:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-670-క.
ఈతఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!
10.1-671-వ.
ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి
నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతింజూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున
నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల.
టీకా:
ఈతడు = ఇతను; సర్వ = సమస్తమైన; చర =
కదలగల; అచర = కదలలేని; భూత =
జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన =
అగు; పరమ = అత్యుత్తమ; యోగి =
యోగియైన; పురుషుడు = వాడు; సేవా =
భక్తులయందు; ప్రీతుడు = ప్రీతిగలవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును
తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు}; అగును = అగును; అని =
అని; భీతిన్ = భయముతో; శరణంబు
= శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు
= మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా =
రాజా.
ఇట్లు = ఈ విధముగా; క్రూరంబులు = కఠినమైనవి; అయిన = ఐన; హరి =
కృష్ణుని; చరణ = పాదముల; ప్రహరంబులన్
= తాకిడిచే; పడగలు = పడగలు; ఎడసి =
భగ్నమై; నొచ్చి = నొప్పిని పొందినవాడై; చచ్చిన = చనిపోయినవాని; క్రియన్ = వలె; పడియున్న
= పడి ఉన్నట్టి; పతిన్ = భర్తను; చూచి =
చూసి; నాగకాంతలు = ఆ కాళియుని భార్యలు; దురంతంబు = అంతులేనిది; అయిన = ఐనట్టి; చింత =
విచారము యొక్క; భరంబునన్ = అతిశయముచేత; నెఱ = మిక్కిలి; వగలన్
= దుఃఖముతో; ఒల్లంబోయి = తపించి; పల్లటిల్లిన = కలతపడిన; ఉల్లంబుల = మనసులతో.
భావము:
విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు
ప్రభువు, పరమ పురుషుడు, పరమయోగి, భక్తితోసేవిస్తే సంతోషించేవాడు. ఇంతటి ఈ పిల్లాడు
ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. రాజా! మిక్కలి భయంతో, అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.
ఈ విధంగా తాండవకృష్ణుడి దారుణమైన
పాదాలతాకిడికి పడగలన్ని చితికిపోయి, చచ్చిపోయినవాడిలా
పడి ఉన్న తమ భర్త కాళియుని చూసి, అతని భార్యలు ఎంతో
శోకించారు. భరించలేని ఆ శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డాయి.
No comments:
Post a Comment