8-642-వ.
అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుం డయ్యును విషణ్ణుండుఁ గాక వైరోచని ప్రసన్న వదనంబుతోడఁ జిన్ని ప్రోడ వడుగున కి ట్లనియె.
8-643-ఆ.
సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; వామనుండు = వామనుడు; పలుకన్ = అనగా; సత్యభంగ = ఆడిన మాటబోటగుననెడి; సందేహ = అనుమానము యనెడి; విషత్ = విషము; తిగ్ధ = పూయబడిన; శల్య = బాణము; నికృత్త = గుచ్చుకొన్న; హృదయుండు = హృదయముకలవాడు; అయ్యును = అయినప్పటికిని; విషణ్ణుండు = దిగులుపడ్డవాడు; కాక = కాకుండ; వైరోచని = బలిచక్రవర్తి; ప్రసన్న = నిర్మలమైన; వదనంబు = ముఖము; తోడన్ = తోటి; చిన్ని = వామనుడు; ప్రోడ = బుద్ధిశాలియైన; వడుగున్ = బ్రహ్మచారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. సూనృతంబు = సత్యమైనదానిని; కాని = తప్పించి; నుడియదు = పలుకదు; నా = నా యొక్క; జిహ్వ = నాలుక; బొంకజాల = అబద్దముచెప్పలేను; నా = నా; కున్ = అందు; బొంకు = అసత్యము; లేదు = లేదు; నీ = నీ యొక్క; తృతీయ = మూడవ (3); పదమున్ = అడుగును; నిజమున్ = తథ్యముగా; నా = నా యొక్క; శిరమునన్ = తలపైన; నెలవు = వసించునట్లు; చేసి = చేసి; పెట్టు = పెట్టుము; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మ = మనసు కలవాడా.
భావము:
ఇలా పలికిన వామనుడి మాటలు వినిన బలిచక్రవర్తికి సత్యభంగం అవుతుంది ఏమో అనే సందేహం కలిగింది. అది విషబాణంలా మనసును గాయపరచింది. అయినా అతడు దిగులుచెందకుండా ప్రసన్నమైన ముఖంతో బుద్ధిశాలి అయిన వామనుడితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్దమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=643
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:
Post a Comment