:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం
మనం అందరం:
10.1-639-ఉ.
భూరి మహాప్రతాప
పరిపూర్ణ భయంకర గోపబాల కం
ఠీరవ పాత వేగ వికటీకృత దుర్విషభీషణోర్మి సం
పూరితమై వడిం గలఁగి పొంగి ధనుశ్శతమాత్ర భాగ వి
స్తారము బొందె న మ్మడుఁగు తప్తపయఃకణ బుద్బుదోగ్రమై.
ఠీరవ పాత వేగ వికటీకృత దుర్విషభీషణోర్మి సం
పూరితమై వడిం గలఁగి పొంగి ధనుశ్శతమాత్ర భాగ వి
స్తారము బొందె న మ్మడుఁగు తప్తపయఃకణ బుద్బుదోగ్రమై.
టీకా:
భూరి = అతి అదికమైన; మహా = గొప్ప; ప్రతాప
= తేజస్సుచే; పరిపూర్ణ = నిండియున్న; భయంకర
= భీకరమైన; గోప = యాదవ; బాల =
బాలుడనెడి; కంఠీరవ = సింహము {కంఠీరవము
- భీకరమైన కంఠధ్వని కలది, సింహము}; పాత = పడుట యొక్క; వేగ =
వడిచేత; వికటీకృత = తుళ్ళింపబడిన; దుర్ =
చెడ్డ; విష = విషముతోటి; భీషణ =
భయంకరమైన; ఊర్మి = అలలచేత; సంపూరితము
= పూర్తిగా నిండినది; ఐ = అయ్యి; వడిన్
= శీఘ్రముగా; కలగి = కలిగిపోయి; పొంగి
= పైకి ఉబికి; ధనుః = విల్లులు; శత =
నూటింటి యంత; మాత్ర = కొలదికల; భాగ =
ప్రదేశము; విస్తారమున్ = విస్తరించుటను; పొందెన్
= పొందినది; ఆ = ఆ యొక్క; మడుగు
= హ్రదము; తప్త = తుళ్ళిన; పయః =
నీటి; కణ = బిందువులు; బుద్బుద
= బుడగలతోను; ఉగ్రము = భయంకరమైనది; ఐ =
అయ్యి.
భావము:
మిక్కిలి గొప్ప ప్రతాపంతో నిండిన భీకరమైన సింహకిశోరం లాంటి ఆ
గొల్లపిల్లాడు గభాలున దూకాడు. ఆ విపరీత వేగానికి ఆ సరస్సు దుర్విషంతో కూడిన
భీకరమైన అలలుతో నిండి, వడితో కలచివేయబడింది. నీళ్ళు వికట నృత్యం చేస్తు
పైకి నూరు ధనుస్సుల ఎత్తు పొంగి కుత కుతలాడుతున్న నీటి బుడగలు లేచాయి.
No comments:
Post a Comment