Thursday, June 30, 2016

క్షీరసాగరమథనం – ఆలోల

కాలకూటవిషము పుట్టుట
8-215-క.
లోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు సురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె వనీనాథా!
టీకా:
            ఆలోల = కల్లోలమైన; జలధి = సముద్రము {జలధి - జలమునకు నిధి, సముద్రము}; లోపలన్ = లోపలనుండి; ఆలోన్ = ఆ సమయునందు; అహిన్ = పామును; విడిచి = విడిచిపెట్టి; సురలున్ = దేవతలు; అసురులున్ = రాక్షసులు; పఱవన్ = పరుగెత్తుచుండగా; కీలా = మంటలతో; కోలాహలము = కోలాహలముతో కూడినది; ఐ = అయ్యి; హాలాహలము = హాలాహలము అనెడి; విషము = విషము; పుట్టెన్ = పుట్టినది; అవనీనాథ = రాజా.
భావము:
            పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
            లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, June 29, 2016

క్షీరసాగరమథనం – అమరాసుర

8-213-క.
రాసుర కర విపరి
భ్రణ ధరాధరవరేంద్ర భ్రమణంబును దాఁ
ఠేంద్రు వీపు తీఁటను
మియింపఁగఁ జాలదయ్యె గతీనాథా!
8-214-వ.
తదనంతరంబ
టీకా:
            అమర = దేవతలు; అసుర = రాక్షసుల; కర = చేతులచే; విపరిభ్రమణ = చిలికెడి; ధరాధర = పర్వతములలో; వర = శ్రేష్టము; ఇంద్ర = ఉత్తమము యొక్క; భ్రమణంబునున్ = రాపిడికూడ; కమఠ = కూర్మ; ఇంద్రున్ = రాజుయొక్క; వీపు = వీపు; తీటను = దురదను; శమియింపగన్ = పోగొట్టగలుగుటకు; చాలదు = సరిపోనిది; అయ్యెన్ = అయినది; జగతీనాథ = రాజా {జగతీనాథుడు - జగతి (భూమికి) నాథుడు (పతి), రాజు}.
            తదనంతరంబ = తరువాత.
భావము:
            ఈ భూమండలాన్ని ఏలే ఓ రాజా! పరీక్షిత్తూ! అంతటి రాక్షసులూ దేవతలూ కలిసి త్రిప్పుతున్న మందర పర్వతం రాపిడీ, ఆ కూర్మరాజు వీపు దురదను అయినా పోగొట్టలేకపోయింది.
            అలా క్షీరసాగరం చిలుకుగా చిలుకగా.. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, June 28, 2016

క్షీరసాగరమథనం – ఎడమఁ గుడి

8-211-క.
మఁ గుడి మునుపు దిరుగుచు
గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం
 లెడల సురలు నసురులుఁ
దొడితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్.
8-212-క.
డిగొని కులగిరిఁ దరువఁగ
నిధి ఖగ మకర కమఠ ష ఫణి గణముల్
సుడివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ
డు భయపడి నెగసి బయలఁ డు నురలిపడున్.
టీకా:
            ఎడమన్ = ఎడమనుండి; కుడి = కుడిపక్కకు; మునుపు = ముందకు; తిరుగుచున్ = తిరుగుతు; కుడిన్ = కుడినుండి; ఎడమనున్ = ఎడమపక్కకి; వెనుకన్ = వెనుకకు; తిరుగు = తిరిగును; కులగిరి = కులపర్వతము; కడలిన్ = సముద్రమును; కడలు = చివర్లవరకు; ఎడలన్ = ఎగసిపోవునట్లుగ; సురలున్ = దేవతలు; అసురులున్ = రాక్షసులు; తొడితొడిన్ = తొందరతొందరగా; ఫణి = పాము యొక్క; ఫణము = పడగల; మొదలున్ = మొదలు; తుదిన్ = తోకను; తిగువన్ = లాగుచుండగా.
            వడిగొని = వేగము అందుకొని; కులగిరిన్ = కులపర్వతముతో; తరువగన్ = చిలుకుతుండగ; జడనిధిన్ = సముద్రపు; ఖగ = పక్షులు; మకర = మొసళ్ళు; కమఠ = తాబేళ్ళు; ఝష = చేపలు; ఫణి = పాముల; గణముల్ = సమూహములు; సుడివడున్ = చీకాకుపడును; తడబడు = తొట్రుపడెడి; కెలకులన్ = పక్కలకు; పడున్ = పడిపోవును; భయపడి = భయపడిపోయి; ఎగసి = గెంతి; బయలన్ = గట్టుమీదకి; పడునున్ = పడిపోవును; ఉరలి = పొరలు పాట్లు; పడున్ = పడిపోవును.
భావము:
            సర్పరాజు తోకా తలా పట్టుకుని దేవతలూ రాక్షసులూ కలిసి; వంతులువారీగా తొందర తొందరగా ముందుకూ వెనక్కూ కదులుతూ ఉంటే; మందర పర్వతం ఎడం ప్రక్క నుండి కుడి ప్రక్కకు, మరల కుడి ప్రక్క నుండి ఎడం ప్రక్కకు అలా తిరుగసాగింది.
            అలా గిరగిరా కొండ కదులుతుంటే కడలిలోని పక్షులూ, మొసళ్ళూ, తాబేళ్ళూ, చేపలూ, సర్పాలూ తొట్రుపడుతూ ప్రక్కలకు పడుతూ భయంతో ఎగిరి గట్టుమీదకి పడి పొర్లుతూ ఉన్నాయి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, June 27, 2016

క్షీరసాగరమథనం – అప్పాలవెల్లి

8-209-క.
ప్పాలవెల్లి లోపల
ప్పటికప్పటికి మందరాగము దిరుగం
ప్పుడు నిండె నజాండము
చెప్పెడి దే మజుని చెవులు చిందఱగొనియెన్.
8-210-వ.
అంత నప్పయోరాశి మధ్యంబున.
టీకా:
            ఆ = ఆ; పాలవెల్లి = పాలసముద్రము; లోపలన్ = లోపల; అప్పటికప్పటికి = అప్పటికప్పుడు; మందర = మందరము యనెడి; అగము = కొండ; తిరుగన్ = తిరుగుచున్న; చప్పుడున్ = శబ్దముతో; నిండెన్ = నిండిపోయినది; అజాండము = బ్రహ్మాండము {అజాండము - అజుని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; చెప్పెడిది = చెప్పునది; ఏమి = ఇంక ఏముంది; అజుని = బ్రహ్మదేవుని; చెవులు = చెవులు; చిందఱగొనియెన్ = గింగుర్లెత్తాయి.
            అంతన్ = అంతటఆ = పయోరాశి = సముద్రము {పయోరాశి - పయస్ (నీటి)కి రాశికడలి}; మధ్యంబునన్ = నడుమ.
భావము:
            ఏమని చెప్పేది! పాలసముద్రంలో మందరపర్వతం గిరగిరా తిరుగుతుంటే, దాని శబ్దం బ్రహ్మాండం అంతా నిండిపోయి, బ్రహ్మదేవుడి చెవులు గింగురుమన్నాయి.
            అలా మథిస్తున్నప్పుడు ఆ పాలసముద్రం మధ్యలో. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, June 26, 2016

క్షీరసాగరమథనం – ఇట్లు సురాసురయూథంబులు

సముద్రమథన వర్ణన
8-208-వ.
ఇట్లు సురాసురయూథంబులు హరిసనాథంబులయి కవచంబులు నెట్టంబులు పెట్టికొని; పుట్టంబులు పిరిచుట్లు చుట్టుకొని; కరంబులుఁ గరంబుల నప్పళించుచు; భుజంబులు భుజంబుల నొరయుచు; లెండు లెండు దరువఁ దొడంగుఁడు రండని యమందగతిం బెరుగుఁ ద్రచ్చు మందగొల్లల చందంబున మహార్ణవమధ్యంబున మంథాయమాన మందరమహీధర విలగ్నభోగి భోగాద్యంతంబులం గరంబులం దెమల్చుచుఁ; బెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బుగుబ్బని యురులు కొండకవ్వంబుగుత్తి జిఱజిఱందిరుఁగు వేగంబున ఛటచ్ఛటాయ మానంబులయి బుగులుబుగుళ్ళను చప్పుళ్ళుప్పరం బెగసి లెక్కుకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలుపడు మిసిమిగల మీఁది మీఁగడ పాలతేట నిగ్గుఁ దుంపరల పరంపరలవలన నిజకరక్రమ క్రమాకర్షణపరిభ్రాంత ఫణిఫణాగర్భ సముద్భూత నిర్భర విష కీలి కీలాజాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లిన దప్పిం గొండొక మందగతిం జెందక యక్కూపార వేలా తట కుటజ కుసుమగుచ్ఛ పిచ్ఛిల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహంబులం గ్రొంజెమట నీటి పెను వఱదగము లొడళ్ళ నిగుర నొండొరు లంబరిహసించుచుఁ బేరువాడి విలసించుచు; మేలు మేలని యుగ్గడించుచుఁ; గాదు కాదని భంగించుచు; నిచ్ఛ మెచ్చని మచ్చరంబుల వలన వనధి వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘమఘమారావంబును; మథన గుణాయమాన మహాహీంద్రప్రముఖ ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును; గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెఱచఱచి గుబురుగుబురలై యొరలు కమఠ కర్కట కాకోదర మకర తిమి తిమింగిల మరాళ చక్రవాక బలాహక భేక సారసానీకంబుల మొఱలునుం గూడికొని ముప్పిరిగొని; దనుజ దివిజ భటాట్టహాస తర్జనగర్జనధ్వనులు నలుపురియై మొత్తినట్లైన దిశదిగంత భిత్తులును; బేఁటెత్తి పెల్లగిలం ద్రుళ్ళుచుఁ గికురు పొడుచుచు నొక్కఁడొకనికంటె వడియునుం గడపునుం గలుగఁ ద్రచ్చుచుఁ బంతంబు లిచ్చుచు సుధాజననంబుఁ జింతించుచు నూతనపదార్థంబులకు నెదుళ్ళు చూచుచు నెంతదడవు ద్రత్తుమని హరి నడుగుచు నెడపడని తమకంబుల నంతకంతకు మురువుడింపక త్రచ్చు సమయంబున.
టీకా:
            ఇట్లు = ఈ విధముగ; సుర = దేవతలు; అసుర = రాక్షసుల; యూథంబులున్ = సమూహములు; హరిన్ = విష్ణువు; సనాథంబులు = నాయకుడుగాగలవి; అయి = అయ్యి; కవచంబులున్ = కవచములు; నెట్టంబులున్ = తలపాగాలు; పెట్టికొని = ధరించి; పుట్టంబులు = బట్టలు; పిరిచుట్లు = మెలితిప్పులు; చుట్టుకొని = చుట్టుకొని; కరంబులున్ = చేతులను; కరంబులన్ = చేతులతో; అప్పళించుచున్ = హత్తుకొనుచు; భుజంబులు = భుజములు; భుజంబులన్ = భుజములతో; ఒరయుచున్ = రాసుకొనుచు; లెండులెండు = లేవండిలేవండి; తరువన్ = చిలుకుట; తొడంగుడు = మొదలుపెట్టండి; రండు = రండి; అని = అని; అమంద = చురుకైన; గతిన్ = విధముగా; పెరుగున్ = పెరుగును; త్రచ్చు = చిలికెడి; మంద = గొల్లపల్లె; గొల్లల = గోపాలకుల; చందంబునన్ = వలె; మహా = మహా; ఆర్ణవ = సముద్రము; మధ్యంబునన్ = నడుమ; మంథాయమాన = కవ్వముగా ఉండు; మందర = మందరము యనెడి; మహీధర = పర్వతమున; విలగ్న = చుట్టబడిన; భోగి = పాము; భోగ = దేహము; ఆది = మొదలు, తల; అంతంబులన్ = చివర్లను, తోకలను; కరంబులన్ = చేతులతో; తెమల్చుచు = గుంజుతూ; పెను = పెద్ద పెద్ద; బొబ్బలన్ = కేకలతో; బ్రహ్మాండ = బ్రహ్మాండముయొక్క; కటాహంబున్ = చిప్ప; నిర్బరంబు = నిండిపోయినది; అయి = అయినది; గుబ్భుగుబ్బు = గుబ్బుగుబ్బు; అని = అని; ఉరులు = దొర్లుచున్న; కొండ = కొండ రూపు; కవ్వంబు = కవ్వముయొక్క; గుత్తి = పీఠము; జిరజిరన్ = గిరగిర; తిరుగు = తిరిగెడి; వేగంబునన్ = వేగమువలన; ఛటఛట = ఛటఛటమనుశబ్దములు; ఆయమానంబులు = కలిగినవి; అయి = అయ్యి; బుగులుబుగులు = బుగులుబుగులు; అను = అనెడి; చప్పుళ్ళు = చప్పుళ్ళు; ఉప్పరంబు = ఆకాశమున; ఎగసి = వ్యాపించి; లెక్కకుమిక్కిలి = చాలాఎక్కువైన; చుక్కల = చుక్కలనెడి; కొమ్మల = అందగత్తెల; చెక్కులన్ = చెక్కిళ్ళను; నిక్కలుపడు = అతిశయించెడి; మిసిమి = మార్దవము; కల = కలగిన; మీది = పైనున్ను; మీగడ = మీగడ; పాల = పాలయొక్క; తేట = స్వచ్చమైన; నిగ్గు = నిగారింపుగల; తుంపరల = నీటిబొట్ల; పరంపరల = జల్లుల; వలన = వలన; నిజ = తమ; కర = చేతుల; క్రమక్రమ = క్రమముగా; ఆకర్షణ = లాగుటచేత, చిలుకుటచేత; ఫణా = పాము యొక్క; సముద్భూత = ఉద్భవించిన; నిర్భర = భరింపరాని; విష = గరళముయొక్క; కీలి = అగ్ని; కీలా = మంటల; జాలంబులన్ = సమూహములు వలన; అప్పటప్పటికిన్ = తక్షణమే; ఉప్పతిల్లన = ఎగయగా; దప్పిన్ = దాహముతో; కొండొక = కొంచముకూడ; మంద = మందగించిన; గతిన్ = విధము; చెందక = పొందకుండ; ఆ = ఆ; కూపార = సముద్రము; వేలా = సరిహద్ధు; తట = గట్టునగల; కుటజ = చెట్ల {కుటజము - భూమియందుపుట్టినది, చెట్టు}; కుసుమ = పూల; గుచ్ఛ = గుత్తుల; పిచ్చిల = విరజిమ్మబడు; స్వచ్చ = నిర్మలమైన; మకరంద = మకరందము యొక్క; సుంగంధి = సువాసనలుగల; గంధవహంబులన్ = గాలులచే; క్రొంజెమట = చిరుచెమటల; నీటి = నీరుచేత; పెను = పెద్ద; వఱద = వరదల; గములు = గుంపులు; ఒడళ్ళన్ = శరీరముపైననే; ఇగురన్ = ఇగిరిపోగా; ఒండొరులన్ = ఒకరినొకరు; పరిహసించుచు = వేళాకోళములుచేయుచు; పేరు = పౌరుషములను; వాడి = ప్రకటించి; విలసించుచున్ = విలసిల్లుచు; మేలుమేలు = భళీ భళీ; అని = అని; ఉగ్గడించుచన్ = పొగడుకొనుచు; కాదుకాదు = కాదుకాదు; అని = అని; భంగించుచున్ = ఖండించుచు; ఇచ్ఛన్ = ఇష్టముగా; మెచ్చని = మెచ్చుకొనలేని; మచ్చరంబులన్ = అసూయల; వలన = వలన; వనధిన్ = సముద్రమును {వనధి - వనము (నీటికి) నిధి, కడలి}; వలమాన = తిరిగెడి {రుగుచున్న}; వైశాఖ = కవ్వపు; వసుంధరాధర = పర్వతముయొక్క {వసుంధరాధరము - వసుంధర (భూమిని) ధరించెడిది, పర్వతము}; పరివర్తన = చలనమువలన; సముజ్జనిత = పుట్టిన; ఘమఘమ = ఘమఘమ యనెడి; ఆరావంబును = శబ్దములును; మథన = చిలికెడి; గుణాయమాన = లక్షణముగలగుటవలన; మహా = గొప్ప; అహి = సర్ప; ఇంద్ర = ఉత్తముని; ప్రముఖ = విశిష్టమైన నోళ్ళనుండి; ముహుర్ముహుర్ = మాటిమాటికి; ఉచ్చలిత = రేగుతున్న; భూరి = అతిపెద్ద; ఘోర = ఘోరమైన; ఫూత్కార = ఫూ యనెడి; ఘోషంబునున్ = శబ్దములును; కులధర = కులపర్వతముయొక్క; పరిక్షేపణ = తిరుగుటవలన; క్షోభిత = కలతపెట్టబడి; సముల్లంఘన = మిక్కిలి అతిక్రమించి; సమాకులితంబులు = కూడివచ్చినవి; ఐ = అయ్యి; వెఱచి = భయపడి; అఱచి = అరిచి; గుబురుగుబురలు = గుంపులుకట్టినవి; ఐ = అయ్యి; ఒరలు = దొర్లుచున్న; కమఠ = తాబేళ్ళు; కర్కట = పీతలు; కాకోదర = పాములు; మకర = మొసళ్ళు; తిమి = పెద్దచేపలు; తిమింగిల = తిమింగిలములు; మరాళ = హంసలు; చక్రవాక = చక్రవాకపక్షులు; బలహక = కొక్కెరలు; భేక = కప్పలు; సారస = బెగ్గురుపక్షులు; అనీకంబుల = సమూహముల; మొఱలునున్ = ఆర్తానాదములను; కూడికొని = కలిసిపోయి; ముప్పిరిగొని = పెనగొని; దనుజ = రాక్షసుల; దివిజ = దేవతల; భట = భటుల; అట్టహాస = అట్టహాసములు; తర్జన = హెచ్చరికల; గర్జన = గర్జన; ధ్వనులు = శబ్దములు; నలుపురి = పెనవేసుకొనినవి; ఐ = అయ్యి; మొత్తినట్లు = మొత్తినట్లు; ఐన = కాగా; దశదిక్ = దశదిశలు; అంత = చివరలు; భిత్తులును = పగులును; బేటెత్తి = పెళ్ళలూడి; పెల్లగిలన్ = కూలిపోవునట్లుగ; త్రుళ్ళుచు = త్రుళ్లుచు; కికురుపొడుచుచు = వంచిచుచు; ఒక్కడు = ఒకడు; ఒకని = ఇంకొకని; కంటెన్ = కంటె; వడియున్ = అధిక వేగము; గడపునున్ = అధిక సంయము; కలుగన్ = కలుగునట్లు; త్రచ్చుచు = చిలుకుతు; పంతంబులు = పంతములు; ఇచ్చుచున్ = పెట్టుకొనుచు; సుధా = అమృతము; జననంబున్ = పుట్టుటకై; చింతించుచు = ఉబలాటపడుతు; నూతన = కొత్త; పదార్థంబుల్ = వస్తువుల; కు = కోసము; ఎదుళ్ళు = ఎదురుచూపులు; చూచుచున్ = చూచుచు; ఎంత = ఇంకా ఎంత; తడవు = సేపు; త్రత్తుము = చిలుకుదము; అని = అని; హరిన్ = విష్ణుని; అడుగుచున్ = అడుగుచు; ఎడపడని = ఎడతెగని; తమకంబులన్ = ఆశలతో; అంతకంతకున్ = అంతకంతకు; మురువు = పట్టుదలలు; డింపక = తగ్గించకుండ; త్రచ్చు = చిలికెడి; సమయంబునన్ = సమయమునండు.
భావము:
            అలా, దేవతలూ రాక్షసులూ విష్ణుమూర్తితో చేరి కవచాలు ధరించారు; దట్టీలు గట్టిగా కట్టారు; కట్టుబట్టలు సిరిచుట్లు చుట్టారు; చేతులూ చేతులూ చరచుకున్నారు; భుజాలూ భుజాలు రాసుకున్నారు; “లేవండి లేవండి, చిలుకుదాం, రండి రండి” అంటూ హెచ్చరించుకున్నారు. గొల్లపల్లెల్లో గోపాలకులు పెరుగు గబ గబా చిలికే విధంగా, పాలసముద్రం మధ్యన కవ్వంగా ఉన్న మందరపర్వతానికి చుట్టిన కవ్వం తాడుగా ఉన్న వాసుకి అనే పెద్ద పాము తలా తోకా, రాక్షసులూ దేవతలూ పట్టుకుని గబ గబా మథించసాగారు. వారి పెను కేకలతో బ్రహ్మాండం నిండిపోతోంది. “గుబ గుబ” అంటూ కవ్వం కొండ గిర గిర తిరగసాగింది. అది తిరిగే వేగానికి “భుగ భుగ” అంటూ శబ్దాలు పుట్టి ఆకాశం అంతా వ్యాపించసాగాయి. పాలమీగడతేటలోని కాంతి పూరిత తుంపరల పరంపరలు, లెక్కకు మించిన చుక్కల చక్కదనాలతో, పైకెగరసాగాయి. దేవదానవులు తమ చేతులతో గట్టిగా పట్టుకుని చిలకడం వల్ల ఆ సర్పరాజు శరీరం నుండి విషాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించసాగాయి. దాంతో వారికి దాహం పెరిగిపోసాగింది. అయినా వారు ఏమాత్రం అలసట చెందటం లేదు. ఆ పాలసముద్రం ఒడ్డునున్న కొండమల్లి పూలగుత్తులలోని విరివియైన మకరంద సుగంధాలు నిండిన మందమారుతాలు వీచసాగాయి. ఆ చల్లగాలి వల్ల వారి శరీరాలమీది చెమట ధారలు ఇంకిపోసాగాయి. వారు ఒకరి నొకరు వేళాకోళాలు చేసుకుంటూ; గప్పాలు కొడుతూ; “భళి భళి” అని పొగడుకుంటూ; “అలా ఇలా” అంటూ మందలించుకుంటూ; అసూయతో పోటీలు పడి మరీ జలధిని మథించసాగారు; ఆ కవ్వపు కొండ గబ గబా తిరిగుతుంటే, “ఘుమ ఘుమ” అని శబ్దాలు వెలువడసాగాయి; కవ్వం తాడైన వాసుకి సర్పరాజు నోటినుండి భయంకరమైన “ఫూ ఫూ” అనే శబ్దాలు పుట్టసాగాయి; పర్వతం తిరుగుళ్ళకు సముద్రంలో గుంపులు గుంపులుగా ఉన్న తాబేళ్ళూ, పీతలూ, పాములూ, మొసళ్ళూ, పెద్ద చేపలూ, తిమింగిలాలూ, హంసలూ, చక్రవాకాలూ, కొంగలూ, కప్పలూ, బెగ్గురుపక్షులూ, భయంతో చేసే ఆర్తనాదాలు ముప్పిరిగొనసాగాయి; రాక్షసులూ దేవతలూ పెద్దగా అట్టహాసాలూ, హెచ్చరికలూ నలుపురిగా చేయసాగారు; ఆ శబ్దాల తాకిడికి పదిదిక్కులూ పగిలి పాదులూడి కూలిపోయినట్లు కాసాగింది; ఒకడిని మించి ఒకడు అరవసాగారు; అమృతంకోసం ఉబలాటపడసాగారు; క్రొత్త వస్తువులు పుట్టుక కోసం ఎదురుచూడసాగారు; “ఇంకా ఎంతసేపు చిలకాలి”అని విష్ణువును అడగసాగారు; అలా ఎడతెగని ఆశతో పట్టిన పట్టు విడువకుండా క్షీరసాగారాన్ని మథించసాగారు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :