Saturday, August 10, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_21


8-590-శా.
             కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? ర్వోన్నతిం బొందరే?
             వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ 
             బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై 
             యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!
        భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.  
       వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది. 
        కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; గలుగవే - కలుగవే = పొందలేదా ఏమి; గర్వోన్నతింబొందరే - గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను; పొందరే = చెందలేదా ఏమి; వారేరీ - వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరి - సిరిని = సంపదలను; మూటఁగట్టుకొని - మూటగట్టుకొని = కూడగొట్టుకొని; పోవంజాలిరే = తీసుకెళ్ళగలిగిరా, లేదు; భూమిపైఁబేరైనంగలదే - భూమి = నేలపైన; పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబిప్రముఖులుంబ్రీతిన్ - శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు; ప్రీతిన్ = కోరి; యశఃకాములై - యశః = కీర్తి; కాములు = కోరువారు; = అయ్యి; యీరే - ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; యిక్కాలమున్ - = ఇప్పటి; కాలమున్ = కాలమునందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు పుత్రుడు, శుక్రుడు}.
తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||

10 comments:

Anonymous said...

I am a big fan of Poet Pothana.
As such I like eveverything
Potana wrote and enjoy
reading it as many times as I can.

I would like to read his
"Saptama Schandam" which is my all time favorite.

I am a retired college professor living in a suburb of
New York City, USA
- BUT have not forgotten
my mother tongue and still
love to read and enjoy it.

vsrao5- said...
This comment has been removed by the author.
vsrao5- said...

నమస్కారం అఙ్ఞాతగారు. మన తెలుగు భాగవతం మీద ఇంత ఆసక్తి చూపు తున్నందుకు ధన్యవాదా లండి. తెలుగు భాషాభిమానం చూపుతున్నారు చాలా సంతోషం. కళాశాల ఆచార్యులుగా పదవీ విరమణ చేసా నన్నారు. మరి చిన్న పని తెలుగులో టైపు చేయటం దయచేసి మొదలట్టరూ, కృతఙ్ఞుడ నౌతాన. మీ పేరు, వేగరి (ఇమైలు) లు ఇవ్వలేదు. అందుకే ఇక్కడే రాస్తున్నా. నా వేగరి విఎస్ఆర్ఎఓ50ఎట్ జిమైలే.కం
గణనాధ్యాయి.

Anonymous said...

Thankyou ❤ veryyyyyy much sir this helped me a lot 😢😢😊😊😊😊

kosuru said...

ఈ పద్యం తెలుగు వారు మరచిపోలేని పద్యాలలో ఒకటి. అయితే దీన్ని ఎంత మంది తమ జీవితానికి మార్గదర్శకం చేసుకుంటారు.

Kiran Sundar Balantrapu said...

"ఓం నమో భగవతే వాసుదేవాయ" అన్న మంత్రంలో 'య' తరవాత విసర్గ అక్కర్లేదండీ.(పెట్టకూడదు)

Unknown said...

Ha first time it is very hard to follow but if we follow in a good manner it's very easy to follow in our life

Anonymous said...

వేదాంతసారం

Anonymous said...

సంస్కృత భాషలో వాసుదేవ శబ్దానికి షష్ఠీ విభక్తి రూపం 'వాసుదేవ' అని మాత్రమే కనుక వాసుదేవయః అని వ్రాయడం తప్పే అవతుంది

Anonymous said...

సవరణ: వాసుదేవాయ అని అవుతుంది