8-362-వ.
అయ్యెడ
8-363-క.
సారథి వేయు హయంబుల
తే రాయిత పఱచి
తేర దేవేంద్రుఁడు దా
నారోహించెను దైత్యుఁడు
దారత మాతలిని శూలధారం బొడిచెన్.
టీకా:
ఆ = ఆ; ఎడన్ =
సమయము నందు.
సారథిన్ = సారథి;
వేయు = వెయ్యి (1,000);
హయంబులన్ = గుర్రములను;
తేరు = రథమును;
ఆయిత = సిద్దము;
పఱచి = చేసి;
తేర = తీసుకురాగా;
దేవేంద్రుడు = ఇంద్రుడు;
తాన్ = అతను;
ఆరోహించెను = ఎక్కెను;
దైత్యుడు = రాక్షసుడు;
ఉదారతన్ = గట్టిగా;
మాతలిని =
సారథిని; శూల = శూలము యొక్క;
ధారన్ = వాడిదనముతో;
పొడిచెన్ = పొడిచెను.
భావము:
జంభాసురుని
గదాఘాతానికి ఐరావతం నేలకు వాలిపోయిన ఆ సమయంలో . . .
ఇంద్రుని
సారథి అయిన మాతలి, వెయ్యి (1000) గుర్రాలను పూన్చిన రథాన్ని సిద్ధం చేసి తెచ్చాడు.
ఇంద్రుడు అధిరోహించాడు. అప్పుడు ఆ బంభాసురుడు వాడియైన బల్లెంతో మాతలిని గట్టిగా
పొడిచాడు,
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment