8-355-వ.
అని యి
ట్లాక్షేపించి.
8-356-క.
వీరుఁడు దానవ నాథుఁడు
నారసముల నింద్రు మేన నాటించి మహా
ఘోరాయుధ కల్పములగు
శూరాలాపములు చెవులఁ జొనిపెన్ మరలన్.
8-357-వ.
ఇట్లు
తథ్యవాది యైన బలిచే నిరాకృతుండై
8-358-క.
శత్రువు నాక్షేపంబునఁ
దోత్రాహత గజము భంగిఁ ద్రుళ్ళుచు బలి నా
వృత్రారి వీచి వైచిన
గోత్రాకృతి నతఁడు నేలఁగూలె నరేంద్రా!
టీకా:
అని
= అని; ఇట్లు =
ఇలా; ఆక్షేపించి = తూలనాడి.
వీరుడు = శూరుడు;
దానవనాథుడు = బలిచక్రవర్తి;
నారసములన్ = బాణములను;
ఇంద్రు = ఇంద్రుని;
మేనన్ =
దేహమునందు; నాటించి = వేసి;
మహా = గొప్ప;
ఘోర = ఘోరమైన;
ఆయుధ = బాణములకు;
కల్పములు = సమానములైనవి;
అగు = అయిన;
శూరాలాపములు = సూటిపోటిమాటలు;
చెవులజొనిపెన్ = వినిపించెను;
మరలన్ = ఇంకను.
ఇట్లు
= ఇలా; తథ్యవాది
= సత్యవాది; ఐన = అయిన;
బలి = బలి; చేన్ = చేత;
నిరాకృతుండు =
తిరస్కరింపబడినవాడు;
ఐ = అయ్యి.
శత్రువున్ = శత్రువు
యొక్క; ఆక్షేపంబునన్ = దూషణములచే;
తోత్రాహత = అంకుశముచే;
హత = పొడవబడిన;
గజము =
ఏనుగు; భంగిన్ = వలె;
త్రుళ్ళుచున్ = తుళ్ళిపడుతూ;
బలిన్ = బలిని;
ఆ = ఆ; వృత్రారి = ఇంద్రుడు;
వీచి = విసిరి;
వైచినన్ = వేయగా;
గోత్ర = కొండ;
ఆకృతిన్ =
వలె; అతడు = అతడు;
నేలన్ = నేలమీద;
కూలెన్ = కూలిపోయెను;
నరేంద్రా = రాజా.
భావము:
ఇలా
దేవేంద్రుడిని తూలనాడి . . .
వీరాధివీరుడూ,
దానవసామ్రాజ్యాధినేతా అయిన బలిచక్రవర్తి ఇంద్రుని శరీరం మీద నాటేలా వాడైన
ఇనపబాణాలు వేసాడు. అతని చెవులు చిల్లులు పడేలా భీకరమైన పలుకుల వంటి సూటిపోటి మాటలు
పలికాడు.
ఇలా
సత్యవాది అయిన బలిచక్రవర్తి తిరస్కారాలు విన్నట్టి ఇంద్రుడు. . .
అంకుశం
దెబ్బ తిన్న ఏనుగులాగ త్రుళ్ళిపడ్డాడు; ఆగ్రహంతో బలిని పట్టుకుని వజ్రాయుధంతో కొట్టాడు; దానితో బలిచక్రవర్తి పెద్ద పర్వతంలా కూలి పడిపోయాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment