8-250-క.
హాలాహల భక్షణ కథ
హేలాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్
వ్యాళానల వృశ్చికముల
పాలై చెడ రెట్టిజనులు భయవిరహితులై.
టీకా:
హాలాహల =
హాలాహలమును;
భక్షణ = మింగిన;
కథన్ = వృత్తాంతమును;
హేలాగతిన్ = సంతోషముగా;
విన్నన్ = వినినచో;
వ్రాయన్ = వ్రాసినచో;
ఎలమిన్ = పూనికతో;
పఠించినన్ =
చదివినచో; వ్యాళ = సర్పముల;
అనల = అగ్ని;
వృశ్చికములన్ = తేళ్లకు;
పాలు = గురి;
ఐ = అయ్యి; చెడరు = చెడిపోరు;
ఎట్టి = ఎటువంటి;
జనులున్ = వారైనను;
భయ = భయము; విరహితులు = పూర్తిగాపోయినవారు;
ఐ = అయ్యి.
భావము:
ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్పూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వలన కానీ, తేళ్ళ వలన కానీ, అగ్ని వలన కానీ కష్టాలు కలుగవు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment