Wednesday, September 30, 2015

కాళియ మర్దన - ఇట్లు క్రూరంబులయిన

10.1-671-వ.
ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతింజూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల.
          ఇట్లు = ఈ విధముగా; క్రూరంబులు = కఠినమైనవి; అయిన = ఐన; హరి = కృష్ణుని; చరణ = పాదముల; ప్రహరంబులన్ = తాకిడిచే; పడగలు = పడగలు; ఎడసి = భగ్నమై; నొచ్చి = నొప్పిని పొందినవాడై; చచ్చిన = చనిపోయినవాని; క్రియన్ = వలె; పడియున్న = పడి ఉన్నట్టి; పతిన్ = భర్తను; చూచి = చూసి; నాగకాంతలు = ఆ కాళియుని భార్యలు; దురంతంబు = అంతులేనిది; అయిన = ఐనట్టి; చింత = విచారము యొక్క; భరంబునన్ = అతిశయముచేత; నెఱ = మిక్కిలి; వగలన్ = దుఃఖముతో; ఒల్లంబోయి = తపించి; పల్లటిల్లిన = కలతపడిన; ఉల్లంబుల = మనసులతో.
१०.१-६७१-व.
इट्लु क्रूरंबुलयिन हरिचरण प्रहरंबुलं बडग लेडसि नोच्चि चच्चिनक्रियं बडियुन्न पतिंजूचि नागकांतलु दुरंतंबयिन चिंताभरंबुन निव्वटिल्लेडु नेव्वगल नोल्लोंबोयि पल्लटिल्लिन युल्लंबुल.
            ఈ విధంగా తాండవకృష్ణుడి దారుణమైన పాదాలతాకిడికి పడగలన్ని చితికిపోయి, చచ్చిపోయినవాడిలా పడి ఉన్న తమ భర్త కాళియుని చూసి, అతని భార్యలు ఎంతో శోకించారు. భరించలేని ఆ శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డాయి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, September 29, 2015

కాళియ మర్దన - ఈతఁడు

10.1-670-క.
తఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!
          ఈతడు = ఇతను; సర్వ = సమస్తమైన; చర = కదలగల; అచర = కదలలేని; భూత = జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన = అగు; పరమ = అత్యుత్తమ; యోగి = యోగియైన; పురుషుడు = వాడు; సేవా = భక్తులయందు; ప్రీతుడు = ప్రీతిగలవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు}; అగును = అగును; అని = అని; భీతిన్ = భయముతో; శరణంబు = శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు = మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా = రాజా.
१०.१-६७०-क.
ईतँडु सर्वचराचर
भूतेशुंडैन परमपुरुषुँडु सेवा
प्रीतुँडु श्रीहरि यगु" ननि
भीतिन् शरणंबु नोंदे बिट्टलसि नृपा!
            విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు ప్రభువు, పరమ పురుషుడు, పరమయోగి, భక్తితోసేవిస్తే సంతోషించేవాడు. ఇంతటి ఈ పిల్లాడు ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. రాజా! మిక్కలి భయంతో, అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, September 28, 2015

కాళియ మర్దన - వేలుపులైన

10.1-669-ఉ.
"వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు నా విషానల
జ్వాలు సోఁకినంతటన త్తురు; నేడిది యేమి చోద్య? మా
భీవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము గ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్.
          వేలుపులు = దేవతలు; ఐనన్ = అయినను; లావు = శక్తి; చెడి = నశించి; వేదనన్ = సంకటమును; పొందుచున్ = పొందుచు; నా = నా యొక్క; విష = విషము అనెడి; అనల = అగని; జ్వాలలు = మంటలు; సోకినన్ = తాకిన; అంతటనన్ = మాత్రముచేతనే; చత్తురు = చనిపోయెదరు; నేడు = ఇవాళ; ఇది = ఇది; ఏమి = ఏమిటి; చోద్యము = విచిత్రము; ఆభీల = భయంకరమైన; విష = విషమనెడి; అగ్ని = అగ్నిచేత; హేతి = దెబ్బల; చయ = అనేకము యొక్క; పీడ = బాధ; కున్ = కు; ఓర్చియున్ = తట్టుకొనుటేకాక; క్రమ్మఱంగ = మరల; ఈ = ఈ యొక్క; బాలుడు = చిన్నపిల్లవాడు; మత్ = నా యొక్క; ఫణా = పడగల; శతమున్ = నూటిని, సమూహమును; భగ్నము = నలిగిపోయినవి; కాన్ = అగునట్లు; వెసన్ = వేగముగా; త్రొక్కి = తొక్కి; ఆడెడున్ = నృత్యముచేస్తున్నాడు.
१०.१-६६९-उ. 
"वेलुपुलैन लावुचेडि वेदनँ बोंदुचु ना विषानल
ज्वाललु सोँकिनंतटन चत्तुरु; नेडिदि येमि चोद्य? मा
भीलविषाग्नि हेतिचयपीडकु नोर्चियुँ ग्रम्मर्रंग नी
बालुँडु मत्फणाशतमु भग्नमुगा वेसँ द्रोक्कि याडेडुन्.
            “నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా సరే శక్తి నశించిపోయి గిలగిలకొట్టుకొని చచ్చిపోతారు. అలాంటిది ఇవేళ ఈ బాలుడు క్రూరమైన నావిషాగ్ని జ్వాలల తాకిడి ధాటికి తట్టుకొన్నాడు. పైగా నా నూరు పడగలను చితకతొక్కేస్తూ నాట్యంచేసేస్తున్నాడు కూడ. ఇదేమి విచిత్రమో?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, September 27, 2015

ఇంటికి చేరాం.

హైదరాబాదు, బేంగలూరు పనులు చూసుకొని, గురుగాం ఇంటికి క్షేమంగా చేరాం. 

కాళియ మర్దన - ఇట్లు దుష్టజన

10.1-668-వ.
ఇట్లు దుష్టజన దండధరావతారుండైన హరి వడిగలిగిన పడగల మీఁదఁ దాండవంబు సలుప, బెండుపడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబుగ్రక్కుచు నుక్కుచెడి చిక్కి దిక్కులుచూచుచుఁ గంఠగతప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున.
          ఇట్లు = ఇలాగున; దుష్ట = చెడ్డ; జన = వారి యెడల; దండధర = యముని; అవతారుండు = రూపుదాల్చినవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; వడి = బిగువు; కలిగిన = ఉన్న; పడగల = పాముపడగల; మీదన్ = పైన; తాండవంబు = ఉధృతమైన నాట్యమును; సలుపన్ = చేయుచుండగా; బెండుపడి = నిస్సారుడై; ఒండొండ = క్రమముగా; ముఖంబులన్ = ముఖములనుండి; రక్త = రక్తము; మాంసంబులు = మాంసములు; ఉమియుచున్ = కక్కుతు; కన్నులన్ = కన్నులనుండి; విషంబున్ = విషమును; క్రక్కుచున్ = కక్కుతు; ఉక్కుచెడి = బలహీనపడి; చిక్కి = కృశించి; దిక్కులు = ఇటునటు; చూచుచున్ = చూస్తు; కంఠ = కుత్తుకయందు; గత = ఉన్న; ప్రాణుండు = ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; ఫణీంద్రుడు = సర్పరాజు; తన = తన యొక్క; మనంబున = మనసులో.
१०.१-६६८-व.
इट्लु दुष्टजन दंडधरावतारुंडैन हरि वडिगलिगिन पडगल मीँदँ दांडवंबु सलुप, बेंडुपडि योंडोंड मुखंबुल रक्तमांसंबु लुमियुचुँ गन्नुल विषंबुग्रक्कुचु नुक्कुचेडि चिक्कि दिक्कुलुचूचुचुँ गंठगतप्राणुंडै फणींद्रुंडु तन मनंबुन.
            ఈ విధంగా దుర్మార్గుల పాలిటి కాలయముడైన కృష్ణుడు కాళియుడి బిగువైన పడగలపై ప్రచండ తాండవం చేసాడు; దానితో కాళియుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క నోటినుండి రక్తమాంసాలు కక్కుతున్నాడు. కళ్ళల్లోంచి విషం ఉబుకుతోంది. పౌరుషం చెడిపోయింది. బాగా నీరసించిపోయాడు. ప్రాణాలు గొంతులోకి వెళ్ళుకొచ్చేశాయి. దిక్కులు చూస్తు కాళియుడు తనలో తాను ఇలా అనుకొన్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, September 26, 2015

కాళియ మర్దన - ఘనతర

10.1-667-క.
తర సుషిరానంద
స్వములతో సిద్ధ సాధ్య చారణ గంధ
ర్వ నిలింప మునిసతులు చ
య్య గురిసిరి విరులవాన లాడెడు హరిపై.
          ఘనతర = మిక్కిలి గొప్పదైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; సుషిర = ఒరరకమైనమురళియొక్క; ఆనంద = సంతోషకరమైన; స్వనముల = శబ్దముల; తోన్ = తోటి; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; చారణ = చారణుల; గంధర్వ = గంధర్వుల; నిలింప = దేవతల; ముని = మునుల; సతులు = భార్యలు; చయ్యన = శీఘ్రముగా; కురిసిరి = కురిపించిరి; విరుల = పూల; వానలు = వానలను; ఆడెడి = నాట్యముచేయుచున్న; హరి = కృష్ణుని; పై = మీద.
१०.१-६६७-क.
घनतर सुषिरानंद
स्वनमुलतो सिद्ध साध्य चारण गंध
र्व निलिंप मुनिसतुलु च
य्यन गुरिसिरि विरुलवान लाडेडु हरिपै.
            ఆ కాళియమర్దనునిపై ఆకాశంమీద నుండి సిద్దులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, దేవర్షులు వారి భార్యలు పూలవానలు కురిసారు. అమృతం తాగిన అధికతర ఆనందం వెల్లివిరిసే కంఠాలతో జయజయ ధ్వానాలు చేసారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, September 25, 2015

కాళియ మర్దన - కుక్షిన్

10.1-666-శా.
కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్నున్న యా
క్షోహంత వడిన్ మహాఫణిఫణారంగప్రదేశంబుపై
క్షీణోద్ధత నాడుఁ; బాడుఁ; జెలఁగున్హాసంబుతోడం బద
ప్రక్షేపంబులు చేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్.
          కుక్షిన్ = కడుపులో; లోకములు = చతుర్దశభువనములు; ఉన్న = ఉన్నట్టి; గౌరవము = భారము; తోన్ = తోటి; గోప = గొల్లవాని; ఆకృతిన్ = ఆకారముతో; ఉన్న = ఉన్న; ఆ = ఆ ప్రసిద్ధుడైన; రక్షోహంత = కృష్ణుడు {రక్షోహంత - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; వడిన్ = వేగముగా; మహా = గొప్ప; ఫణి = పాము; ఫణా = పడగలనెడి; రంగ = వేదికా; ప్రదేశంబు = స్థలము; పైన్ = మీద; అక్షీణ = అధికమైన; ఉద్ధతన్ = అతిశయముతో; ఆడున్ = నాట్యమాడును; పాడున్ = పాటలుపాడును; చెలగున్ = విజృంభించును; హాసంబు = నవ్వుల; తోడన్ = తోటి; పద = అడుగులు; ప్రక్షేపంబులు = వేయుట; చేయున్ = చేయును; కేళీ = లీలా; గతులన్ = రీతులతో; ప్రాణ = ప్రాణము; ఏక = ఒకటిమాత్రమే; శేషంబు = మిగిలినది; కన్ = అగునట్లు.
१०.१-६६६-शा.
कुक्षिन् लोकमुलुन्न गौरवमुतो गोपाकृतिन्नुन्न या
रक्षोहंत वडिन् महाफणिफणारंगप्रदेशंबुपै
नक्षीणोद्धत नाडुँ; बाडुँ; जेलँगुन्; हासंबुतोडं बद
प्रक्षेपंबुलु चेयुँ गेळिगतुलं ब्राणैकशेषंबुगन्.
            గోపబాలకుని రూపంలో ఉన్న రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడి కడుపులో లోకాలన్నీ ఉన్నాయి. ఆ బరువుతో సహా కాళియుడి పడగలనే మండపంమీద మిక్కలి ఉల్లాసంగా వేగంగా నృత్యం చేసాడు. పాటలు పాడాడు. చెలరేగి నవ్వుతు గంతులు వేసాడు. పాదాలతో బలంగా తొక్కుతు ఆటలాడాడు. కాళియుడి తల ప్రాణాలు తోక్కొచ్చాయి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, September 24, 2015

కాళియ మర్దన - ఘన యమునా. . పద్మరాగాది

10.1-665-సీ.
న యమునానదీ ల్లోల ఘోషంబురసమృదంగఘోషంబు గాఁగ
సాధుబృందావనరచంచరీక గానంబు గాయక సుగానంబు గాఁగ
లహంస సారస మనీయమంజు శబ్దంబులు తాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది; నులు సభాసీననులు గాఁగ
10.1-665.1-తే.
ద్మరాగాది రత్నప్రభాసమాన; హితకాళియ ఫణిఫణామండపమున
ళినలోచన విఖ్యాత ర్తకుండు; నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.
          ఘన = గొప్ప; యమునా = యమున అనెడి; నదీ = నదియొక్క; కల్లోల = పెద్దఅలల; ఘోషంబు = పెద్దధ్వని; సరస = రసయుక్తమైన; మృదంగ = మద్దెల; ఘోషంబు = ధ్వని; కాగన = అగుతుండగ; సాధు = చక్కని; బృందావన = బృందావనమునందు; చర = మెలగెడి; చంచరీక = తుమ్మెదల; గానంబు = పాట; గాయక = గాయకుల; సు = మంచి; గానంబున్ = పాటలు; కాగన్ = అగుచుండగ; కలహంస = కలహంసల; సారస = బెగ్గురుపక్షుల; కమనీయ = మనోజ్ఞమైన; మంజు = ఇంపైన; శబ్దంబులు = ధ్వనులు; తాళ = పక్కతాళమువేయువారి; శబ్దములు =  ధ్వనులు; కాగన్ = అగుచుండగ; దివి = ఆకాశము; నుండి = నుండి; వీక్షించు = చూచెడి; దివిజ = దేవతలు; గంధర్వ = గంధర్వులు; ఆది = మొదలైన; జనులు = ప్రజలు; సభ = సభయందు; ఆసీన = కూర్చున్న; జనులు = వారు; కాగన్ = అగుచుండగ.
          పద్మరాగ = కెంపులు; ఆది = మొదలైన; రత్న = రత్నములచేత; ప్రభాసమాన = మిక్కలి వెలుగుచున్న; మహిత = గొప్ప; కాళియ = కాళియుడు అనెడి; ఫణి = పాము; ఫణా = పడగలనెడి; మండపమునన్ = వేదికపైన; నళినలోచన = పద్మాక్షుడు, కృష్ణుడు; విఖ్యాత = అనిప్రసిద్ధుడైన; నర్తకుండు = నృత్యముచేయువాడు; నిత్య = శాశ్వతమైన; నైపుణమునన్ = నేర్పుచేత; పేర్చి = అతిశయించి; నృత్యము = నాట్యములు; ఆడెన్ = చేసెను.
१०.१-६६५-सी.
घन यमुनानदी कल्लोल घोषंबु; सरसमृदंगघोषंबु गाँग
साधुबृंदावनचरचंचरीक गा; नंबु गायक सुगानंबु गाँग
कलहंस सारस कमनीयमंजु श; ब्दंबुलु ताळशब्दमुलु गाँग
दिविनुंडि वीक्षिंचु दिविज गंधर्वादि; जनुलु सभासीनजनुलु गाँग
१०.१-६६५.१-त.
पद्मरागादि रत्नप्रभासमान; महितकाळिय फणिफणामंडपमुन
नळिनलोचन विख्यात नर्तकुंडु; नित्यनैपुणमुनँ बेर्चि नृत्य माडे.
            ఆ కాళీయుని పడగలు అనే విశాలమండపంమీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి, బహు నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ పాముపడగల మండపం పద్మరాగాలు మొదలైన రత్నాలు చేత ప్రకాశిస్తున్నది. ఆ నృత్యావికి సహకారం అందిస్తున్నట్లు యమునానదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతున్న తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల గానంలా వినబడుతున్నది. కలహంసలు, సారసపక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాళధ్వనులను సంతరించుకున్నాయి. ఆకాశంలోనుండి చూస్తూ ఉన్న దేవతలు, గంధర్వులు మొదలైనవారు సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల్లగా ఉన్నారు. మొత్తం మీద అదొక గొప్ప నాట్య కచేరీలా ఉంది.
             ఈ సీసపద్యం క్రింది పద్మరాగాది అనే తేటగీతి బహు మథురమైనది; బహుళ ప్రసిద్ధమైనది. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, September 23, 2015

కాళియ మర్దన - వెఱమఱలేని

10.1-663-చ.
వె మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ
చి ఖగేంద్రుచందమునఁ క్కన దౌడలు పట్టి కన్నులం
జొజొఱ దుర్విషానలము జొబ్బిలుచుండఁగ నెత్తి లీలతోఁ
జిజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్.
10.1-664-వ.
ఇట్లు వేగంబుగ నాగంబు వీచివైచి జగజ్జెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున.
          వెఱ = బెదురు; మఱ = మరపు; లేని = లేనట్టి; మేటి = గొప్పవాడు; బలువీరుడు = మహాశూరుడు; కృష్ణకుమారుడు = బాలకృష్ణుడు; ఒక్క = ఒకేఒక్క; చేన్ = చేతితో; చఱచి = కొట్టి; ఖగేంద్రు = గరుత్మంతుని; చందమునన్ = వలె; చక్కన = చక్కగా; దౌడలు = రెండుదౌడలను; పట్టి = పట్టికొని; కన్నులన్ = కళ్ళమ్మట; జొఱజొఱ = జొఱజొఱ అను ధ్వనితో; దుర్ = చెడ్డ; విష = విషము అనెడి; అనలము = అగ్ని; జొబ్బిలిచుండగన్ = స్రవించుచుండగా; ఎత్తి = పైకెత్తి; లీల = విలాసము; తోన్ = తోటి; జిఱజిఱ = జిఱజఱ అను ధ్వనితో; త్రిప్పి = తిప్పి; వైచెన్ = విసిరివేసెను; పరిశేషిత = కొద్దిగమిగిలిన; దర్పము = మదముకలది; క్రూర = క్రూరమైన; సర్పమున్ = పామును.
          ఇట్లు = ఇలా; వేగంబుగన్ = వడిగా; నాగంబున్ = పామును; వీచివైచి = విసిరేసి; జగత్ = లోకమునకే; జెట్టి = శూరుడు; ఐన = అయిన; నందుని = నందుని యొక్క; పట్టి = కుమారుడు; రెట్టించిన = ద్విగృణీకృతమైన; సంభ్రమంబునన్ = వేగిరపాటుతో.
१०.१-६६३-च.
वेर्र मर्रलेनि मेटि बलुवीरुँडु कृष्णकुमारुँ डोक्क चेँ
जर्रचि खगेंद्रुचंदमुनँ जक्कन दौडलु पट्टि कन्नुलं
जोर्रजोर्र दुर्विषानलमु जोब्बिलुचुंडँग नेत्ति लीलतँ
जिर्रजिर्रँ द्रिप्पि वैचेँ बरिशेषित दर्पमुँ ग्रूरसर्पमुन्.
१०.१-६६४-व.
इट्लु वेगंबुग नागंबु वीचिवैचि जगज्जेट्टियैन नंदुनिपट्टि रेट्टिंचिन संभ्रमंबुन.
            నదురు బెదురు లేని గొప్ప మహావీరుడైన బాలకృష్ణుడు ఒక అరచేత్తో కాళియుడి పడగల మీద ఒక చరుపు చరిచాడు. గరుత్మంతుడిలా దౌడలు రెండు పట్టుకొని పైకెత్తి గిరగిర తిప్పి విలాసంగా విసిరికొట్టాడు. కాళీయుని కళ్ళలోంచి దుష్ట విషాగ్నులు బుసుబుస పొంగి జరజర కారాయి. ఆ క్రూర మైన కాళియుడి గర్వమంతా అణగిపోయింది.
            ఈ విధంగా లోకానికే మేటి వీరుడైన శ్రీకృష్ణుడు పామును గిరగిర తిప్పి విసిరికొట్టి రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, September 22, 2015

కాళియ మర్దన

 
10.1-662-శా.
అంతం గృష్ణుఁడు మేను పెంప భుజగుం డావృత్తులం బాసి తా
సంప్తాయతభోగుఁ డై కఱచుటల్ చాలించి నిట్టూర్పుతో
శ్రాంతుండై తల లెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు
శ్చింతన్ దిక్కులు చూచుచుం దలగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్.
          అంతన్ = ఆ తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; మేను = శరీరమును; పెంపన్ = పెంచగా; భుజగుండు = ఆ కాళియ సర్పము; ఆవృత్తులను = తన చుట్లను; పాసి = విడిచి; తాన్ = తను; సంతప్త = సంతాపముపొందిన; ఆయత = నిడుపాటి; భోగుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; కఱచుటలు = కరుచుట; చాలించి = ఆపి; నిట్టూర్పు = దీర్ఘశ్వాసల; తో = తో; శ్రాంతుడు = బడలినవాడు; ఐ = అయ్యి; తలలు = పడగలను; ఎత్తి = పైకెత్తి; దుర్ = చెడ్డ; విషమున్ = విషమును; నాసా = ముక్కురంధ్రముల; వీదులన్ = దారిని; క్రమ్మన్ = కమ్ముకొన; దుశ్చింతన్ = చెడు ఆలోచనలతో; దిక్కులున్ = ఇటునటు; చూచుచున్ = చూస్తు; తలగి = తొలగి; నిల్చెన్ = నిలబడెను; ధూమ = పొగతోటి; కాష్ఠ = కొఱవికట్టె; ఆకృతిన్ = లాగ.
१०.१-६६२-शा.
अंतं गृष्णुँडु मेनु पेंप भुजगुं डावृत्तुलं बासि ता
संतप्तायतभोगुँ डै कर्रचुटल् चालिंचि निट्टूर्पुतो
श्रांतुंडै तल लेत्ति दुर्विषमु नासावीथुलं ग्रम्म दु
श्चिंतन् दिक्कुलु चूचुचुं दलगि निल्चेन् धूमकाष्ठाकृतिन्.
            అప్పుడు కృష్ణుడు చటుక్కున తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళీయుడి చుట్టలు జారిపోయాయి. అతని పడగలు వేడెక్కిపోయాయి దేహం కమిలిపోయింది. కరవడం మానేసాడు. పొగచూరిన కట్టెలా తేజస్సుకోల్పోయిన నాగరాజు నిట్టూర్పులు వదుల్తూ బాగా కష్టపడి పడగలు పైకెత్తాడు. విషాన్ని విరజిమ్మే చెడ్డ ఉద్దేశంతో అటునిటు చూస్తు పక్కకి తొలగి నిల్చున్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :