Tuesday, July 26, 2016

క్షీరసాగరమథనం – దంతచతుష్టాహతి

అష్టమ స్కంధముఐరావతావిర్భావము

8-258-క.
దంచతుష్టాహతి శై
లాంతంబులు విఱిగి పడఁగ వదాత కుభృ
త్కాంతంబగు నైరావణ
దంతావళ ముద్భవించె రణీనాథా!
8-259-క.
 లేని నడపు వడి గల
యొలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడఁగై యువతుల మురిపపు
కలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్.

టీకా:
            దంత = దంతములు; చతుష్టా = నాలుగింటి; హతిన్ = దెబ్బకి; శైలాంతంబులున్ = కొండశిఖరములు; విఱిగిపడగన్ = కూల్చివేయగలిగి; అవదాత = వెండి (తెల్లని); కుభృత్ = కొండవలె; కాంతంబు = ప్రకాశించునది యగు; ఐరావణ = ఐరావతము యనెడి; దంతావళము = ఏనుగు; ఉద్భవించెన్ = పుట్టెను; ధరణీనాథా = రాజా.
            తడ = తడబాటు; లేని = లేనట్టి; నడపు = నడక; వడి = బిగువు; కల = కలిగిన; ఒడలునున్ = దేహము; పెను = మిక్కలి; నిడుద = పొడవైన; కరము = తొండము; ఉరు = పెద్ధ; కుంభములున్ = కుంభములు; పెడగు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; యువతుల = ప్రాయపుస్త్రీల; మురిపపు = కులుకుల; నడకల్ = నడకల; కున్ = కు; మూలగురువు = ఒజ్జబంతి; అనన్ = అనగా; గజమున్ = ఏనుగు; ఒప్పెన్ = చక్కగానున్నది.

భావము:
            అదిగో పాలసముద్రంలో ఐరావతం పుట్టింది. ఆ ఏనుగునకు బలమైన నాలుగు (4) దంతాలు ఉన్నాయి.   వాటితో కొండశిఖరాలను సైతం కూల్చివేయగలదు. ఆ తెల్లని గజరాజు వెండికొండలా మెరిసిపోతోంది.
            ఆ మనోహరమైన ఐరావతము దేహం, తడబాటులేని అందమైన నడకల వేగం కలది. యౌవనంలో ఉన్న యువతులకు కులుకుల నడకలు నేర్పే ఒజ్జబంతిలా ఉంటుంది దాని అందమైన నడక. ఇంకా ఆ ఏనుగునకు చక్కగా అమరిన బాగా పొడవైన తొండమూ, పెద్ద కుంభస్థలముతో ఒప్పి ఉన్నాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: