Sunday, February 15, 2015

7-150 మందార మకరంద

7-150-సీ.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు
 ధుపంబు బోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు
 రాయంచ జనునె తరంగిణులకు?
లిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
 కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
 రుగునే సాంద్ర నీహారములకు?
తే.
నంబుజోదర దివ్య పాదారవింద
చింత నామృత పాన విశేష మత్త
చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
          తండ్రి హిరణ్యాక్షుడు హరి గిరి అనకు అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మా పోతన్న సీసోత్తమం.  
          ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు సుమా.
7-150-see.
maMdaara makaraMda maadhuryamunaM~ dElu
 madhupaMbu bOvunE madanamulaku?
nirmala maMdaakinee veechikalaM~ dooM~gu
 raayaMcha janune taraMgiNulaku?
lalita rasaala pallava khaadiyai chokku
 kOyila chErunE kuTajamulakuM~?
boorNEMdu chaMdrikaa sphurita chakOraka
 marugunE saaMdra neehaaramulaku?
tE.
naMbujOdara divya paadaaraviMda
chiMta naamRita paana vishESha matta
chitta mE reeti nitaraMbuM~ jEra nErchu?
vinutaguNasheela! maaTalu vEyu nEla?"
          మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగములందు; తూగు = చరించెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; = అయ్యుండి; చొక్కు = మై మరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టనగలవాడు), విష్ణువు}.
దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; = ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములుగల; శీల = వర్తనగలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

7 comments:

Rayaprolu said...

Thanks a ton for posting this padyam, and it's prathi padaardha thaatparyam

Unknown said...

చాలా బాగుంది సర్

Navya said...

👌🙏

Unknown said...

Prahlada's father is hiranyakasyapa. Not hiranyaksha as you mentioned.

Unknown said...

yes Hiranyakasyapa

Anonymous said...

Thank you for neat explanation

sri krishna said...

ధన్యవాదాలు...