Monday, July 4, 2016

క్షీరసాగరమథనం – వారలు దీనత

8-220-క.
వాలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యాతుఁడై చంద్రచూడుఁ వసర మిచ్చెన్.
8-221-వ.
అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.
టీకా:
            వారలు = వారు; దీనతన్ = ఆర్తితో; వచ్చుటన్ = వచ్చుటను; కూరిమి = ప్రేమ; తోన్ = తోటి; ఎఱిగి = తెలిసికొని; దక్షుకూతురున్ = సతీదేవి {దక్షుకూతురు - దక్షుని కూతురు, సతి}; తానున్ = తను; పేరోలగమున = నిండుసభతీరి; ఉండి = ఉండి; దయా = కనికరించుట యందు; రతుడు = ప్రీతిగలవాడు; ఐ = అయ్యి; చంద్రచూడుడు = పరమశివుడు {చంద్రచూడుడు - చంద్రకళ చూడామణిగా కలవాడు, శివుడు}; అవసరమిచ్చెన్ = దర్శనమిచ్చెను.
            అప్పుడు = అప్పుడు; భోగిభూషణున్ = పరమశివుని {భోగిభూషణుడు - భోగి (పాము)లను భూషణుడు (అలంకారముగాగలవాడు), శివుడు}; కున్ = కి; సాష్టాంగదండప్రణామంబులు = సాగిలపడినమస్కారములు; కావించి = చేసి; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; ముఖ్యుల్ = మున్నగువారు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతించిరి = స్తోత్రముచేసిరి.
భావము:
            అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్ర రేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు.
            అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: