8-647-మ.
చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
శిలలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే;
చలితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాదినిర్ముక్తుఁడై.
టీకా:
చెలియె = స్నేహితుడా ఏమి; మృత్యువు = మరణము; చుట్టమే = బంధువా ఏమిటి; యముడు = యమధర్మరాజు; సంసేవార్థులే = చక్కగాసేవించెడివారా ఏమి; కింకరులు = యమకింకరులు; శిలలంజేసెనె = బండరాళ్లతోచేసెనా ఏమి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తన్ను = తనను; దృఢమే = నాశము లేనిదా ఏమి; జీవనంబున్ = బ్రతుకు; ఓ = ఓహో; చెల్లరే = అయ్యో; చలితంబు = చలించిపోవునది; ఔటన్ = అగుట; ఎఱుంగక = తెలియక; ఈ = ఈ; కపట = మాయా; సంసారంబున్ = సంసారమును; నిక్కంబు = సత్యమైనది; కాన్ = అయినట్లు; తలచున్ = బావించును; మూఢుడు = మూర్ఖుడు; సత్య = సత్యము; దాన = దానము; కరుణ = దయా; ధర్మ = ధర్మము; ఆది = మున్నగువానినుండి; నిర్ముక్తుండు = వదలినవాడు; ఐ = అయ్యి.
భావము:
అయ్యయ్యో! మృత్యువు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడు దగ్గర చుట్టమా? సేవకులు భక్తితో సేవంచాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాళ్ళతో కానీ మలచాడా? సత్యం ఇలా ఉండగా, మూర్ఖుడు సత్యమూ దానమూ దయా ధర్మమూ మొదలైనవాటిని వదలివేస్తున్నాడు. ఈ మాయాసంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=647
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:
Post a Comment