అష్టమ
స్కంధము : నముచివృత్తాంతము
8-372-వ.
అప్పుడు
నముచి నిలువంబడి.
8-373-మ.
తన చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధ శోకాత్ముఁడై
కనకాంతంబును నశ్మసారమయమున్ ఘంటాసమేతంబునై
జనదృగ్దుస్సహమైన శూలము నొగిన్ సారించి వైచెన్ సురేం
ద్రునిపై దీన హతుండవౌ దని మృగేంద్రుంబోలి గర్జించుచున్.
టీకా:
అప్పుడు = అప్పుడు;
నముచి = నముచి;
నిలువంబడి = నిలబడి.
తన = తన యొక్క;
చుట్టంబులన్ = బంధువులను;
చంపెన్ = చంపెను;
వీడు = ఇతడు;
అనుచున్ = అనుచు;
ఉద్యత్ = ఉప్పొంగిన;
క్రోధ = కోపము;
శోక = దుఃఖము కల;
ఆత్ముడు = మనసు కలవాడు;
ఐ = అయ్యి; కనక = బంగారము;
అంతంబునున్ = చివరగలది;
అశ్మసార = ఇనుముతో;
మయము =
పోతపోసినది;
ఘంటా = గంటలుతో;
సమేతంబునున్ = కూడినది;
ఐ = అయ్యి; జన = జనులకు;
దృక్ = చూడ;
దుస్సహము = శక్యముగానిది;
ఐన = అయిన; శూలమున్ = బల్లెమును;
సారించి = సాచిపెట్టి;
వైచెన్ = వేసెను;
సురేంద్రుని = ఇంద్రుని;
పైన్ = మీదకు;
దీనన్ =
దీనితో; హతుండవు = చచ్చినవాడవు;
ఔదు = అయ్యెదవు;
అని = అని; మృగేంద్రు = సింహము;
పోలి = వలె;
గర్జించుచున్ = గర్జించుచు.
భావము:
బల,
పాకాసురులు మరణించిన పిమ్మట, యుద్ధ భూమిలో ఇంద్రునికి నముచి ఎదురునిలిచి. . .
తన
బంధువులను దేవేంద్రుడు చంపాడని అధికమైన దుఃఖం, కోపం ఉప్పొంగాయి. బంగారపు పిడీ,
గంటలూ కలిగి జనులకు చూడటానికే భయంపుట్టేలా ఉన్న ఇనప శూలాన్ని చేపట్టాడు. “దీనితో చస్తావు” అని సింహంలా గర్జిస్తూ ఆ శూలాన్ని సాటిపెట్టి ఇంద్రుడిపైకి విసిరాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment