Thursday, February 16, 2017

కాళియమర్దనము – విషకుచయుగ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-654-వ.
ఆ సమయంబున నంద యశోదాదులు హరిం జూచి యధికం బైన శోకంబున నిట్లనిరి.
10.1-655-క.
"వికుచయుగ యగు రక్కసి
వికుచదుగ్దంబుఁ ద్రావి విషవిజయుఁడ వై
విరుహలోచన! యద్భుత
వియుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా!

టీకా:
ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; నంద = నందుడు; యశోద = యశోద; ఆదులు = మొదలగువారు; హరిన్ = కృష్ణుని; చూచి = చూసి; అధికంబు = పెరిగిపోయినది; ఐన = అయినట్టి; శోకంబునన్ = దుఃఖముతో; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.
విష = విషముగల, దుష్టమైన; కుచ = చన్నుల; యుగ = జంటగలామె; అగు = ఐనట్టి; రక్కసి = రాక్షసి; విష = విషపూరిత; కుచ = చను; దుగ్దంబున్ = పాలను; త్రావి = తాగి; విష = విషప్రభావముపై; విజయుడవు = జయించినవాడవు; ఐ = అయ్యి; విషరుహలోచన = కృష్ణా {విషరుహలోచనుడు - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; అద్భుత = ఆశ్చర్యకరమైన; విషయుండు = వృత్తాంతముకలవాడవు; అగు = ఐన; నీ = నీ; కున్ = కు; సర్ప = పాము యొక్క; విషము = విషము; ఎక్కెను = వంటికి పట్టినది; కదా = కదా.

భావము:
అప్పుడు నందుడు యశోద మొదలైనవారు కృష్ణుడిని చూసి చాలా ఎక్కువ దుఃఖంతో ఇలా అన్నారు.
"ఓ కన్నయ్యా! విషపూరితమైన, దుష్టమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ విషాన్ని జయించిన వాడవు నువ్వు; విషము (నీటి) యందు పుట్టు పద్మాలలాంటి కన్నులు కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్షా! అట్టి నీకు పాము విషం ఎక్కిందా? ఇదేంటయ్యా ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది?
విషమము అంటే దుష్టము అని అర్థం (సూర్యారాయాంధ్ర) కూడా ఉన్నది. అలా పూతన, కాళీయుల దుష్టత్వాన్ని స్ఫురింపజేస్తూ, యమకానుప్రాసతో అలంకారిస్తూ, “ష”కార దుర్గమప్రాసతో చెప్పిన పోతన పాటించిన సందర్భ శుద్ధి బహు రమ్యంగా ఉంది.

No comments: