Friday, February 10, 2017

కాళియమర్దనము – గోపకుమారకశేఖరు

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-648-క.
గోకుమారకశేఖరు
నేపున సర్పంబు గఱచు టీక్షించి వగన్
మేపులకుఁ దొలఁగి గోవులు
వాపోవుచు నుండె వృషభ త్సంబులతోన్.
10.1-649-క.
భూలము వడఁకె నుల్కా
పాతంబులు మింటఁ గానడె ఘోషములో
వ్రేలకును గోపక సం
ఘాములకు నదరె గీడున్ను లిలేశా!

టీకా:
గోప = గొల్ల; కుమార = పిల్లలలో; శేఖరున్ = శ్రేష్ఠుని; ఏపునన్ = గర్వముతో; సర్పంబున్ = పాము; కఱచుటన్ = కరిచివేయుటను; ఈక్షించి = చూసి; వగన్ = విచారముతో; మేపుల్ = గడ్డిమేయుటల; కున్ = కు; తొలగి = మాని; గోవులు = ఆవులు; వాపోవుచున్ = ఏడ్చుచును; ఉండెన్ = ఉండెను; వృషభ = ఎద్దులు; వత్సంబుల = దూడల; తోన్ = తోటి.
భూతలము = భూమండలము; వడకెన్ = వణికిపోయినది, కంపించె; ఉల్కా = ఉల్కలు; పాతంబులున్ = పడుటలు; మింటన్ = ఆకాశమునందు; కానబడెన్ = అగపడెను; ఘోషము = మంద; లోన్ = అందు; వ్రేతల = గోపికుల; కును = కు; గోపక = గోపకుల; సంఘాతముల = సమూహముల; కున్ = కి; అదరెన్ = అదిరినవి; కీడు = చెడుసూచించు {కీడుకన్ను - మగవారికి ఎడమకన్ను స్త్రీలకు కుడికన్ను}; కన్నులు = కళ్ళు; ఇలేశా = రాజా {ఇలేశుడు - ఇల (భూమి)కి ఈశుడు, రాజు}.

భావము:
అక్కడి ఆవులు, దూడలు, ఎద్దులు గోపబాలకులలో శ్రేష్ఠుడైన ఆ కృష్ణుని నాగరాజు బలంగా కాటువేయటం చూసాయి; అవి అన్నీ విచారంతో మేతమేయడం మానేసి దుఃఖిస్తున్నాయి;
మహారాజా! ఆ సమయంలో, భూమి కంపించింది. ఆకాశంలో ఉల్కలు కనబడ్డాయి. గోకులంలోని గొల్లలకు ఎడం కన్ను, గోపికలకు కుడికన్ను అశుభ సూచకంగా అదిరాయి.

No comments: