Wednesday, July 6, 2016

క్షీరసాగరమథనం – నీ యంద

8-223-క.
నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!
టీకా:
            నీ = నీ; అంద = లోనే; సంభవించును = కలుగును; నీ = నీ; అంద = లోనే; వసించి = నివసించి; ఉండున్ = ఉండును; నిఖిల = సమస్తమైన; జగములున్ = లోకములును; నీ = నీ; అంద = లొనే; లయమున్ = కలిసిపోవుట; పొందును = పొందుతాయి; నీ = నీ యొక్క; ఉదరము = కడుపు; సర్వ = అఖిల; భూత = జీవజాలములకు; నిలయము = నివాసము; రుద్రా = పరమశివా.
భావము:
            రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: