Wednesday, April 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 274

తొఱ్ఱులగాచిన 

10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె;
వెఱ్ఱుల కైనను దలంప? విప్రవరేణ్యా!
          ఓ శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంకచాలు అనుకోగలడా, ఊహు అనుకోలేడు.
కాళియమర్థన ఘట్టం ఆరంభిస్తున్న అవధూతోత్తముడు శుకునితో పరమ భాగవతుడు పరీక్షిత్తు పలికిన పలుకు లివి.
10.1-634-ka.
toRRula@M gaachina naMduni
kuRRani charitaamRtaMbu gonakoni chevulan
juRRaMga@M danivi galgune;
veRRula kainanu dalaMpa? vipravaraeNyaa!
          తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన = మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని = కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్ = అమృతమును; కొనకొని = పూని; చెవులన్ = చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో ఎంత ఆస్వాదించినా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచిచూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, April 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 273

మేఘంబుమీది

1-286-సీ.

మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని
 పై నున్న పచ్చని టమువాఁడు;
గండభాగంబులఁ గాంచన మణి మయ
 కరకుండలకాంతి లయువాఁడు;
రవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి
 న్నుల నునుఁ గెంపు లుగువాఁడు;
బాలార్కమండల ప్రతిమాన రత్న హా
 క విరాజిత కిరీటంబువాఁడు;
తే.
కంకణాంగద వనమాలికా విరాజ
మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.
          మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మకరకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్ఠమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు అవిర్భవించాడు.
అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి కనలుతున్నాడు. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుష్ఠ మాత్రుడై గదాధారియై ఇలా ఆవిర్భవించి గర్భస్త బాలకుడిని కాపాడేడు.
1-286-see.
maeghaMbumee@Mdi krommeRu@MgukaivaDi maeni
 pai nunna pachchani paTamuvaa@MDu;
gaMDabhaagaMbula@M gaaMchana maNi maya
 makarakuMDalakaaMti malayuvaa@MDu;
Saravahni naDa@MgiMchu saMraMbhamuna@M jaesi
 kannula nunu@M geMpu kaluguvaa@MDu;
baalaarkamaMDala pratimaana ratna haa
 Taka viraajita kireeTaMbuvaa@MDu;
tae.
kaMkaNaaMgada vanamaalikaa viraaja
maanu@M Dasamaanu@M DaMgushTamaatradaehu@M
Dokka gada@M jaeta@M daalchi naetrOtsavamuga
vishNu@M DaavirbhaviMche na vvaeLa yaMdu.
మేఘంబు = మేఘము; మీఁది = మీద ఉన్న; క్రొమ్మెఱుఁగు = క్రొత్త మెరుపుతీగ; కైవడిన్ = వలె; మేని = శరీరము; పైన్ = మీద; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చనిరంగు కల; పటమువాఁడు = వస్త్రము కలవాడు; గండభాగంబులన్ = చెక్కిళ్ళ యందు; కాంచన = బంగారపు; మణి = రత్నములు; మయ = తాపింపబడిన; మకరకుండల = మకరకుండలములయొక్క; కాంతి = వెలుగు; మలయువాఁడు = పరచబడినవాడు; శర = బాణముల యొక్క; వహ్నిన్ = అగ్నిని; అడఁగించు = అణచివేయు; సంరంభమునన్ = ఆత్రుత / వేగిరిపాటు; చేసి = వలన; కన్నులన్ = కళ్ళలో; నును = చిక్కటి; కెంపు = ఎరుపురంగు; కలుగువాఁడు = కలవాడు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; మండల = చక్రమును; ప్రతిమాన = పోలిన; రత్న = రత్నములతోను; హాటక = బంగారముతోను; విరాజిత = వెలుగొందుచున్న; కిరీటంబు = కిరీటము; వాఁడు = కలవాడు; కంకణ = కంకణములు / మురుగులు; అంగద = భుజకీర్తులు; వనమాలికా = ఆకులు పువ్వులుతో కట్టిన మాలలతో; విరాజమానుడు = ప్రకాశించువాడు; అసమానుడు = సాటిలేనివాడు; అంగుష్ట = వేలెడు; మాత్ర = అంతమాత్రమే; దేహుడు = దేహము కలవాడు; ఒక్క = ఒక; గదన్ = గదను; చేతన్ = చేతిలో; దాల్చి = ధరించి; నేత్ర = నేత్రములకు; ఉత్సవముగన్ = పండుగ అగునట్లు; విష్ణుడు = హరి; ఆవిర్భవించెన్ = ప్రభవించెను / పుట్టెను; = ; వేళ = సమయ; అందున్ = లో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, April 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 272

చుంచొదువు

10.1-419-క.

చుంచొదవుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదవ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
          ఓ రాజా పరీక్షిత్తు! చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం   దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు జుట్టు పెరగలేదేం టమ్మా యని అడిగాడు లీలలు చూపు టందు ఆసక్తి గల ఆ బాలకృష్ణమూర్తి.
10.1-419-ka.
chuMchodavu@M baalu draavu mu
daMchitamuga nanu@MDu@M baalu draavi jananitO@M
juM chodava danuchu leelaa
chuMchuM Dai yata@MDu chuMchu@M joope naraeMdraa!
          చుంచు = పిలక, బలము (ఇక్కడ చుంచు అంటె బలము అని తోచుచున్నది అంటున్నది శబ్దరత్నాకరం); ఒదవున్ = బాగగును, కలుగును; పాలున్ = పాలను; త్రావుము = తాగుము; ఉదంచితముగన్ = చక్కగా; అనుడున్ = అని చెప్పగా; పాలున్ = పాలను; త్రావి = తాగి; జనని = తల్లి; తోన్ = తోటి; చుంచు = జుట్టు; ఒదవదు = పెరగలేదు; అనుచు = అంటూ; లీలాచుంచుండు = లీలలందు ఆసక్తి కలవాడు; = అయ్యి; అతడు = అతను; చుంచున్ = పిలకను; చూపెన్ = చూపించెను; నరేంద్రా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~