Friday, September 9, 2016

క్షీరసాగరమథనం – భేరీ భాంకారంబులు

8-333-క.
భేరీ భాంకారంబులు
వాణ ఘీంకారములును రహరి హేషల్
భూరి రథనేమి రవములు
ఘోములై పెల్లగించెఁ గులశైలములన్.

టీకా:
          భేరి = భేరీ వాద్యాలనుండి; భాంకారంబులున్ = భం యనెడి శబ్దములు; వారణ = ఏనుగుల; ఘీంకారములును = ఘీంకారములు; వర = శ్రేష్ఠమైన; హరి = గుర్రముల; హేషల్ = సకిలింపులు; భూరి = మిక్కిలిపెద్దవైన; రథ = రథముల; నేమి = చక్రముల ఇరుసుల; రవములున్ = శబ్దములు; ఘోరములు = భయంకరమైనవి; ఐ = అయ్యి; పెల్లగించెన్ = తల్లకిందులుచేసెను; కులశైలములన్ = కులపర్వతములను.

భావము:
          భేరీ వాద్యాలనుండి వెలువడే భం అనే శబ్దాలూ, ఏనుగుల ఘీంకారాలూ, గుర్రాల సకిలింపులూ, పెద్ద పెద్ద రథచక్రాల శబ్దాలూ ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కులపర్వతాలు సైతం తలకిందులేపోతున్నాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: