అష్టమ
స్కంధము : సురభి ఆవిర్భావము
8-251-వ.
8-252-క.
తెల్లని మేనును నమృతము
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లుగ నర్థుల కోర్కులు
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.
టీకా:
మఱియున్ = ఇంకను;
ఆ = ఆ; రత్నాకరంబు = సముద్రమును;
సుర = దేవతలు;
అసురులున్ = రాక్షసులు;
త్రచ్చు =
చిలికెడి; ఎడన్ = సమయమునందు.
తెల్లని = తెల్లటి
రంగుగల; మేనునున్ = దేహము;
అమృతమున్ = పాలను;
జిల్లునన్ = జిల్లుమని;
జల్లించు =
ధారలుగానిచ్చెడి;
పొదుగున్ = పొదుగు;
శిత = చక్కటి,
వాడియైన; శృంగములున్ =
కొమ్ములు; పెల్లుగన్ = పుష్కలముగ;
అర్థుల = కోరెడివారి;
కోర్కులున్ = కోరికలను;
వెల్లిగొలుపు = కురిపించెడి;
మొదవు = పాడియావు;
పాలవెల్లిన్ = పాలసముద్రమునందు;
పుట్టెన్ = జనించెను.
భావము:
హాలాహలభక్షణం పిమ్మట మరల, దేవతలూ రాక్షసులూ సముద్రాన్ని చిలక సాగారు.
ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుండి కామధేనువు పుట్టింది. అది
తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగూ, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment