8-338-క.
ఆ యసురేంద్రుని బహుతర
మాయాజాలంబులకును మా ఱెఱుఁగక వ
జ్రాయుధ ముఖరాదిత్యుల
పాయంబును బొంది చిక్కుపడిరి నరేంద్రా!
8-339-వ.
అప్పుడు
8-340-క.
ఇయ్యసురుల చేఁ జిక్కితి
మెయ్యది దెరు?
వెందుఁ
జొత్తుఁ? మిటు పొలయఁ గదే
యయ్యా! దేవ! జనార్దన!
కుయ్యో! మొఱ్ఱో! యటంచుఁ గూయిడి రమరుల్
టీకా:
ఆ = ఆ; అసురేంద్రుని
= రాక్షసరాజు యొక్క;
బహుతర = చాలా ఎక్కువ యైన;
మాయా = మాయల;
జాలంబుల్ = సమూహముల;
కునున్ = కు;
మాఱు = విరుగుడు;
ఎఱుగకన్ = తెలియక;
వజ్రాయుధ = ఇంద్రుడు;
ముఖర =
మొదలగు; ఆదిత్యులు = ద్వాదశాదిత్యులు;
అపాయంబునున్ = ఆపదలు;
పొంది = పొంది;
చిక్కుపడిరి = చిక్కులపాలైరి;
నరేంద్ర = రాజా.
అప్పుడు = ఆ
సమయమునందు.
ఈ = ఈ; అసురుల్ =
రాక్షసుల; చేన్ = చేతిలో;
చిక్కితిమి = చిక్కుకొంటిమి;
ఎయ్యది = ఏది;
తెరువు =
దారి; ఎందున్ = దేనియందు;
చొత్తుము = దాగెదము;
ఇటు = ఇక్కడకు;
పొలయగదే = రమ్ము;
అయ్యా = తండ్రీ;
దేవ = దేవుడా;
జనార్దన = హరి;
కుయ్యో = కుయ్యో;
మొఱ్ఱో =
మొఱ్ఱో; అటంచున్ = అనుచు;
కూయిడిరి = మొరపెట్టిరి;
అమరుల్ = దేవతలు.
భావము:
ఓ
పరీక్షిన్మహారాజా! ఆ రాక్షస రాజేంద్రుడు బలి పన్నిన రకరకాల మాయా జాలాలకు విరుగుడు తెలియని
వజ్రాయుధ ధారి అయిన ఇంద్రుడుతో సహా దేవతలు దిక్కులు తెలియక చిక్కులలో పడ్డారు.
ఆ
సమయంలో దేవతలు.
“దేవా! జనార్దనా! ఈ
రాక్షసరాజు మాయాజాలాలలో చిక్కుకుపోయాము. ఇప్పుడు మాకు దారేది? ఇప్పుడు
ఎక్కడకి పోవాలి? ఇక్కడకి రావయ్యా! మమ్ము కాపాడవయ్యా! కుయ్యో మొర్రో” అంటూ విష్ణువునకు మొరపెట్టుకున్నారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment