:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-645-క.
కఱచి
పిఱుతివక మఱియును
వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెఱయఁ దన నిడుద యొడలిని
నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్.
వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెఱయఁ దన నిడుద యొడలిని
నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్.
10.1-646-వ.
ఇట్లు
భోగిభోగ పరివేష్టితుండై, చేష్టలు లేనివాని తెఱంగునఁ గానంబడుచున్న ప్రాణసఖునిం
గనుంగొని తత్ప్రభావంబు లెఱుంగక, తత్సమర్పిత ధన దార మనోరథ మానసులు గావున.
టీకా:
కఱచి = కరిచి; పిఱుతివక = ఆగక; మఱియును
= పిమ్మట; వెఱవక్ = బెదరక; నిజ =
తన యొక్క; వదన = ముఖములనుండి; జనిత =
పుట్టిన; విష = విషము అనెడి; దహన =
అగ్ని; శిఖల్ = మంటలు; మెఱయన్
= ప్రకాశించుచుండగ; తన = తన యొక్క; నిడుద
= పొడుగైన; ఒడలిని = శరీరముతో; నెఱిన్
= పూర్తిగా; హరిన్ = కృష్ణుని; పెనగొనియెన్
= పెనవేసుకొనెను; భుజగ = పాముల; నివహ =
సమూహములకు; పతి = రాజు; వడిన్
= వేగముగా.
ఇట్లు = ఇలా; భోగి = పాము; భోగ =
శరీరముచేత; పరివేష్టింతుండు = చుట్టబడినవాడు; ఐ
= అయ్యి; చేష్టలు = అంగచలనములు; లేని =
పోయినట్టి; వాని = వాడి; తెఱంగునన్
= విధముగా; కానంబడుచున్న = అగపడుతున్న; ప్రాణసఖునిన్
= ప్రాణస్నేహితుని; కనుంగొని = చూసి; తత్ =
అతని; ప్రభావంబులు = మహిమత్వములు; ఎఱుంగక
= తెలియక; తత్ = అతని యందే; సమర్పిత
= అర్పింపబడినట్టి; ధన = సంపదలు; దార=భార్య;
మనోరథ = కోరికలు కల; మానసులు = మనసుకలవారు; కావునన్
= కనుక.
భావము:
కాటేసిన కాళియ నాగరాజు అంతటితో ఊరుకోలేదు. నదురు బెదురు లేకుండ తన
పొడవైన శరీరంతో కృష్ణుడిని అతి వేగంగా పెనవేసుకొని గట్టిగా బంధించాడు. పైకి
ఎత్తిపెట్టిన తన పడగల నోళ్ళనుండి విషాగ్నిజ్వాలలు మెరిపిస్తున్నాడు.
ఇలా ఆ నాగేంద్రుడి పొడవాటి శరీరంచేత చుట్టివేయబడి నిశ్చేష్టు డైనట్లు
కృష్ణుడు కనబడుతున్నాడు. అలా పడి ఉన్న తమ ప్రాణస్నేహితుడిని చూసి గోపబాలకులు
భయపడ్డారు. వారికి అతని ప్రభావాలు తెలియవు. కాని వారు తమ సంపదలు సంసారాలు కోరికలు
మనస్సులు సమర్పించిన వారు కనుక.
No comments:
Post a Comment