Sunday, December 31, 2017

ద్వారక అస్తమయం - 14

11-23-వ.
మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.
11-24-క.
"మది సెడి కన్నులుగానక
మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?

భావము:
గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు. “మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెర్రివాళ్ళు ఎవరైనా ఉంటారా. అనుభవించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=24

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, December 30, 2017

ద్వారక అస్తమయం - 13

11-21-క.
యదుడింభకులను గనుఁగొని
మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.
11-22-క.
"వాలాయము యదుకుల ని
ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌.


భావము:
యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ... “యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Friday, December 29, 2017

ద్వారక అస్తమయం - 12

11-19-క.
దర్పించి యాదవులు తమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ
గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.
11-20-ఉ.
మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
"బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై.


భావము:
అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Thursday, December 28, 2017

ద్వారక అస్తమయం - 11

11-18-వ.
అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

భావము:
ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=18

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, December 25, 2017

ద్వారక అస్తమయం - 10

11-17-క.
శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "


భావము: 
పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :
Sunday, December 24, 2017

ద్వారక అస్తమయం - 9

11-15-క.
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.
11-16-మత్త.
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై
పెక్కురూపులు దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

భావము:
నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు. పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=15

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, December 23, 2017

ద్వారక అస్తమయం - 8

11-13-క.
వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల 
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.
11-14-క.
"జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
దనువులు నిలుకడ గావఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!


భావము:
అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.
“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
ద్వారక అస్తమయం - 7

11-12-సీ.
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; 
గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; 
గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; 
శ్రీకరపీతకౌశేయవాసు
రుక్మిణీనయన సరోజ దివాకరు; 
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము
11-12.1-తే.
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ
గోటిమన్మథలావణ్యకోమలాంగు
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.

భావము:
మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=12

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

ద్వారక అస్తమయం - 7

11-12-సీ.
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; 
గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; 
గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; 
శ్రీకరపీతకౌశేయవాసు
రుక్మిణీనయన సరోజ దివాకరు; 
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము
11-12.1-తే.
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ
గోటిమన్మథలావణ్యకోమలాంగు
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.

భావము:
మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=12

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, December 22, 2017

ద్వారక అస్తమయం - 6

11-11-వ.
"నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచు సమయంబున జటావల్కల కమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణ ముద్రాముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరః కశ్యప వామదేవ వాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు.


భావము:
“సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాఖిల్యులు, అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
ద్వారక అస్తమయం - 5

11-9-క.
"హరిపాదకమల సేవా
పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫురణంబు సంభవించెనొ
యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే! "
11-10-క.
అనిన జనపాలునకు ని
ట్లని సంయమికులవరేణ్యుఁ డతి మోదముతో
విను మని చెప్పఁగఁ దొడఁగెను
ఘనతర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్‌.

భావము:
“మహానుభావ! మహాయోగీశ్వర! శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో తెలపండి.” ఇలా అడిగిన మహారాజుకు సంయమి శ్రేష్ఠుడైన శుకమహర్షి ఘనతరములు గంభీరములు అయిన వాక్కులతో ఈ విధంగా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=3&padyam=9

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, December 17, 2017

ద్వారక అస్తమయం - 4

11-8-వ.
అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.

భావము:
ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణశాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు.” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=3&padyam=8

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, December 16, 2017

ద్వారక అస్తమయం - 3

11-7-సీ.
ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా; 
శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక; 
దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి; 
యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు 
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన; 
నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "


భావము:
ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
ద్వారక అస్తమయం - 2

11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెం; 
దన నిజభక్తులు యాదవ
ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.
11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం 
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో 
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యంబయ్యె నత్యుగ్రమై.

భావము:
మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు. దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=2&padyam=6

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, December 15, 2017

ద్వారక అస్తమయం - 1

11-3-మ.
"బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
11-4-వ.
అంత.


భావము:
“శ్రీకృష్ణుడు మిక్కలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు....:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Wednesday, December 13, 2017

పోతన రామాయణం - 56

9-364-వ.
ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.

భావము:
శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్దంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=364

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, December 11, 2017

పోతన రామాయణం - 55

9-362-ఆ.
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
గదిసి తిరుగువారుఁ గన్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
లరిగి రాదియోగు లరుగు గతికి.
9-363-క.
మంతనములు సద్గతులకుఁ
బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతనపూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్.


భావము:
శ్రీరామునితో కలిసిమెలసి మెలగిన వారు; తనివితీరా చూసిన వారు; ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు. శ్రీరామచంద్రమూర్తిని గుఱించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంతమార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి. పూర్వజన్మలలోను , యీ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
Saturday, December 9, 2017

పోతన రామాయణం - 54

9-360-చ.
వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దశదిగధీశమౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్
దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్
దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.
9-361-ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.

భావము:
సాగరుని అహంకారం సర్వం అణచినవానికి; సకల దిర్పాలకుల కిరీటాలలోని మణులు అనె దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి; వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి; అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి; సాధులను పాలించువానికి; దశరథరాజు కుమారునికి; రావణాసురుని సంహరించిన వీరునికి; వినమ్రుడనై మ్రొక్కుతాను. నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=361

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::