Friday, July 29, 2016

క్షీరసాగరమథనం – తొలుకారు మెఱుఁగు

అష్టమ స్కంధములక్ష్మీదేవి పుట్టుట

8-265-క.
తొలుకారు మెఱుఁగు కైవడి
తళ మని మేను మెఱవ గధగ మనుచున్
లుముల నీనెడు చూపులఁ
జెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా!

టీకా:
            తొలుకారు = వర్షాకాలపు; మెఱుగు = మెరుపుతీగల; కైవడి = వలె; తళతళ = తళతళ; అని = అని; మేను = దేహము; మెఱవన్ = మెరియుచుండగా; ధగధగ = ధగధగ; అనుచున్ = అనుచు; కలుములన్ = సంపదలను; ఈనెడు = కలిగించెడి; చూపులన్ = చూపుల; చెలువంబులు = సౌందర్యములకు; మొదలిటెంకి = మూలస్థానము; సిరి = లక్ష్మీదేవి; పుట్టెన్ = పుట్టెను; నృపా = రాజా.

భావము:
            రాజా! పరీక్షిత్తూ! పాలకడలిలో ఆ తరువాత, అందచందాలకు ఆది రూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తళతళ మనే శరీరకాంతితో, సంపదలను వెదజల్లే ధగధగ మనే చూపులుతో విరాజిల్లుతున్నది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: