Monday, August 31, 2015

తెలుగుభాగవతం.ఆర్గ్ - పఫిన్ బ్రౌజరు

        భాగవత అభిమానులారా ఆండ్రాయిడు, ఐఓఎస్ వాడుకరులారా మీ చరవాణి, టాబ్, ఐఫోను, ఐపాడు మున్నగు వానిలో “పఫిన్ (puffin) అనే బ్రౌజరు వేసుకోండి” తెలుగుభాగవతం.ఆర్గ్ లోని పద్యగద్యలు వినవచ్చుకూడా. విని, ఆస్వాదించి, ఆనందించండి. ఏప్  గా అందుబాటులో ఉంది దిగుమతి చేసుకొండి. (can down load from app store). నేను ఐపాడులో చూసాను బావుంది.
జై శ్రీకృష్ణ
: :చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనం అందరం: :  

కాళియ మర్దన - మానవేశ్వర

10.1-636-సీ.
"మానవేశ్వర! యొక్క డుఁగు కాళిందిలోఁ; దది యెప్పుడుఁ గాళియాహి
విషవహ్నిశిఖలచే వేచు చుండును; మీఁదఁఱతెంచినంతన క్షులైనఁ
డి మ్రగ్గు; నందుఁ దద్భంగశీకరయుక్తవనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి
యైన నప్పుడ చచ్చుట్టి యా మడుఁగులోనుదకంబు పొంగుచు నుడుకు చుండుఁ
10.1-636.1-తే.
జూచి వెఱగంది కుజనుల స్రుక్కఁ జేయ; వతరించిన బలువీరుఁ డాగ్రహించి
భుజగవిషవహ్ని దోషంబుఁ బొలియఁజేసి; సుజలఁ గావించి యా నదిఁ జూతు ననుచు.
            మానవేశ్వరా = రాజా {మానవేశ్వరుడు - మానవులకు ప్రభువు, రాజు}; ఒక్క = ఒకానొక; మడుగు = మడుగు {మడుగు - ఏటిలో లోతైన నిడుపాటి ప్రాంతము, హ్రదము}; కాళింది = యమునానది; లోన్ = అందు; కలదు = ఉన్నది; అది = ఆ మడుగు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; కాళియ = కాళియుడు అనెడి; అహి = పాము యొక్క; విష = విషపు; అగ్ని = అగ్ని; శిఖల = జ్వాలల; చేన్ = చేత; వేచుచుండును = తపించిపోతుండును; మీదన్ = పైన; పఱతెంచి = వెళ్ళిన; అంతనన్ = మాత్రము చేతనే; పక్షులు = పక్షులు; ఐనన్ = అయినను; పడి = పడిపోయి; మ్రగ్గును = చచ్చిపోవును; అందున్ = ఆ మడుగునందు; తత్ = ఆ మడుగు యొక్క; భంగ = అలల వలని; శీకర = తుపుంరులతో; యుక్త = కూడినట్టి; పవనంబు = గాలి; సోకినన్ = తగులగానే; ప్రాణులు = జంతువులు; ఎవ్వి = ఏవి; ఐనన్ = అయినను; అప్పుడ = అప్పుడే; చచ్చున్ = చనిపోవును; అట్టి = అటువంటి; ఆ = ఆ; మడుగు = మడుగు; లోన్ = అందలి; ఉదకంబు = నీరు; పొంగుచున్ = ఉబుకుచు; ఉడుకుచున్ = తెర్లుతు; ఉండున్ = ఉండును; చూచి = అది చూసి.
            వెఱగంది = ఆశ్చర్యపడి; కుజనులన్ = దుష్టులను; స్రుక్కజేయ = అణచివేయుటకు; అవతరించిన = పుట్టినట్టి; బలువీరుడు = బలమైనశౌర్యముకలవాడు; ఆగ్రహించి = కోపించి; భుజగ = కాళియసర్పము యొక్క; విష = విషపు; వహ్ని = అగ్ని వలని; దోషంబున్ = కల్మషమును; పొలియజేసి = పోగొట్టి; సుజలన్ = మంచినీరుకది; కావించి = చేసి; ఆ = ఆ యొక్క; నదిన్ = నదిని; చూతున్ = కాపాడెదను; అనుచున్ = అనుచు.
१०.१-६३६-सी. 
"मानवेश्वर! योक्क मडुँगु काळिंदिलोँ; गल; ददि येप्पुडुँ गाळियाहि
विषवह्निशिखलचे वेचु चुंडुनु; मीँदँ; पर्रतेंचिनंतन पक्षुलैनँ
बडि म्रग्गु; नंदुँ दद्भंगशीकरयुक्त; पवनंबु सोँकिनँ ब्राणु लेव्वि
यैन नप्पुड चच्चु; नट्टि या मडुँगुलो; नुदकंबु पोंगुचु नुडुकु चुंडुँ
१०.१-६३६.१-त. 
जूचि वेर्रगंदि कुजनुल स्रुक्कँ जेय; नवतरिंचिन बलुवीरुँ डाग्रहिंचि
भुजगविषवह्नि दोषंबुँ बोलियँजसि; सुजलँ गाविंचि या नदिँ जूतु ननुचु.

              “మహారాజా! యమునానదిలో మడుగు ఒకటి ఉంది. కాళియుడనే సర్పరాజు విషజ్వాలలతో అది ఎప్పుడు తుకతుకలాడుతు ఉంటుంది. దాని పై ఎగిరే పక్షులు కూడ ఆ విషపు గాలులు సోకి చచ్చి అందులో పడిపోతాయి. ఆ కాళిందిలోని అలలకి చెలరేగిన నీటితుంపరలు కలిసిన గాలి సోకితే చాలు ఏ జంతువైనా అప్పటికప్పుడు చచ్చి పడిపోవలసిందే. ఆ మడుగులోని జలాలు ఎప్పుడు కుతకుత పొంగుతు ఉడుకుతు ఉంటాయి. ఆ మడుగును చూచి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. దుర్మార్గులను అణచేయడానికి అవతరించిన ఆ మహావీరునికి బాగా కోపం వచ్చింది. ఈ నదిలోని పాము విషాగ్ని దోషం పోగొట్టి, నిర్మల జలాలతో నిండి ఉండే నదిగా చేస్తాను. అని నిశ్చయించుకొన్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, August 30, 2015

కాళియ మర్దన - తొఱ్ఱులగాచిన

10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె
వెఱ్ఱుల కైనను దలంపవిప్రవరేణ్యా! "
          తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన = మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని = కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్ = అమృతమును; కొనకొని = పూని; చెవులన్ = చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో పీల్చుకొనగా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచి చూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
१०.१-६३४-क.
तोर्र्र्रुलँ गाचिन नंदुनि
कुर्र्र्रनि चरितामृतंबु गोनकोनि चेवुलन्
जुर्र्र्रंगँ दनिवि गल्गुने;
वेर्र्र्रुल कैननु दलंप? विप्रवरेण्या! "
            ఓ బ్రహ్మణోత్తమా! శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంక చాలు అనుకోగలడా? ఊహు అనుకోలేడు."
10.1-635-వ.
అనిన శుకుం డిట్లనియె.
          అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            అని పరీక్షిన్మహారాజు అనగా, శుకమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, August 29, 2015

కాళియ మర్దన - అనిన

10.1-633-వ.
అనిన “నయ్యగాధజలంబుల వలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలంబా వ్యాళం బేల యుండె? నెఱిగింపుము.
          అనినన్ = అనగా; ఆ = ఆ; అగాధ = మిక్కిలి లోతుగల; జలంబుల = నీటి; వలన = నుండి; మాధవుండు = కృష్ణుడు; ఎట్టి = ఎటువంటి; నేర్పునన్ = నేర్పుచేత; సర్పంబు = ఆ పాము యొక్క; దర్పంబున్ = మదమును; మాపి = పోగొట్టి; వెడలించెన్ = వెడలగొట్టెను; అందున్ = ఆ నది యందు; పెద్దకాలంబు = చాలా కాలము నుండి; వ్యాళంబు = పాము; ఏల = ఎందుచేత; ఉండెన్ = ఉన్నది; ఎఱిగింపుము = తెలియ చెప్పుము.
१०.१-६३३-व.
अनिन “नय्यगाधजलंबुल वलन माधवुं डेट्टि नेर्पुन सर्पंबु दर्पंबु मापि वेडलिंचे, नंदुँ बेद्दकालंबा व्याळं बेल युंडे? नेर्रिगिंपुमु.
          అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “ఆ అతి లోతైన మడుగులోని నాగరాజు కాళియుడి గర్వం లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు ఎలా అణచాడో. ఎలా వెళ్ళ గొట్టాడో? ఆ నేర్పు ఎలాంటిదో? అసలు అన్నాళ్ళు ఆ కాళిందిలో ఆ సర్పరాజు ఎందుకున్నాడో. నాకు చెప్పు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, August 28, 2015

కాళియ మర్దన - కాళియఫణి


10.1-632-క.
కాళియఫణిదూషిత యగు
కాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై
కాళిందీజలవర్ణుఁడు
కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా!
          కాళియ = కాళియుడు అనెడి; ఫణి = సర్పముచేత; దూషిత = కలుషితము చేయబడినది; అగు = ఐన; కాళిందిన్ = యమునానదిని; పవిత్రంబు = పరిశుద్ధమైనదిగా; చేయన్ = చేయుటకొరకు; ఉత్సుకుడు = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి; కాళిందీజల వర్ణుండు = కృష్ణుడు {కాళిందీజలవర్ణుడు - కాళిందీ (యమునా నది) యొక్క జల (నీటి) వలె నల్లని వర్ణుడు (రంగు దేహము కలవాడు), కృష్ణుడు}; కాళియున్ = కాళింగుని; వెడలంగనడిచెన్ = వెడలగొట్టెను; కౌరవముఖ్య = పరీక్షిన్మహారాజా {కౌరవముఖ్యుడు - కురువంశపు రాజులలో ముఖ్యమైన వాడు, పరీక్షిత్తు}.
१०.१-६३२-क.
काळियफणिदूषित यगु
काळिंदिँ बवित्रँ जेयँगा नुत्सुकुँडै
काळिंदीजलवर्णुँडु
काळियु वेडलंग नडिचेँ गौरवमुख्या!
            కురువంశంలో ముఖ్యమైన మహారాజా! పరీక్షిత్తూ! కాళియుడు అనే నాగుడి వల్ల పాడైన కాళింది మడుగును బాగు చేయాలని శ్రీకృష్ణుడు సంకల్పించుకొన్నాడు. కాళిందినదీ జలాల వలె నీల వర్ణ దేహుడైన కృష్ణుడు కాళియ సర్పాన్ని వెళ్ళగొట్టాడు.”
            {గంగానది నీళ్ళు తెల్లగా ఉంటాయి. యమునానది నీళ్ళు నల్లగా ఉంటాయి. ప్రయాగ త్రివేణీసంగమం వద్ద ఆ తేడా బాగా తెలుస్తుంది.}
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, August 27, 2015

కాళియ మర్దన - ఒకనాడు

10.1-631-సీ.
కనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ; గోపాలకులు దానుఁ గూడి కృష్ణుఁ;
డవికిఁ జని యెండ నా గోవులును గోప; కులు నీరుపట్టునఁ గుంది డస్సి
కాళిందిలో విషలిత తోయముఁ ద్రావిప్రాణానిలంబులు పాసి పడిన
యోగీశ్వరేశుండు యోగివంద్యుఁడు గృష్ణుఁ; డీక్షణామృతధార లెలమిఁ గురిసి
10.1-631.1-ఆ.
శుల గోపకులను బ్రతికించె మరలంగవారుఁ దమకుఁ గృష్ణులన మరలఁ 
బ్రతుకు గలిగెనంచు భావించి సంతుష్ట; మానసములఁ జనిరి మానవేంద్ర!
           ఒక = ఒకానొక; నాడు = దినమున; బలభద్రుడు = బలరాముడు; ఒక్కడు = మాత్రము; రాకుండన్ = రాకుండగా; గోపాలకులున్ = యాదవులు; తానున్ = అతను; కూడి = కలిసి; కృష్ణుడు = కృష్ణుడు; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; ఎండన్ = ఎండలో; ఆ = ఆ; గోవులును = పశువులు; గోపకులున్ = యాదవులు; నీరుపట్టునన్ = దాహముతో; కుంది = కుంగిపోయి; డస్సి = బడలిక చెంది; కాళింది = యమున; లోన్ = అందు; విష = విషముతో; కలిత = కూడిన; తోయమున్ = నీటిని; త్రావి = తాగి; ప్రాణానిలంబులున్ = ప్రాణవాయువులు; పాసి = పోయి; పడినన్ = పడిపోగా; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులకు; ఈశుండు = ప్రభువు; యోగి = యోగులచే; వంద్యుడు = స్తుతింపబడువాడు; కృష్ణుడు = కృష్ణుడు; ఈక్షణ = చూపులు అనెడి; అమృత = అమృతపు; ధారలు = జల్లులు; ఎలమిన్ = ప్రేమతో; కురిసి = కురిపించి;
          పశులన్ = పశువులను; గోపకులనున్ = గొల్లవాండ్రను; బ్రతికించె = జీవింపజేసెను; మరలంగ = తిరిగి; వారున్ = వారుకూడ; తమ = వారల; కున్ = కు; కృష్ణు = కృష్ణుని; వలన = వలన; మరలన్ = మళ్ళీ; బ్రతుకు = జీవితము; కలిగెన్ = కలిగినది; అంచున్ = అని; భావించి = తలచుకొని; సంతుష్ట = సంతోషించిన; మానసములన్ = మనసులతో; చనిరి = వెళ్ళిరి; మానవేంద్రా = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.
१०.१-६३१-सी.
ओकनाडु बलभद्रुँ डोक्कँडु राकुंड; गोपालकुलु दानुँ गूडि कृष्णुँ;
डडविकिँ जनि येंड ना गोवुलुनु गोप; कुलु नीरुपट्टुनँ गुंदि डस्सि
काळिंदिलो विषकलित तोयमुँ द्रावि; प्राणानिलंबुलु पासि पडिन
योगीश्वरेशुंडु यगिवंद्युँडु गृष्णुँ; डीक्षणामृतधार लेलमिँ गुरिसि
१०.१-६३१.१-आ.
पशुल गोपकुलनु ब्रतिकिंचे मरलंग; वारुँ दमकुँ गृष्णुवलन मरलँ
ब्रतुकु गलिगेनंचु भाविंचि संतुष्ट; मानसमुलँ जनिरि मानवेंद्र!
          శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగేడుఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు కృష్ణుడు గోపాలకులు తాను కలిసి ఆవులను తోలుకొని అడవికి వెళ్ళాడు. ఆ రోజున మాత్రం బలరాముడు వారితో వెళ్ళలేదు. ఆ వేళ ఎండ తీవ్రతకి గోవులు, గోపాలకులు దాహంతో తపించిపోతు సొమ్మసిల్లి పోసాగారు. వారు కాళింది అనే యమునా నది మడుగులోని విషపూరితమైన నీళ్ళు తాగి ప్రాణవాయువులు కోల్పోయి పడిపోయారు. మహా యోగులకు ప్రభువు, యోగు లందరికి వందనీయుడు అయిన శ్రీకృష్ణుడు తన చూపులనే గొప్ప అమృతం వర్షించి ఆ గోవులను, గోపాలకులను మళ్ళీ బతికించాడు. వారంతా కృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, August 26, 2015

కాళియ మర్దన 1

   రేపటి నుండి తొఱ్ఱుల గాచిన నందుని కుఱ్ఖని చరితంలో కాళియమర్దన ఘట్టం చదువుకుందాం అనిపించింది. ఈ ఘట్టం అయ్యాక వెనక్కి వెళ్ళి ప్రహ్లాద చరిత్ర చదువుకుందాం. ఈ కాళియమర్దన ఘట్టానికి ఆరంభంగా ఒక ప్రార్ధనా పద్యం చదువుకుందాం మిత్రులారా.
9-734-క.
కసుతాహృచ్చోరా! 
కవచోలబ్దవిపిన శైలవిహారా! 
కామితమందారా! 
కాది మహీశ్వరాతియసంచారా!
            జనక సుతా హృచ్చోరా = శ్రీరామా {జనక సుతా హృచ్చోరుడు – జనకుని పుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు}; జనకవచోలబ్ద విపిన శైల విహారా = శ్రీరామా {జనక వచో లబ్ద విపిన శైల విహారుడు - తండ్రి మాట జవదాటక కొండ కోనలలో తిరిగినవాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందారుడు - ప్రజల కోరికలు తీర్చుటలో కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జనకాది మహీశ్వ రాతిశయ సంచారా = శ్రీరామా {జనకాది మహీశ్వ రాతిశయ సంచారుడు - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు} .
९-७३४-क.
जनकसुताहृच्चोरा!
जनकवचोलब्दविपिन शैलविहारा!
जनकामितमंदारा!
जनकादि महीश्वरातिशयसंचारा!
            జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనకమహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడికగల మహారాజువి. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకు వందనములు
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, August 25, 2015

బ్రహ్మవరములిచ్చుట - ఇట్లుసకలదిక్కులు

7-105-వచనము
ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైకనాయకుండై తన యిచ్ఛాప్రకారంబున నింద్రియసుఖంబు లనుభవించుచుఁ దనియక శాస్త్రమార్గంబు నతిక్రమించి విరించి వరజనిత దుర్వారగర్వాతిరేకంబున సుపర్వారాతి యైశ్వర్యవంతుండై పెద్దకాలంబు రాజ్యంబు జేయునెడ.
            ఈ విధంగా దిక్కులన్నీ జయించి, లోకాలు అన్నింటి పై ఏకఛత్రాధిపత్యం సాధించాడు.  తన ఇష్టానుసారం ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాడు. అయినా తృప్తి చెందటం లేదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో మితిమీరిన గర్వంతో విర్రవీగుతూ శాస్త్రం చెప్పిన మార్గం అతిక్రమించి మరీ మెలగుతున్నాడు. ఈ విధంగా సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ, హిరణ్యకశిపుడు పెద్ద కాలంగా రాజ్యం చేయసాగాడు. అప్పుడు.
-१०५-वचनमु
इट्लु सकल दिक्कुलु निर्जिंचि लोकैकनायकुंडै तन यिच्छाप्रकारंबुन निंद्रियसुखंबु लनुभविंचुचुँ दनियक शास्त्रमार्गंबु नतिक्रमिंचि विरिंचि वरजनित दुर्वारगर्वातिरेकंबुन सुपर्वाराति यैश्वर्यवंतुंडै पेद्दकालंबु राज्यंबु जेयुनेड.
             ఇట్లు = ఈ విధముగ; సకల = అన్ని; దిక్కులు = దిక్కులు; నిర్జించి = జయించి; లోక = అఖిలలోకములకు; ఏక = ఒకడే; నాయకుండు = నాయకుడు; = అయ్యి; తన = తన యొక్క; ఇచ్ఛా = ఇష్టము; ప్రకారంబునన్ = వచ్చినట్లు; ఇంద్రియసుఖంబుల్ = ఇంద్రియసుఖములను; అనుభవించుచు = అనుభవించుచు; తనియక = తృప్తిచెందక; శాస్త్ర = శాస్త్రము; మార్గంబు = నిర్దేశించినవిధమును; అతిక్రమించి = దాటి; విరించి = బ్రహ్మదేవుడిచ్చిన; వర = వరములవలన; జనిత = కలిగిన; దుర్వార = దాటశక్యముగాని; గర్వ = గర్వము; అతిశయంబునన్ = పెరుగుటవలన; సుపర్యారాతి = హిరణ్యకశిపుడు {సుపర్యారాతి - సపర్వులు (దేవతలు)కు ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఐశ్వర్యవంతుండు = ఐశ్వర్యములుగలవాడు; = అయ్యి; పెద్ద = ఎక్కువ; కాలంబు = కాలము; రాజ్యంబున్ = రాజ్యము; చేయున్ = చేసెడి; ఎడన్ = సమయమునందు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :