Friday, July 8, 2016

క్షీరసాగరమథనం – కొందఱు గలఁ డందురు

8-225-క.
కొంఱు గలఁ డందురు నినుఁ
గొంఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొంఱు; గలఁ డని లేఁ డని
కొంల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!
టీకా:
            కొందఱు = కొంతమంది; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; నినున్ = నిన్ను; కొందఱు = కొంతమంది; లేడు = లేడు; అందురు = అనెదరు; అతడు = అతడు; గుణిగాడు = సగుణుడవు; అనుచున్ = అనుచుండ; కొందఱు = కొంతమంది; కలడు = ఉన్నాడు; లేడు = లేడు; అని = అని; కొందలము = కలత; అందుదురు = చెందెదరు; నిన్నున్ = నిన్ను; గూర్చి = గురించి; మహేశా = పరమశివా {మహేశుడు - మహా ఈశుడు, శివుడు}.
భావము:
            ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: