:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-658-ఉ.
చూడ వదేమి గౌరవపుఁజూపుల మమ్ము; సఖాలితోడ మా
టాడ వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే
డాడ వదేమి నర్తనము? లవ్వల మ్రోలను గోపికావళిం
గూడ వదేమి నవ్వులను? గోపకుమారవరేణ్య! చెప్పుమా;
టాడ వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే
డాడ వదేమి నర్తనము? లవ్వల మ్రోలను గోపికావళిం
గూడ వదేమి నవ్వులను? గోపకుమారవరేణ్య! చెప్పుమా;
10.1-659-సీ.
శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ;
నెలమి భాషించు వా రెవ్వ రింకఁ?
గరచరణాదుల కలిమి ధన్యత నొంద;
నెరిగి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక?
నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా;
నవ్వులు చూపు వా రెవ్వ రింక?
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల;
యెడఁ బలికించు వా రెవ్వ రింక
నెలమి భాషించు వా రెవ్వ రింకఁ?
గరచరణాదుల కలిమి ధన్యత నొంద;
నెరిగి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక?
నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా;
నవ్వులు చూపు వా రెవ్వ రింక?
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల;
యెడఁ బలికించు వా రెవ్వ రింక
10.1-659.1-ఆ.
తండ్రి! నీవు సర్పదష్టుండవై యున్న
నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక?
మరిగి పాయ లేము; మాకు నీ తోడిద
లోక మీవు లేని లోక మేల?"
నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక?
మరిగి పాయ లేము; మాకు నీ తోడిద
లోక మీవు లేని లోక మేల?"
టీకా:
చూడవు = చూడవు; ఏమి = ఎందుకు; గౌరవపు
= గౌరవముతో కూడిన; చూపులన్ = చూపులతో; మమ్మున్
= మమ్ములను; సఖ = స్నేహితుల; ఆలి =
సమూహము; తోడన్ = తోటి; మాటాడవు
= మాట్లాడుటలేదు; ఏమి = ఎందుకు; మర్మముగన్
= కొంటెగా; అందెలు = కాలిగజ్జెలు; పాదముల = కాళ్ళ; అందున్
= అందు; మ్రోయన్ = మోగుతుండగ; నేడు = ఇవాళ; ఆడవు =
ఆడుటలేదు; ఏమి = ఎందులకు; నర్తనముల్
= నాట్యములు; అవ్వల = తల్లుల; మ్రోలను
= ఎదురుగా; గోపికా = గోపికా స్త్రీల; అవళిన్ = సమూహములను; కూడవు = కలియవు; అది =
అదే; ఏమి = ఎందుకు; నవ్వులను
= నవ్వులతో; గోప = గొల్ల; కుమార
= పిల్లలలో; వరేణ్య = శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
శ్రవణ = చెవి; రంధ్రంబులున్ = కన్నములు; సఫలతన్ = ధన్యము; పొందంగన్
= పొందునట్లు; ఎలమిన్ = ప్రీతితో; భాషించు
= మాట్లాడెడి; వారు = వాళ్ళు; ఎవ్వరు
= ఎవరు; ఇకన్ = ఇకపైన; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులన్
= మొదలగునవి; కలిమిన్ = కలుగుటచేత; ధన్యతన్ = కృతార్థత్వము; ఒందన్ = పొందగా; ఎగిరి
= మీదికి దూకి; పైన్ = మామీదకు; ప్రాకు
= పాకెడి; వారు = వారు; ఎవ్వరు
= ఎవరు; ఇంక = ఇకమీద; నయన =
కళ్ళ; యుగ్మంబులు = జంటలు; ఉన్నతిన్ = అతిశయముతో; కృతార్థములుగా = ధన్యమగునట్లు; నవ్వులు = నవ్వులను; చూపు = కనపరచువారు; వారు =
వారు; ఎవ్వరు = ఎవరు; ఇంక =
ఇకమీద; జిహ్వలు = నాలుకలు; గౌరవ =
మన్నల; శ్రీన్ = సంపదలను; చేరన్
= చేరునట్లుగా; పాటల = పాటల; ఎడల =
అందు; పరికించు = చూచెడివారు; వారు = వారలు; ఎవ్వరు
= ఎవరు; ఇంకన్ = ఇకపైన.
తండ్రి = నాయనా; నీవు =
నీవు; సర్ప = పాముచే; దష్టుండవు
= కాటువేయబడినవాడవు; ఐ = అయ్యి; ఉన్నన్
= ఉండగా; ఇచటన్ = ఇక్కడ; మా =
మా; కున్ = కు; ప్రభువులు
= విభులు; ఎవ్వరు = ఎవరు; ఇంకన్
= ఇకపైన; మరిగి = మాలిమిగలవారమై; పాయలేము = ఎడబాయలేము; మా = మా; కున్ =
కు; నీ = నీ; తోడిద
= తోమాత్రమే; లోకము = లోకము; ఈవు =
నీవు; లేని = లేనట్టి; లోకము
= ప్రపంచము; ఏల = ఎందుకు.
భావము:
మన గోకులంలోని బాలలందరిలోకి నీవే
శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో
చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ళ గజ్జలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా!
చిన్ని నా తండ్రీ! మా చెవులున్నందుకు
సార్థకమయ్యేలా ఉత్సాహంగా ఇంక మాతో ఎవరు మాట్లాడతారు? కాళ్ళు
చేతులు ఉన్నందుకు సార్థక మయ్యేలా మా మీదకి దూకి ఇంకెవరు ఎగబాకుతారు? మా కళ్ళు సార్థక మయ్యెలా ఇంక ఎవరు చిరునవ్వులు
చిలుకుతారు? మా నాలుకలు కృతార్థత పొందేలా ఇంక మాచేత పాటలు
ఎవరు పాడిస్తారు? నాయనా! నువ్విలా పాముకాటు పాల పడిపోతే, ఇక్కడ మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉన్నారు? నీ ప్రేమ రుచి మరిగిన వాళ్ళం. నిన్ను విడిచి
వెళ్ళి పోలేము. మాకు నీతోడిదే లోకం. నువ్వు లేని ఈ లోకం మా కెందుకు?”
No comments:
Post a Comment