8-236-క.
హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చఁగ
గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ!
టీకా:
హరి = విష్ణువు;
మదిన్ = మనసును;
ఆనందించినన్ = ఆనందపడితే;
హరిణాక్షీ = సుందరీ {హరిణాక్షి -
హరిణము (లేడి)వంటి అక్షి (కన్నులుగలామె),
అందమైన స్త్రీ};
జగంబుల్ = లోకములు;
ఎల్లన్ = సమస్తమును;
ఆనందించున్ = సంతోషించును;
హరియును = విష్ణువు;
జగములున్ =
లోకములు; మెచ్చగన్ = సంతోషించగా;
గరళమున్ = విషమును;
వారించుట = అదుపుచేయుట;
ఒప్పున్ = తగును;
కమలదళాక్షీ = సుందరీ {కమలదళాక్షి - కమలముల దళ (రేకుల) వంటి
అక్షి (కన్నులుగలామె),
అందమైనస్త్రీ}.
భావము:
ఓ మృగాక్షీ! ఉమాదేవీ! ఓ పద్మాక్షి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి
చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం
మంచిపని.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment