Thursday, February 9, 2017

కాళియమర్దనము – అదె మన కృష్ణునిం

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:

10.1-647-చ.
దె మన కృష్ణునిం గఱచియంతటఁ బోక భుజంగమంబు దు
ర్మమున మేనఁ జుట్టుకొని మానక యున్నది; యింక నేమి చే
యుమెటఁజొత్త? మే పురుషు లోపుదు రీ యహి నడ్డపెట్ట నె
య్యది సదుపాయ? మంచుఁ బడి రార్తరవంబులఁ దూలి గోపకుల్.

టీకా:
అదె = అదిగో; మన = మన యొక్క; కృష్ణునిన్ = కృష్ణుని; కఱచి = కరిచి; అంతటన్ = దానితో; పోక = విడువక; భుజంగమంబు = పాము; దుర్మదమునన్ = మహచెడ్డగర్వముతో; మేనన్ = శరీరమును; చుట్టుకొని = పెనవేసుకొని; మానక = విడువక; ఉన్నది = ఉన్నది; ఇంకన్ = ఇక; ఏమి = ఏమిటి; చేయుదము = చేసెదము; ఎటన్ = ఎక్కడ; చొత్తుము = శరణుజొత్తుము; ఏ = ఏ; పురుషులు = ధీరులు; ఓపుదురు = సమర్థులు; అహిన్ = ఈ పామును; అడ్డపెట్టన్ = అడ్డగించుటకు; ఎయ్యది = ఏది; సత్ = మంచి; ఉపాయము = ఉపాయము; అంచున్ = అనుచు; పడిరి = ఆరంభించిరి; ఆర్తారావంబులున్ = ఏడ్చుటలకు; తూలి = చలించిపోయి; గోపకుల్ = గొల్లలు.

భావము:
ఆ గోపకులు “అదిగో ఆపాము కృష్ణుడిని కాటువేసేసింది; దాంతో వదలిపెట్టకుండ చెడ్డమదంతో శరీరమంతా చుట్టేసింది; వదలిపెట్టటం లేదు; అయ్యో! ఇంకేమి చేయాలి? ఎక్కడికి పరుగులు తీయాలి? ఈ పామును అడ్డుకోనే సామర్థ్యం గల మగధీరులు ఎవరున్నారు? ఈ ఆపద దాటే ఉపాయమే లేదా?” అంటు ఆర్తానాదాలు చేస్తు సోలిపోయారు;


No comments: