Thursday, July 31, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 368

ఖగనాథుం

10.1-1682-మ.
నాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
తీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
వత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
         పక్షిరాజైన గరుత్మంతుడు పూర్వం స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడిని జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకొన్నాడు కదా. అలాగే మంగళకరుడు, చక్రాయుధుడు నైన శ్రీకృష్ణుడు ఛేదిదేశాధిపతియైన శిశుపాలుణ్ణి, అతని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన నరపతులను ఓడించి భీష్మకమహారాజు పుత్రిక యైన రుక్మిణీదేవిని పెండ్లాడినాడు. ఆ పద్మంవంటి పరిమళం గల భీష్మకసుత సామాన్యురాలేం కాదు లక్ష్మీదేవి అంశతో జన్మించినామె. గొప్ప గుణవంతురాలు. కన్నెలలో మిన్న.
రేవతీ దేవి బలరాముల వివాహమైన పిమ్మట జరిగిన అద్బుతమైన రుక్మిణీ కల్యాణ వృత్తాంతం ఆశ్వాదించి తరించండి అని, ఈ అమృతగుళికలో సంగ్రహంగా అమర్చేసి ముందుమాట చేసేసారు మన పోతన్నగారు
10.1-1682-ma.
khaganaathuM DamaraeMdru gelchi sudha mun gaikonna chaMdaMbunan
jagateenaathula@M jaidyapakshacharulan saaLvaadulan gelchi bha
dragu@MDai chakri variMche bheeshmakasutan raajeevagaMdhin ramaa
bhagavatyaMSabhavan mahaaguNamaNin baalaamaNin rukmiNin.
          ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజులను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షమునందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వ = సాళ్వుడు{సాళ్వుడు - సాళ్వ దేశ ప్రభువు}; ఆదులన్ = మొదలగువారిని; గెల్చి = జయించి; భద్రగుడు = శుభమును పొందువాడు; = అయ్యి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; వరించెన్ = వివాహమాడెను; భీష్మక = భీష్మకుని యొక్క; సుతన్ = కుమార్తెను; రాజీవ = పద్మముల వంటి; గంధిన్ = సువాసన కలామెను; రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి - షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5ఙ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశ = అంశతో; భవన్ = పుట్టి నామెను; మహా = గొప్ప; గుణ = సుగుణము లనెడి {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; మణిన్ = రత్నములు కలామెను; బాలా = కన్యక లందు; మణిన్ = శ్రేష్ఠురాలను; రుక్మిణిన్ = రుక్మిణిని.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, July 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 367

భాందవముననైన

10.1-974-ఆ.
భాంధవమున నైనఁ గనైన వగనైనఁ
బ్రీతినైనఁ బ్రాణభీతినైన
క్తినైన హరికిఁ రతంత్రులై యుండు
నులు మోక్షమునకుఁ నుదు రధిప!
          ఓ పరీక్షిన్మహారాజా! చుట్టరికంతో నైనా, విరోధంతో నైనా, చింతతో నైనా, ప్రేమతో నైనా, ప్రాణభయంతో నైనా, భక్తితో నైనా ఏ లాగున నైనా సరే శ్రీహరి ధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.
కృష్ణుని విషయాసక్తు లైన గోపికలు తమ ప్రియునిగానే భావించారు కాని పరబ్రహ్మగా కాదు కదా. మరి వారు సత్వాది గుణమయా లైన దేహాలు ఎలా వదలగలిగారు అని సందేహం వెలిబుచ్చిన పరీక్షిత్తునకు శుకబ్రహ్మ భాగవత తత్వం వివరిస్తున్నాడు
10.1-974-aa
bhaaMdhavamuna naina@M baganaina vaganaina@M
breetinaina@M braaNabheetinaina
bhaktinaina hariki@M barataMtrulai yuMDu
janulu mOkshamunaku@M janudu radhipa!
          భాంధవమున = బంధుత్వముచేత; ఐనన్ = అయినను; పగన = శత్రుత్వముచేత; ఐనన్ = అయినను; వగన్ = చింతచేత; ఐనన్ = అయినను; ప్రీతిన్ = ప్రేమచేతను; ఐనన్ = అయినను; ప్రాణభీతి = అతిమిక్కిలి భయముచేత; ఐనన్ = అయినను; భక్తి = భక్తిచేతను; ఐనన్ = అయినను; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పరతంత్రులు = లగ్నమైనవారు; = అయ్యి; ఉండు = ఉండెడి; జనులు = వారు; మోక్షము = ముక్తి; కున్ = కు; చనుదురు = వెళ్ళెదరు; అధిప = రాజా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, July 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 366

చూడనివారల
10.1-292-.
చూని వారల నెప్పుడు
జూ లోకములు మూఁడు చూపులఁ దిరుగం
జూడఁ నేర్చిన బాలక
చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్.
          తనని చూడని వాళ్ళను ఎప్పుడు చూడడు. ముల్లోకాలు అతని చూపులతోనే గిరగిర తిరుగుతుంటాయి. అట్టి నారాయణుడు శైశవాస్తలో నున్న చిన్ని కన్నయ్యగా జనులను కన్నులెత్తి చూడసాగాడు. క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు.
10.1-292-ka.
chooDani vaarala neppuDu
jooDaka lOkamulu moo@MDu choopula@M dirugaM
jooDa@Mga naerchina baalaka
chooDaamaNi janula neRi@Mgi chooDa@Mga naerchen.
          చూడని = భక్తిలేక తనని లెక్కచేయని; వారలన్ = వారిని; ఎప్పుడును = ఏ సమయము నందును; చూడక = దయచూడకుండ; లోకములున్ = లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకము}; మూడున్ = మూడింటిని; చూపులన్ = తన ఆజ్ఞ ప్రకారము; తిరుగన్ = నడచునట్లుగ; చూడగన్ = చేయుట; నేర్చిన = తెలిసిన; బాలక = బాలురలో; చూడామణి = శ్రేష్ఠుడు (తలపైని మణి వలె); జనులన్ = చుట్టుపక్కల వారిని; ఎఱిగి = ఆనమాలుపట్టి; చూడగన్ = చూచుటను; నేర్చెన్ = నేర్చుకొనెను.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, July 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 365


గురువులు శిష్యులకు

 
1-42-క.
గురువులు ప్రియశిష్యులకుం
మ రహస్యములు దెలియఁ లుకుదు రచల
స్థి కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
          గురువు లైన వారు ప్రీతిపాత్రు లైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతు లెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వత మైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయ మేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
శౌనకాది మునీశ్వరులు సూత మహర్షిని భాగవతం చెప్పమని ఇలా అడుగసాగారు.
1-42-ka.
guruvulu priyaSishyulakuM
barama rahasyamulu deliya@M balukudu rachala
sthira kalyaaNaM beyyadi
purushulakunu niSchayiMchi bOdhiMpu tagan.
          గురువులు = గురువులు; ప్రియ = ప్రియ మైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్ట మైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = అత్యంత శుభకర మైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, July 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 364

వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా

10.1-374-క.
వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోత్వం బించుకయును
నే రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?
          ఓహో ఎవరండి వీరు? శ్రీకృష్ణుల వారు కాదా? అసలు వెన్న అంటే ఏమిటో ఎప్పుడు చూడనే లేదుట. పాపం దొంగతనం అంటే ఏమిటో ఎరుగరట. అబ్బో ఈ భూలోకంలో యింతటి బుద్ధిమంతులు ఎవరు లేరట.
వేరొకరి యింట్లో వెన్న దొంగిలించి కోతిపాలు చేస్తు దొరికిపోయిన చిలిపి కృష్ణుని పట్టుకొని, కొట్టజాలక కట్టేద్దా మనుకొంటు, ఇలా దెప్పుతోంది.
10.1-374-ka.
veerevvaru? SreekRshNulu
gaaraa? yennaDunu venna@M gaanara@MTa kadaa!
chOratvaM biMchukayunu
naera ra@MTa! dharitri niTTi niyatulu galarae?
          వీరు = ఈ పెద్దమనిషి; ఎవ్వరు = ఎవరు; శ్రీకృష్ణులు = కృష్ణడు గారు; కారా = కాదా; ఎన్నడును = ఎప్పుడు; వెన్నన్ = వెన్నను; కానరు = చూడనే చూడలేదు; అట = అట; కదా = కాదా; చోరత్వంబున్ = దొంగతనము; ఇంచుకయును = కొంచము కూడ; నేరరు = తెలియదు; అట = అట; ధరిత్రిన్ = భూమిపైన; ఇట్టి = ఇలాంటి; నియతులు = పద్దతి ప్రకార ముండువారు; కలరే = ఉన్నారా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~