Thursday, September 8, 2016

క్షీరసాగరమథనం – వజ్రదంష్ట్ర్రాంచిత

8-332-సీ.
జ్రదంష్ట్ర్రాంచిత వ్యజనంబులును బర్హ
చామరంబులు సితచ్ఛత్త్రములును
జిత్రవర్ణధ్వజచేలంబులును వాత
లితోత్తరోష్ణీష జాలములును
ప్పుళ్ళ నెసఁగు భూ కంకణంబులుఁ
జండాంశురోచుల స్త్రములును
వివిధ ఖేటకములు వీరమాలికలును
బాణపూర్ణములైన తూణములును
8-332.1-ఆ.
నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర
సైన్యయుగ్మకంబు చాల నొప్పె 
గ్రాహతతుల తోడఁ లహంబునకు వచ్చు
సాగరములభంగి నవరేణ్య!

టీకా:
            వజ్ర = వజ్రమువలెకఠినమైన; దంష్ట్ర = కోరలు; అంచిత = అందమైన; వ్యజనంబులును = అలపట్టాలు; బర్హ = నెమలియీకల; చామరములు = వింజామరలు; సిత = తెల్లని; ఛత్రములును = గొడుగులు; చిత్ర = రంగురంగుల; వర్ణ = రంగుల; ధ్వజ = జండా; చేలంబులునున్ = గుడ్డలు; వాత = గాలిచేత; చలిత = చలింపబడిన; ఉత్తర = అలంకరాములు; ఉష్ణీష = కిరీటముల; జాలములునున్ = సమూహములు; చప్పుళ్ళను = శబ్దములను; ఎసగు = అతిశయించు; భూషణ = ఆభరణములు; కంకణంబులు = కంకణములు; చండాంశు = సూర్యునివంటి; రోచులన్ = మెరిసెడి; శస్త్రములును = ఆయుధములు; వివిధ = రకరకముల; ఖేటకములున్ = డాళ్ళు; వీర = వీరుల; మాలికలు = హారములు; బాణ = బాణములతో; పూర్ణములు = నిండినవి; ఐన = అయిన; తూణములును = అమ్ములు. 
            నిండి = నిండుగా; పెచ్చురేగి = చెలరేగి; నిర్జర = దేవతల; అసుర = రాక్షస; వీర = వీరుల; సైన్య = సైన్యముల; యుగ్మకంబు = ఉభయములుగలిగి; చాలన్ = మిక్కలి; ఒప్పెన్ = చక్కగానుండెను; గ్రాహ = మొసళ్ళ; తతుల = సమూహముల; తోడన్ = తోటి; కలహంబున్ = పోరాటమున; కున్ = కు; వచ్చు = వచ్చుచున్న; సాగరముల = సముద్రముల; భంగిన్ = వలె; జనవరేణ్య = మహారాజ.

భావము:
          ఓ మహారాజా! అప్పుడు ఆ రెండు పక్షాల సైన్యాలూ, కఠినమైన కోరలూ, అందమైన అలపజ్జాలూ, నెమలి పురులూ, వింజామరలు, వెల్లగొడుగులు, రంగురంగుల జండాలు, గాలికి కదలాడుతుండే తలపాగాలు, ధ్వనించే కంకణాలు మున్నగు ఆభరణాలు, సూర్యకాంతికి మెరుస్తుండే ఆయుధాలూ, రకరకాల డాలువార్లు, వీర హారాలు, బాణాలతో నిండిన అమ్ముపొదులు కలిగి చెలరేగాయి. ఆ ఉభయసైన్యాలు మొసళ్ళ గుంపులతో కూడి పోరాడటానికి వచ్చిన రెండు సముద్రాలవలె ఒప్పి ఉన్నాయి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: