Thursday, February 2, 2017

వామన వైభవం - 104:


8-644-ఆ.
నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
బదవిహీనతకును బంధనమున
కర్థ భంగమునకు నఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.
8-645-వ.
అదియునుం గాక.

టీకా:
నిరయమున్ = నరకమున; కునున్ = కు; ప్రాప్త = కలిగిన; నిగ్రహంబున్ = చెరపట్టబడుటకు; కునున్ = కు; పద = పదవి; విహీనత = పోవుట; కునున్ = కు; బంధనమున్ = బంధింపబడుట; కున్ = కు; అర్థ = సంపదల; భంగమున్ = నశించినందుల; కునున్ = కు; అఖిల = సమస్తమైన; దుఃఖమున్ = దుఃఖముల; కున్ = కు; వెఱవన్ = బెదరను; దేవ = భగవంతుడా; బొంక = అబద్దమాడుటకు; వెఱచిన్ = బెదరెడి; అట్లు = విధముగా.
అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:
భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రాడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా. అంతే కాకుండా......

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=644

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: