Sunday, September 18, 2016

క్షీరసాగరమథనం – బాహుబలంబున

8-348-క.
బాహుబలంబున నింద్రుఁడు
సాసమున బలిని గెలువ మకట్టి సము
త్సామున వజ్ర మెత్తిన
హాహానినదంబు జేసి ఖిల జనములున్.
8-349-వ.
ఇట్లు సముద్యత భిదుర హస్తుండై యింద్రుండుఁ దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచననందను నుపలక్షించి యిట్లనియె.

టీకా:
          బాహుబలంబునన్ = భుజబలముతో; ఇంద్రుడు = ఇంద్రుడు; సాహసమునన్ = సాహసముతో; బలిని = బలిచక్రవర్తిని; గెలువన్ = గెలుచుటకు; సమకట్టి = పూనుకొని; సముత్సాహమునన్ = పట్టుదలతో; వజ్రమున్ = వజ్రాయుధమును; ఎత్తిన = పైకెత్తగా; హాహా = హాహాకారముల; నినదంబున్ = కేకలను; చేసిరి = చేసితిరి; అఖిల = సమస్తమైన; జనములున్ = వారును.
          ఇట్లు = ఇలా; సముద్యత = పైకెత్తిన; భిదుర = వజ్రాయుధమును; హస్తుండు = చేతధరించినవాడు; ఐ = అయ్యి; ఇంద్రుండు = ఇంద్రుడు; తన = తన; పురోభాగంబునన్ = ఎదుట; ఆక్రమించుచున్న = పరాక్రమిస్తున్న; విరోచననందనున్ = బలిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
          అంతట బలిచక్రవర్తిని జయించడానికి సాహసించి బాహుబలంతో పూనుకుని ఇంద్రుడు పట్టుదలగా వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దానితో రాక్షసు లందరూ హాహాకారాలు చేశారు.
          ఇలా వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని జళిపిస్తూ, ఇంద్రుడు తన ఎదుట పరాక్రమం ప్రదర్శిస్తున్న బలిచక్రవర్తితో ఇలా అన్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: