8-321-వ.
అప్పుడు
8-322-మ.
అమరవ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పా
నము జేయం గని చంద్రభాస్కరులు సన్నల్ చేయ
నారాయణుం
డమరారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడెన్ సుధాసిక్త మై
యమరత్వంబును జెందె మూర్ధముఁ దదన్యాంగంబు నేలం బడెన్.
8-323-ఆ.
అజుఁడు వాని శిరము నంబరవీథిని
గ్రహము జేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను బట్టు చుండు.
టీకా:
అప్పుడు = అప్పుడు.
అమర = దేవతల;
వ్రాతము = సమూహము;
లోనన్ = అందు;
జొచ్చి = ప్రవేశించి;
దివిజుండు = దేవతారూపుడు;
ఐ = అయ్యి; రాహు = రాహువు;
పీయూష = అమృత;
పానమున్ = తాగుటను;
చేయన్ = చేయుచుండగ;
కని = చూసి;
చంద్ర = చంద్రుడు;
భాస్కరులు = సూర్యులు;
సన్నల్ = సైగలు;
చేయన్ =
చేయగా; నారాయణుండు = విష్ణుమూర్తి;
అమరరాతి = రాక్షసుని;
శిరంబున్ = తలను;
చక్ర = చక్రాయుధము యొక్క;
ఆహతిన్ = దెబ్బచేచ;
తున్మాడెన్ = నరకివేసెను;
సుధా =
అమృతముచేత; సిక్తము = తడసినది;
ఐ = అగుటచేత;
అమరత్వంబున్ = చావులేకపోవుటను;
చెందెన్ = పొందినది;
మూర్ధమున్ = తల;
తత్ = అతని;
అన్య = మిగిలిన;
అంగంబున్ =
దేహము; నేలన్ = భూమిపైన;
పడెన్ = పడిపోయెను.
అజుడు =
బ్రహ్మదేవుడు;
వాని = అతని;
శిరమున్ = తలను;
అంబర = గగన;
వీథిన్ = తలమున;
గ్రహమున్ = గ్రహముగా;
చేసి = చేసి;
పెట్టి = ఉంచి;
గారవించె = గౌరవించెను;
వాడున్ = అతడు;
పర్వములను = అమావాస్యపూర్ణిమలను;
వైరంబున్ = పగతో;
తప్పక =
వదలకుండ; భాను = సూర్యుడు;
చంద్రములన్ = చంద్రుడులను;
పట్టుచుండు =
పట్టుచుండును.
భావము:
మోహిని
అలా అమృతం అంతా అమరులకే పోస్తున్న సమయంలో. . .
రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా
సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో
రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది.
మొండెం నేలపై కూలిపోయింది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment