8-253-ఆ.
అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
హవులు పెట్టుకొఱకు నవనినాథ!
8-254-వ.
మఱియు నా
జలరాశి యందు.
టీకా:
అగ్నిహోత్రి =
అగ్నిహోత్రములకు తగినది;
అనుచున్ = అనుచు;
ఆ = ఆ; సురభిన్ = కామదేనువును;
దేవమునులు = దేవర్షులు;
పుచ్చికొనిరి = తీసుకొనిరి;
మున్న = ముందుగనే;
ఎఱింగి =
తెలిసియుండుటచేత;
విబుధ = దేవతా;
సంఘముల్ = సమూహముల;
కున్ = కు; వెరవు =
తగినవిధము; తోన్ = ప్రకారముగ;
అధ్వర = యాగ;
హవులున్ = హవిస్సులను;
పెట్టు =
సమర్పించుట;
కొఱకున్ = కోసము;
అవనినాథ = రాజ.
మఱియున్ = ఇంకను;
ఆ = ఆ; జలరాశి = సముద్రము;
అందున్ = లో.
భావము:
కామధేనువు హోమకార్యక్రమాలకు తగినది అని దేవమునులు ముందుగానే
గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే
కామధేనువును తీసుకున్నారు
అలా చిలుకుంతుంటే క్షీరసాగరమునుండి. . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment