ = సెగ; ప్రభువు = విభుడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉన్నందుల; కున్ = కు; ఆర్తుల = దుఃఖితుల; ఆపదన్ = కష్టమును; గెంటింపగన్ = తొలగించుటవలన; ఫలము = ఫలితముగా; కాదె = కలుగదా; కీర్తి = కీర్తి; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - మృగ (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), అందమైన స్త్రీ}.
భావము:
ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు....
“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో
ఉన్నాయో. ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్ళలో పుట్టిన ఆ హాలాహల
విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment