Sunday, September 4, 2016

క్షీరసాగరమథనం – శుద్ధముగ సురల


అష్టమ స్కంధము : సురాసుర యుద్ధము
8-328-క.
శుద్ధముగ సురల కమృతము
సిద్ధించిన నసుర వరులు సిడిముడిపడుచున్
క్రుద్ధులు నానాయుధ స
న్నద్ధులు నయి యుద్ధమునకు డచిరి బలిమిన్.
టీకా:
          శుద్ధముగన్ = సంపూర్ణముగా; సురల్ = దేవతల; కున్ = కు; అమృతమున్ = అమృతమును; సిద్ధించినన్ = సమకూరినందువల్ల; అసుర = రాక్షస; వరులు = వీరులు; సిడిముడి = చీకాకు; పడుచున్ = చెందుతూ; క్రుద్ధులు = కొపముగలవారు; నానా = వివిధ; ఆయుధ = ఆయుధములతో; సన్నధులు = సంసిద్ధమైనవారు; అయి = ఐ; యుద్ధమున్ = పోరుట; కున్ = కు; నడచిరి = బయలుదేరిరి; బలిమిన్ = బలవంతముగా.
భావము:
          దేవతలకే అమృతం సంపూర్ణంగా సమకూరి నందువలన రాక్షస వీరులకు చీకాకు పుట్టింది. వారు అనేక రకాల ఆయుధాలతో సేనలతో యుద్ధానికి సిద్ధపడి బయలుదేరారు.
          అమృతం సాధించటంలోని కష్టం, ఆ కష్టానికి ఫలం దక్కకపోవడంతో మనసు కష్టపెట్టుకున్న తీవ్రతలను కష్టసాధ్యమైన ద్ధ కార ప్రాసతో సూచించిన తీరు బావుంది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: