Monday, June 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 337

చనుదెంచెన్ ఘను

8-107-మ.
నుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
నినాదం బదె; చక్ర మల్లదె; భుజంధ్వంసియున్ వాఁడె; క్ర
న్న యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
          గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు. అనుకుంటు నారాయణునికి నమస్కారం అంటు నమస్కారాలు చేస్తున్నారు.
8-107-ma.
chanudeMchen ghanu@M Dallavaa@MDe; hari pajjaM gaMTirae lakshmi? SaM
kha ninaadaM bade; chakra mallade; bhujaMgadhvaMsiyun vaa@MDe; kra
nnana yaeteMche naTaMchu vaelpulu namOnaaraayaNaayaeti ni
svanulai mrokkiri miMTa hastiduravasthaavakrikiM jakrikin.
          చనుదెంచెన్ = వచ్చినాడు; ఘనుడు = గొప్పవాడు; అల్ల = అక్కడి; వాడె = అతడే; హరి = విష్ణువు; పజ్జన్ = పక్కనే; కంటిరే = చూసితిరా; లక్ష్మిన్ = లక్ష్మీదేవిని; శంఖ నినాదంబు = పాంచజన్య శంఖ ధ్వని; అదె = అక్కడ నున్నదే; చక్రము = సుదర్శన చక్రము; అల్లదె = అక్క డున్నదే; భుజంగ ధ్వంసియున్ = గరుత్మంతుడు; వాడె = అతడే; క్రన్ననన్ = వరుసగా; ఏతెంచెన్ = వచ్చిరి; అట = అని; అంచున్ = అనుచు; వేల్పులు = దేవతలు; నమో = నమస్కారము; నారాయణ = నారయణునికి; ఇతి = ఇది యనెడి; నిస్వనులు = పలికెడివారు; = అయ్యి; మ్రొక్కిరి = నమస్కరించిరి; మింటన్ = ఆకాశము నందు; హస్తి దురవస్థా వక్రికిన్ = హరికి {హస్తి దురవస్థా వక్రి - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడివాడు), విష్ణువు}; చక్రికిన్ = హరికి {చక్రి - చక్రము ఆయుధముగాగల వాడు, విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, June 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 336

చిక్కడు


10.1-383-క.
చిక్కఁడు సిరికౌగిలిలోఁ
జిక్కఁడు సనకాదియోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్.
   ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
10.1-383-ka.
chikka@MDu sirikaugililO@M
jikka@MDu sanakaadiyOgichittaabjamulaM
jikka@MDu SrutilatikaavaLi@M
jikke nata@MDu leela@M dalli chaetan ROlan
          చిక్కడు = చిక్కుకొనడు; సిరి = లక్ష్మీదేవి యొక్క; కౌగిలి = రెండు చేతుల నడుమ; లోన్ = అందును; చిక్కడు = దొరకడు; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు అనెడి ఆది యోగులు}; ఆది = మున్నగు; యోగి = యోగుల; చిత్త = మనసు లనెడి; అబ్జములన్ = పద్మముల నైనను; చిక్కడు = కట్టుబడడు; శ్రుతి = వేదము లనెడి; లతికా = తీగల; ఆవళిన్ = సమూహమున కైనను; చిక్కెను = దొరికెను; అతడు = అట్టివాడు; లీలన్ = అవలీలగా, మాయతో; తల్లి = తల్లి యొక్క; చేతన్ = చేతిలో; ఱోలన్ = రోటికి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, June 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 335

ఇమ్మగువ


10.1-315-క.
మ్మగువ తన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మావిఁ గఱచి వడిఁ జనె
మ్మా! యీ ముద్దు కుఱ్ఱఁ ల్పుఁడె? చెపుమా.
          ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-315-ka.
i mmaguva tannu vaakiTa@M
grummaruchO@M jeeri nilipikoni pae raDugaM
gemmaavi@M ga~rachi vaDi@M jane
gODalu mru chchanuchu natta goTTe lataaMgee!
nammaa! yee muddu ku~r~ra@M Dalpu@MDe? chepumaa.
          = ; మగువ = ఇల్లాలు; తన్నున్ = అతనిని; వాకిటన్ = ఇంటి గుమ్మం ముందు; క్రుమ్మరుచోన్ = తిరుగుచుండగా; చీరి = పిలిచి; నిలిపికొని = నిలబెట్టి; పేరున్ = నామమును; అడుగన్ = ఏమిటని అడుగగా; కెంపు = ఎర్రని; మోవిన్ = పెదవిని; కఱచి = కరచి; వడిన్ = వేగముగా; చనెన్ = వెళ్ళిపోయెను; అమ్మా = తల్లీ; = ; ముద్దు = మనోజ్ఞమైన; కుఱ్ఱడు = పిల్లవాడు; అల్పుడె = తక్కువవాడా, కాదు; చెపుమా = తెలుపుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~