Monday, March 31, 2014

Happy New Year      Our Telugu Language people`s New Year Day this time happened to be today 2014-03-31 AD, in line with some other Lunar Calendar followers of Hindu and other cultures. We call this Ugaadi representing the auspicious starting day of yuga a very large period of time of one cycle commencing to end of world`s this creation, as per hindu mathematicians and astrologers.
           On this auspicious occasion let me convey “Happy New Year best wishes to each and every one”.
-                               telugubhagavatam

తెలుగు భాగవత తేనె సోనలు – 244

జయ ఉగాది జయ శుభాకాంక్షలు

ఎవ్వనిచేజనించు

8-73-ఉ

వ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
          ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
గజేంద్రమోక్ష ఘట్టమే ఏకేశ్వరోపాసనా తత్వపూరితం. అందులో మొసలి బారినపడి ప్రాణభయ విహ్వలుడై గజేంద్రుడు పెడుతున్న ఈ మొర ఏకేశ్వరోపాసన తత్వం మయం. దేవుడనే పదానికి ఒక చక్కటి నిర్వచనం. అంతేనా అంతటి తత్వాన్ని రమ్యమైన, రసరమ్యమైన పద్యంలో ఎంత తేలికగా అందించాడు పోతనామాత్యులు అంటే. వేరే తాత్పర్యం చూసి అర్థం చేసుకోవలసిన అవసరమే లేని తెలుగు ఆణిముత్యంగా. ఇప్పటి చిన్నపిల్లలచే ట్వింకిల్ . . అని రైములు చెప్పిస్తున్నారో, అలానే మొన్నటి దాకా ఈ పద్యాన్ని చెప్పించుకొనే వారు తెలుగువా రందరు.
8-73-u.
evvanichae janiMchu jaga; mevvani lOpala nuMDu leenamai;
yevvani yaMdu DiMdu@M; baramaeSvaru@M Devva@MDu; moolakaaraNaM
bevva@M; Danaadi madhya layu@M Devva@MDu; sarvamu@M daana yainavaa@M
Devva@MDu; vaani naatmabhavu neeSvaru nae SaraNaMbu vaeDedan.
ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = లోపల; ఉండున్ = ఉండునో; లీనము = కలిసిపోయినది; = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము పొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైనప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణభూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాదిమధ్యలయుడు = ఆదిమధ్యాంతములులేనివాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నాయొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, March 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 243

ఇమ్మనుజేశ్వరాధముల

1-13-ఉ.
మ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే
మ్మెట వ్రేటులం బడక మ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
మ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
          విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి నా మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. ఈ బమ్మర పోతరాజుకి, అలా చేస్తే ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలతో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిగెబ్బలు తప్పవని తెలుసు. అందుకే చక్కగా ఆలోచించుకొని మనస్పూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించను.
1-13-u.
immanujaeSvaraadhamula kichchi puraMbulu vaahanaMbulun
sommulu@M gonni puchchukoni chokki Sareeramu vaasi kaaluchae
sammeTa vraeTulaM baDaka sammatitO hari kichchi cheppe nee
bammera pOtaraajoka@MDu bhaagavataMbu jagaddhitaMbugan.
          = ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; = ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = ప్రియము సమకూర్చునట్టిది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, March 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 242

నిగమములు

1-141-క.
నిమములు వేయుఁ జదివిన
సుమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుమంబు భాగవత మను
నిమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!
          బుధశ్రేష్ఠుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే అతి సులువుగా దొరుకుతుంది మోక్షం.
అని సూతమహర్షి శౌనకమునీశ్వరునకు తెలియజెప్పాడు.
1-141-ka.
nigamamulu vaeyu@M jadivina
sugamaMbulu gaavu mukti subhagatvaMbul
sugamaMbu bhaagavata manu
nigamaMbu@M baThiMpa mukti nivasanamu budhaa!
          నిగమములు = వేదములు; వేయున్ = వేలకొలది; చదివినన్ = పఠించిన; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యము కలవి; సుగమంబు = సులభముగ అర్థమగునదైన; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివిన; ముక్తి = ముక్తి; నివసనము = నివాసమగును; బుధా = బుద్ధిమంతుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~