Monday, September 19, 2016

క్షీరసాగరమథనం – జగతిన్ వైరి

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
8-350-మ.
తిన్ వైరి మొఱంగి గెల్చుటదియున్ శౌర్యంబె ధైర్యంబె? తా
వాఁడయ్యును దన్నుఁ దా నెఱిఁగి సార్థ్యంబునుం గల్గియున్
వానిం గని డాఁగెనేని మెయి చూపం జాలఁడేనిం గటా! 
రే బంధులు? దిట్టరే బుధులుఁ? న్యల్ గూర్తురే? దానవా!

టీకా:
          జగతిన్ = లోకములో; వైరిన్ = శత్రువునకు; మొఱంగి = మోసగించి; గెల్చుట = నెగ్గుట; అదియున్ = అదికూడ; శౌర్యంబె = శూరత్వమా; ధైర్యంబె = ధైర్యమా; తాన్ = అతను; మగవాడు = పురుషుడు; అయ్యున్ = అయ్యి యుండియు; తన్నుదానెఱిగి = ఒంటిమీదతెలివికలిగి; సామర్థ్యంబునున్ = తగినశక్తి; కల్గియున్ = కలిగుండి; పగవానిన్ = శత్రువును; కని = చూసి; డాగెనేని = దాక్కొనినచో; మెయిన్ = ఒళ్ళు; చూపజాలడు = కనిపించలేనివాడు; ఏనిన్ = అయితే; కటా = అయ్యో; నగరే = నవ్వరా; బంధులున్ = బంధువులు; తిట్టరే = దూషించరా; బుధులున్ = పండితులు; కన్యల్ = ఆడపిల్లలు; కూర్తురే = ఇష్టపడుతురా; దానవా = రాక్షసుడా.

భావము:
           ఓ రాక్షసుడా! మాయతో మోసగించి గెలవడం లోకంలో ఎక్కడైనా శౌర్యమూ కాదు; ధైర్యమూ కాదయ్యా.  పౌరుషం కల మగవాడు తన శక్తిసామర్థ్యాలు తానెరిగి, ఎదుటివానిని ఎదిరించాలి; అంతటి శక్తి ఉన్నా, మాయ చేసి కనిపించకుండా దెబ్బతీస్తే; చుట్టాలు నవ్వుతారు; పండితులు తిడతారు; ఆడపిల్లలు పెదవి విరుస్తారు సుమా.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: